• English
    • Login / Register

    మారుతి వాగన్ ఆర్ ఆటో గేర్ షిఫ్ట్ రూ. 4.76 లక్షలకు విడుదల అయ్యింది

    మారుతి వాగన్ ఆర్ 2013-2022 కోసం అభిజీత్ ద్వారా నవంబర్ 16, 2015 02:36 pm సవరించబడింది

    • 17 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    జైపూర్:

    మారుతీ వారు ఏఎంటీ (ఆటోమాటిక్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) వెర్షన్ వాగన్ ఆర్ మరియూ స్టింగ్ రే ని విడుదల చేశారు. దీని ప్రారంభ ధర వాగన్ ఆర్ కి రూ.4.76 లక్షలు మరియూ స్టింగ్ రే ని రూ.4.98 లక్షలకు (ఎక్స్-షోరూం, ఢిల్లీ) ధరకు విడుదల చేశారు. ఈ ఆటోమాటిక్ ని వీఎక్స్ఐ వేరియంట్ గా రెండు కార్లకు అందుబాటులోకి తెచ్చింది.  వాహన రక్షణ కి ప్యాసెంజర్ మరియూ డ్రైవర్ ఎయిర్ బ్యాగ్స్ తో పాటు ఏబీఎస్ ని అందిస్తున్నారు. ఈ అన్ని లక్షణాలు కారు యొక్క అన్ని వేరియంట్స్ కి ఎంపిక (ఆప్షన్) రూపంలో అందుబాటులో ఉన్నాయి. 

    విడుదల గురించి మాట్లాడుతూ, ఎమెసైఎల్ యొక్క మార్కెటింగ్ మరియూ సేల్స్ కి ఎగ్జెక్యూటివ్ డైరెక్టర్ అయిన మిస్టర్. ఆర్.ఎస్. ఖల్సీ గారు," భారతీయ కారు మార్కెట్ లో వాగర్ ఆర్ ఎంతో ప్రముఖమైన కారు. ఇది అత్యధికంగా అమ్ముడుపోయే మొదటి ఐదు కార్లలో ఒకటి. మా కంపెనీ నుండి ఆటోమాటిక్ గేర్ బాక్స్ ని అందుకుంటున్న మూడవ కారుగా వాగన్ ఆర్ నిలుస్తుంది. ఎక్కువ మందికి ఆటోమాటిక్ యొక్క సౌకర్యం తక్కువ ధరకే అందించాలి అనేది మా ఆకాంక్ష. డ్యువల్ ఎయిర్ బ్యాగ్స్ మరియూ ఆటీ-లాక్ బ్రేకింగ్ వంటి లక్షణాలు ఈ కార్లకి మరింత ప్రాముఖ్యం పెంచుతాయి అని భావిస్తున్నాము," అని అన్నారు.  

    రెండు కార్లకు హంగుల పరంగా అలాగే ఉన్నాయి. ఏఎంటీ గేర్ లెవల్ లోపల ఉండటంతో ఏజీఎస్ గేర్ షిఫ్ట్ బ్యాడ్జింగ్ ని టెయిల్‌గేట్ పై అమర్చడం జరిగింది.  ఇందులో 1.0-లీటర్ కే-నెక్స్ట్ ఇంజిను ఉండటం వలన, ఆటోమాటిక్ ఉండటంతో క్యాలిబ్రేటెడ్  ఈసీయూ సహాయంతో ఇంధన సామర్ధ్యం మెరుగ్గా అందిస్తుంది. మైలేజీ దాదాపుగా మాన్యువల్ మాదిరిగానే లీటరుకి 20.51 కిలోమీటర్లు అందిస్తుంది.

    వాగన్ ఆర్
    వేరియంట్  ధర (రూ.) వేరియంట్  ధర(రూ.)
    వీఎక్సై ఏఎంటీ 476935 వీఎక్సై ఏఎంటీ (ఆప్షన్) 509609
    ఎల్ఎక్సై (ఆప్షన్)

    439212

    వీఎక్సై (ఆప్షన్)

    464609

    స్టింగ్ రే

    వేరియంట్

    ధర (రూ.)

    వేరియంట్

    ధర(రూ.)

    వీఎక్సై ఏఎంటీ

    498594

    వీఎక్సై ఏఎంటీ (ఆప్షన్)

    531238

    ల్ఎక్సై (ఆప్షన్)

    458219

    వీఎక్సై (ఆప్షన్)

    486238
    was this article helpful ?

    Write your Comment on Maruti వాగన్ ఆర్ 2013-2022

    ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience