స్విఫ్ట్ పరిమిత ఎడిషన్ వెర్షన్ అయిన స్విఫ్ట్ ఎస్పి ని ప్రారంభించనున్న మారుతీ సంస్థ
ఆగష్టు 31, 2015 05:49 pm konark ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
పండుగ సీజన్ లో ఫోర్డ్ హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో దాని గొప్పతనాన్ని ని నిర్రుపించుకుకొనే క్రమంలో అక్టోబర్ లో కొత్త ఫిగో హ్యాచ్బ్యాక్ ప్రారంభించనున్నది. మారుతి సుజుకి కూడా స్విఫ్ట్ ఎస్పి అనే స్విఫ్ట్ యొక్క ప్రత్యేక ప్రచురణను ప్రారంభించనున్నది. ఈ లిమిటెడ్ ఎడిషన్ ఎల్ డి ఐ/ఎల్ ఎక్స్ ఐ వేరియంట్లను కలిగి ఉండవచ్చునని మరియు బ్లూటూత్ తో 4 స్పీకర్లతో అమర్చబడియున్న ఆడియో వ్యవస్థ మరియు యుఎస్బి కనెక్టివిటీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్, కీలెస్ ఎంట్రీ తో సెంట్రల్ లాకింగ్, నాలుగు పవర్ విండోస్, 60:40 మడవగలిగే వెనుక సీటు, స్టీరింగ్ కవర్లు, ఫాగ్ ల్యాంప్స్, వీల్ కవర్స్ వంటి లక్షణాలను కలిగి ఉండవచ్చు. ఈ మోడల్ అనేక లక్షణాలతో దాని అవుట్గోయింగ్ మోడల్ కంటే అధనపు ధరను కలిగి ఉండవచ్చని అంచనా.
మారుతి సుజుకి ఇండియా దేశంలో ఇప్పటివరకూ ఈ హ్యాచ్బ్యాక్ లను 2 మిలియన్ యూనిట్లు కంటే ఎక్కువ విక్రయించింది. స్విఫ్ట్ మొదట 2005 లో ప్రారంభించింది మరియు 2011 లో వినియోగదారులకు కొత్తదనాన్ని అందించే విధంగా ఒక తరం మార్పు చూసింది.
యాంత్రికంగా కారు ఎటువంటి మార్పు ని పొందలేదు. హుడ్ క్రింద 1197cc స్థానభ్రంశన్ని అందించే వివిటి తో కె- సిరీస్ పెట్రోల్ యూనిట్ తో అమర్చబడి 83bhp శక్తిని మరియు 1248cc స్థానభ్రంశాన్ని అందించే డిడి ఐఎస్ మల్టీ జెట్ ఇంజిన్ తో 74bhp శక్తిని అందిస్తుంది.