• English
  • Login / Register

మెర్సిడేజ్ ఎస్ క్లాస్ కాబ్రియోలే యొక్క ఫోటోలు బహిష్కృతం అయ్యాయి, లోపల ఫోటో గ్యాలరీ లో చూడవచ్చు

మెర్సిడెస్ ఎస్-క్లాస్ 2012-2021 కోసం nabeel ద్వారా సెప్టెంబర్ 03, 2015 04:35 pm సవరించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షో లో విడుదల త్వరలో ఉన్నప్పటికీ, ఎస్-క్లాస్ కాబ్రియోలే యొక్క ఊరించే ఫోటోలు బయట పెట్టిన తరుణంలో మెర్సిడేజ్ వారు కారు యొక్క చిత్రాలను బహిష్కృతం చేసారు. పోటీదారులతో పోలిస్తే ఈ కారు కి అమర్చబడి ఉన్న సాఫ్ట్ టాప్ అన్నిటి కంటే పొడవైనది. కీ ద్వారానే ఈ టాప్ ని నిర్వహించే వీలు ఉంది మరియూ కారు గంటకి 60 కీ.మీ వేగంలో నడిచేటప్పుడే టాప్ తెరుచుకోడానికి 20 సెకన్ల సమయం పడుతుంది. ఈ ఎస్ క్లాస్ కాబ్రియోలే 1971 లో ప్రవేశించిన తరువాత దాని ఉనికిని మరొక సారి చాటుకుంది. 

కారు యొక్క ప్రాథమిక ఎస్ 500 వేరియంట్ కి 449బీహెచ్పీ మరియూ 71.38కేజీఎం టార్క్ ని ఉత్పత్తి చేసే 4.7-లీటర్ ట్విన్-టర్బో వీ8 ఇంజిను ఉంది. ఇది వెనుక వైపు వీల్స్ కి శక్తిని అందిస్తుంది. మరోపక్క, ఏఎంజీ ఎస్ 63 లో 577బీహెచ్పీ శక్తి మరియూ 91.77కేజీఎం యొక్క టార్క్ ని విడుదల చేసే 5.5-లీటర్ ట్విన్ టర్బో వీ8 కలిగి ఉంటుంది. ఇది అయితే వెనుక వైపు వీల్స్ కి లేదా అన్ని వీల్స్ కి 4మాటిక్ ఆల్-వీల్-డ్రైవ్-సిస్టం ద్వారా శక్తిని అందిస్తుంది. క్యాబ్రియోలే యొక్క బరువుని హార్డ్ టాప్ కూపే లాగానే యధాతధంగా ఉండేడట్టుగా మెర్సిడేజ్ వారు వెనుక వైపు భాగాలకి మెగ్నీషియం మరియూ అలుమినియం ని ఉపయోగించారు. వెనుక వైపు మెర్సిడేజ్ యొక్క లోగో వెనుక క్యామెరా ని లేదా ఎంపిక గల 360 డిగ్రీ క్యామెరా ని కప్పి వేస్తుంది. ఈ లోగో మాన్యువల్ గా పాప్ చేస్తే తెరుచుకునే బూట్ డోర్ కి ఇది ఒక లెవర్ గా పనిచేస్తుంది.

కారులో  ఒక ఎస్ క్లాస్ పేరు కి తగ్గట్టు ఊహించిన లక్షణాలనే పొందుపర్చారు. కాబ్రియోలె ఆప్షనల్ గా మెర్సిడీస్ ఎయిర్ క్యాప్ రక్షణ వ్యవస్థ లక్షణాన్ని కలిగి ఉంది. ఇది వెనుక సీట్లలో కాన్వెక్స్ ప్యానెల్లతో పాటూ రూఫ్ ఫ్రేమ్ లో విద్యుత్ తో విస్తరింపచేయగలిగే విండ్ డెఫ్లెక్టర్ ని కలిగియుండి క్యాబిన్ లోపల అల్లకల్లోలాన్ని తగ్గిస్తుంది. ఇంకా ఈ కారు మెర్సెడీస్ కొత్త థెర్మోటోనిక్ క్లైమేట్ కంట్రోల్ వ్యవస్థను కూడా కలిగి ఉంది. ఇది సెన్సార్స్ ని ఉపయోగించి ఆటోమెటిక్ గా రూఫ్ పైన మరియు క్రింద ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. లోపలివైపు,కారు వివిధ రంగులలో లెథర్ ఎంపికను కలిగి ఉంది. అధనంగా హీటెడ్ స్టీరింగ్, సెంటర్ ఆర్మ్ రెస్ట్ మరియు సీట్లను కలిగి ఉంది.

భద్రత విభాగంలో ఎస్-క్లాస్ కాబ్రియోలె స్వయంప్రతిపత్తి బ్రేకింగ్ మరియు పెడస్ట్రైన్ గుర్తింపు,స్టీరింగ్ ఫంక్షన్ తో అడాప్టివ్ క్రూయిజ్ నియంత్రణ, అడాప్టివ్  హై బీం అసిస్ట్ మరియు నైట్ వ్యూ వంటి లక్షణాలను కలిగి ఉంది. అంతేకాకుండా, ఎస్-క్లాస్ కాబ్రియోలె రోలోవర్ ప్రొటక్టివ్ వ్యవస్థను కూడా కలిగి ఉంది. ఇది వినియోగదారులను రక్షించేందుకు రోల్ బాల్స్ రేర్ హెడ్ రెస్ట్ నుండి ఆటోమెటిక్ గా పెరుగుతాయి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Mercedes-Benz ఎస్-క్లాస్ 2012-2021

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience