• English
  • Login / Register

ఎస్500 కూపేను మరియు ఎస్63 ఏఎంజి వాహనాలను జూలై 30 న విడుదల చేయబోతున్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా

జూలై 09, 2015 03:58 pm sourabh ద్వారా ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: మెర్సెడెజ్-బెంజ్ ఇండియా, రెండు అందమైన వాహనాలను ప్రారంభించడం ద్వారా దాని ఎస్- క్లాస్ నమూనాల లైనప్ విస్తరిస్తోంది. ఈ ఎస్ క్లాస్ లో రాబోయే మోడల్స్ ఏమిటంటే, ఒకటి ఎస్500 కూపే మరియు రెండవది శక్తివంతమైన ఎస్63 ఏఎంజి. ఈ రెండు మోడల్స్ ను జూలై 30 న ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ ఎస్500 కూపే వాహనం, 4.7 లీటర్ వి8 ట్విన్ టర్బో ఇంజన్ తో రాబోతుంది. ఈ ఇంజన్, గరిష్ట్టంగా 5250 నుండి 5500 rpm వద్ద 453 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, 1800 నుండి 3500 rpm వద్ద 700 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. అంతేకాకుండా, ఇదే ఇంజన్ భారతదేశం లో ఉన్న ఎస్500 సెడాన్ లో కూడా ఉంది. ఇది ఫోర్స్ ఇండియా యొక్క పూనే ప్లాంటులో తయారు చేయబడింది.

ఎస్500 కూపే మరియు ఎస్63 ఏఎంజి కూపే మధ్య తేడా విషయానికి వస్తే, ఏఎంజి మోడల్ ఏఎంజి బ్రాండింగ్, పెద్ద బహుళ-స్పోక్ అల్లాయ్ వీల్స్, అగ్రస్సివ్ బంపర్స్ మరియు ఒక క్వాడ్-ఎగ్జాస్ట్ యూనిట్ వంటి వాటితో రాబోతుంది.

ఈ ఏఎంజి ఎస్63 వాహనం, 5.5 లీటర్ వి8 బై టర్బో ఇంజన్ తో రాబోతుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 585 bhp గల పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, 900 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ 7-స్పీడ్ ఏఎంజి స్పీడ్ షిఫ్ట్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఏఎంజి మోడల్, 0 kmph నుండి 100 kmph వేగాన్ని చేరడానికి రేర్ వీల్ డ్రైవ్ తో 4.2 సెకన్ల సమయం పడుతుంది మరియు 4 మేటిక్ ఆల్ వీల్ డ్రైవ్ తో అయితే 3.9 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు, ఈ వాహనం అత్యధికంగా 250 kmph వేగాన్ని చేరుకోగలుగుతుంది.

ఇటీవల, ఈ సంస్థ యొక్క తయారీదారుడు కొత్త మోడళ్ల జంట ను మరియు స్థానికంగా తయారుచేయబడే వేరియంట్ లను పరిచయం చేసింది. అవి వరుసగా, త్రీ కోణాల స్టార్ కంపెనీ అయిన ఈ సంస్థ, స్థానికంగా పూనే వారి తయారీ నుండి జిఎల్ ఏ ఎస్యువి ఉత్పత్తి ని ప్రారంభించింది. దీనికి ముందు, తయారీదారుడు స్థానికంగా తయారుచేయబడిన కొత్త సి-క్లాస్ డీజిల్ ను రెండు లక్షల తగ్గింపుతో రూ. 37.9 లక్షల వద్ద ప్రవేశపెట్టాడు. 

అంతేకాక మార్చిలో, మెర్సిడెస్ బెంజ్ ఇండియా, దాని ఉత్పత్తి శ్రేణి లో ఫేస్లిఫ్ట్ సిఎలెస్ 250 సిడి ఐ ను ప్రారంభించింది. ఈ వాహనాన్ని రూ.76.5 లక్షల వద్ద ప్రవేశపెట్టారు. అయితే ఈ వాహనాన్ని ఈ క్లాస్ మరియు ఎస్ క్లాస్ మద్యలో ఉంచారు. ఇప్పుడు రాబోయే వాహనాలను సిబియు విధానం ద్వారా భారతదేశంలో అమ్మనున్నారు. 

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience