Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మారుతి XL 5 మళ్ళీ టెస్టింగ్ చేయబడుతూ మా కంటపడింది. ఆటో ఎక్స్‌పో 2020 లో మొదటిసారి అడుగుపెట్టనున్నది అని అంచనా

మారుతి ఎక్స్ ఎల్ 5 కోసం sonny ద్వారా జనవరి 15, 2020 12:28 pm ప్రచురించబడింది

వాగన్ఆర్ యొక్క ప్రీమియం వెర్షన్ మారుతి యొక్క నెక్సా షోరూమ్‌ల ద్వారా అమ్మబడే అవకాశం ఉంది

  • మారుతి XL5 కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్‌ తో కొత్త ముఖ భాగాన్ని కలిగి ఉంటుందని భావిస్తున్నాము.
  • XL5 మారుతి యొక్క BS6 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ద్వారా పవర్ ని అందుకుంటుంది. గేర్‌బాక్స్ ఎంపికలలో 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ AT ఉంటాయి.
  • XL5 DRL తో కూడిన LED హెడ్‌ల్యాంప్స్, ఆటో AC, వాగన్ఆర్ కంటే పెద్ద చక్రాలు వంటి అద్భుతమైన లక్షణాలను పొందుతుందని భావిస్తున్నాము.
  • XL5 ధర 5 లక్షల నుంచి రూ .6.5 లక్షల మధ్య ఉంటుంది.

ఆటో ఎక్స్‌పో 2020 కేవలం ఒక నెల దూరంలో మాత్రమే ఉంది, అయితే ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో తమ కార్లను ప్రదర్శించడానికి మారుతి సుజుకి కొన్ని మోడళ్లను కలిగి ఉంది. వాటిలో ఫేస్‌లిఫ్టెడ్ మారుతి విటారా బ్రెజ్జా మరియు వాగన్ఆర్ యొక్క కొత్త ప్రీమియం వెర్షన్ ఉన్నాయి, దీనిని XL5 అని పిలుస్తారు. ఈ రెండూ ఇటీవల టెస్టింగ్ చేయబడుతూ కవరింగ్ తో మళ్లీ మా కంటపడ్డాయి.

XL5 ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ పైన ఉన్న బోనెట్-లైన్ వెంట LED DRL లతో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్‌ ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ తో కొద్దిగా రీ-డిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్‌ను పొందుతుంది. XL5 వాగన్ R కన్నా పెద్దది మరియు ఎక్కువ ప్రీమియంగా కనిపించే 15-ఇంచ్ అలాయ్స్ ని (ఇగ్నిస్ నుండి అరువు తెచ్చుకుంది) పొందుతుంది. వెనుక వైపున, ఇది వాగన్ R యొక్క టైల్లెంప్‌ల మాదిరిగానే ఆకారంలో మరియు స్టయిల్ లో ఉన్న టైల్లైట్స్‌లో LED ఎలిమెంట్స్ ని కలిగి ఉంటుంది. XL5 నెక్సా గొలుసు ద్వారా షోరూమ్‌ లో అమ్మకం చేయబడుతుంది.

మారుతి XL 5 ను 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ తో 83 Ps పవర్ / 113 Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ లో వాగన్ఆర్ యొక్క 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ AMT ఉన్నాయి. XL5 వాగన్ఆర్ కంటే ఎక్కువ ప్రీమియం అప్హోల్స్టరీ తో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, LED హెడ్ల్యాంప్స్ మరియు పుష్-బటన్ స్టార్ట్-స్టాప్ వంటి ఖరీదైన లక్షణాలను అందిస్తుంది.

మారుతి XL5 ఖరీదైన ప్రత్యర్థులైన మారుతి ఇగ్నిస్, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్‌ తో పాటు ఫోర్డ్ ఫిగో, ఫ్రీస్టైల్‌ తో పోటీ పడనుంది. దీని ధర రూ .5 లక్షల నుంచి రూ .6.5 లక్షల వరకు ఉంటుందని, ఎర్టిగా ఆధారిత XL 6 వంటి పూర్తిస్థాయిలో లోడ్ చేయబడిన లిమిటెడ్ వేరియంట్‌లో లభిస్తుందని భావిస్తున్నారు.

Share via

Write your Comment on Maruti ఎక్స్ ఎల్ 5

R
rajendra vitthalrao nagre
Jan 29, 2025, 9:06:24 AM

Want Xl 5,likely to irtiga n ground clearance must be up 200mm

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఎలక్ట్రిక్
Rs.3.25 - 4.49 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.5 - 8.45 లక్షలు*
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.6.16 - 10.15 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.4.70 - 6.45 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర