ఎయిర్ EVని, కామెట్ EV పేరుతో భారతదేశ మార్కెట్‌లో ప్రవేశపెడుతున్నట్లు దృవీకరించిన MG
ఎంజి కామెట్ ఈవి కోసం ansh ద్వారా మార్చి 03, 2023 05:32 pm ప్రచురించబడింది
- 72 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కొత్త కామెట్ ‘స్మార్ట్’ EVని రెండు-డోర్‌ల అల్ట్రా-కాంపాక్ట్‌గా అందిస్తున్నారు, ఇందులో అవసరమైన అన్నీ ఫీచర్‌లు ఉంటాయని అంచనా
-
కామెట్ EVకి 1034 బ్రిటిష్ ఎయిర్ؚప్లేన్ పేరును ఇచ్చారు.
-
ఎయిర్ EVలో విధంగా, దీన్ని కూడా బహుళ బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందించవచ్చు.
-
పెద్ద టచ్ؚస్క్రీన్ డిస్ప్లే, ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ؚబ్యాగ్ؚలు ఉంటాయని అంచనా.
-
MG దీన్ని రూ.9 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందించవచ్చు.
భారతదేశానికి కొత్త ఎంట్రీ-లెవెల్ EVని పరిచయం చేస్తున్నట్లు కొంతకాలం క్రితం MG మోటార్స్ ప్రకటించింది. వాహన ఆవిష్కరణ ముందే, దాని పేరును కామెట్ EVగా అధికారికంగా ధృవీకరించింది. MG చేత 'స్మార్ట్' EVగా వర్ణించబడిన ఈ ఎలక్ట్రిక్ కారు వాస్తవానికి ఎయిర్ EV యొక్క పేరు మార్చబడిన వెర్షన్, ఇది ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించబడింది. ఈ ఇండియా-స్పెక్ ఎలక్ట్రిక్ కార్ పేరు, అదే పేరుతో ఉన్న 1034 బ్రిటిష్ ఎయిర్ؚప్లేన్ నుంచి ప్రేరణ పొందింది.
బ్యాటరీ ప్యాక్ మరియు పరిధి
కామెట్ EV వాహనం పేరు మార్చిన MG ఎయిర్ EV వెర్షన్ؚ అయినందున, దీని స్పెసిఫికేషన్‌లు కూడా ఒకేలా ఉండే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా, ఎయిర్ EV 17.3 kWh, 26.7 kWh రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వస్తుంది, ఇవి రెండూ రేర్-వీల్-డ్రైవ్ సెట్అప్ؚలో 40PS ఎలక్ట్రిక్ మోటార్ؚతో జత చేయబడతాయి. చిన్న బ్యాటరీ ప్యాక్ 200 Km, పెద్ద బ్యాటరీ ప్యాక్ 300 Km మైలేజ్ అందించగలవు అని అంచనా.
ఫీచర్‌లు మరియు భద్రత
ఎయిర్ EVతో సహా, MG లైన్అప్ؚలో ఉన్న మిగిలిన వాహనాల విధంగానే కామెట్ EV కూడా సాంకేతికతతో ఉంటుంది అని అంచనా. పెద్ద టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, కనెక్టెడ్ కార్ టెక్, ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ؚలో అమర్చబడిన కంట్రోల్స్ ఉండవచ్చు. ప్రయాణీకుల భద్రత కోసం, కామెట్ EVలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ؚబ్యాగ్ؚలు, EBDతో ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రేర్ వ్యూ కెమెరాలను కూడా అందించవచ్చు.
ఇది కూడా చూడండి: MG ఎయిర్ EV 15 చిత్రాలలో వివరించబడింది
ధర మరియు పోటీదారులు
రూ.9 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో ప్రారంభమై, కామెట్ EV ఈ సంవత్సరం చివరలో మార్కెట్‌లో అడుగుపెట్టవచ్చని అంచనా. ఈ ధరలో, ఇది దేశంలో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కార్‌గా నిలుస్తుంది. ఈ కారు టాటా టియాగో EV, సిట్రోయెన్ eC3లతో పోటీ పడవచ్చు.
0 out of 0 found this helpful