• English
  • Login / Register

ఎస్63 ఏఎంజి సెడాను ను రేపు ప్రారంభించబోతున్న మెర్సిడెస్ బెంజ్

మెర్సిడెస్ ఎస్-క్లాస్ 2012-2021 కోసం అభిజీత్ ద్వారా ఆగష్టు 11, 2015 11:16 am ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: మెర్సిడెస్ దాని యొక్కఏఎంజి తో భారతదేశం నలుమూలల అదరహో అనిపించుకోనుంది. జర్మన్ వాహన తయారీ దారుడు అక్షరాలా తమ యొక్క కార్లతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేయనున్నాడు. కొన్ని రోజుల క్రితంవారుఏఎంజి వైపు నుండి రెండు వాహనాలను తీసుకువచ్చారు అవి ఎస్63ఏఎంజి కూప్ మరియు జి63 ఏఎంజి క్రేజీ కలర్. ఇప్పుడు, వీరి ఎస్63 సెడాన్ ను రేపు ఆగస్టు 11, 2015 న ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు.

ఎస్63సెడాన్, ఏఎంజి వంటి అద్భుతమైనలగ్జరీ వాహనానికి ఒక ఉదాహరణ. ఇది ఒక 5.5 లీటర్ ద్వి టర్బో వి8 ఇంజన్ నుండి శక్తిని గ్రహిస్తుంది. ఇది వాహనాన్నిప్రపంచంలో అత్యంత శక్తివంతమైన లగ్జరీ సెడాన్ గాచేస్తుంది. ఈ మోటార్ అధికంగా 585 బి హెచ్ పి శక్తిని, మరియు 900 నానోమీటర్ల టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కారును చాలా వేగవంతమైనదిగా చేస్తుంది. ఈ మిల్లు వెనుక చక్రాల ఆకృతీకరణ తో 4.4 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వరకు, మరియు 4-మ్యాటిక్ వ్యవస్థ ద్వారా 4 సెకన్లలో 0-100 కిలోమీటర్ల  వరకు  వేగవంతం చేసుకోగలుగుతుంది.

బయటికి చూడడానికి ఎస్ 63, ఏఎంజి  సాధారణ వెర్షన్ ఎస్ క్లాస్ ను పోలి ఉంటుంది. కానీతేడాలు చాలా ప్రముఖ ప్రదేశాలలో ఉన్నాయి. ఫ్రంట్ బంపర్ కి ఇరువైపులా ఉన్న స్కూప్స్, ముందు ఫెండర్ల మీద వి8 ద్వి టర్బో అక్షరాలు, 19 అంగుళాల నకిలీ ఏఎంజి చక్రాలు, ట్విన్ క్వాడ్ ఏఎంజి ఎగ్జాస్ట్ వ్యవస్థతో కూడిన వెనక డిఫ్యూజర్స్ వంటి తేడాలు ఉన్నాయి. అలాగే బ్లాక్డ్ ఔట్ రూఫ్ మరియు అస్పష్టమైన వి8 బర్బుల్ ఇవన్ని కలిసి ఉండడం వలన ఇతర కార్ల కంటే ఎక్కువగా ఆదరణను పొందుతాయి.

లోపల కూడా ఏఎంజి చాలా అంశాలను కలిగి ఉంది. అత్యంత ప్రముఖమైన ఏఎంజి బ్యాడ్జింగ్ తో బాగా బలపరిచిన ఏఎంజి స్పోర్ట్ సీట్లు ఉన్నాయి. ఇంకా దీని యొక్క లోపలి భాగం అపోలిస్ట్రీ  మంచి నప్పా లెదర్ తో చేయబడింది. ముఖ్యంగా లోపలి భాగం గోధుమ రంగులో షేడ్స్ తో అలంకరించబడి ఉంది. ఇది రోడ్ మీద వెళ్లే వారిని వెంటనే ఆకర్షిస్తుంది. ఇంకా లెదర్ అపోలిస్ట్రీ తో ప్రీమియం రంధ్రాలు, కేంద్ర ఆర్మ్ రెస్ట్ మీద ఏఎంజి చెక్కు, మలుపు తిరిగే ఏఎంజి స్టీరింగ్ వీల్, మరియు డ్రైవర్ సమాచారం క్లస్టర్ పైన ఆయిల్ ప్రెజర్ మరియు ఉష్ణోగ్రత వంటి సమాచారాలను  మరియు  ఇతర ప్రీమియం మెరుగులను కలిగి ఉంది.

ఈ కారు ధర దాదాపుగా రూ. 2.60 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

was this article helpful ?

Write your Comment on Mercedes-Benz ఎస్-క్లాస్ 2012-2021

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience