Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

గుర్గావ్, మానేసర్ ప్లాంట్లలో రెండు రోజులు తమ ఉత్ప త్తిని ఆపడానికి చూస్తున్న మారుతి సంస్థ

సెప్టెంబర్ 10, 2019 02:06 pm sonny ద్వారా ప్రచురించబడింది

భారతదేశం యొక్క అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ఆటోమోటివ్ పరిశ్రమలో మందగమనం సమయంలో జాబితా నియంత్రణ కోసం మరింత కఠినమైన చర్యలను ఆశ్రయిస్తుంది

ఆర్థిక మాంద్యం ఆటోమోటివ్ పరిశ్రమని బాగా దెబ్బతీస్తుంది, ఈ ప్రభావం గత నెలలుగా పెరుగుతోందని మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మారుతి సుజుకి ఆర్ధిక మాద్యంతో దెబ్బతిన్న అతి పెద్ద కారు తయారీ సంస్థలలో ఒకటి, ఇది హర్యానాలోని రెండు ప్లాంట్లలో - 7 మరియు 9 సెప్టెంబర్ 2019 న రెండు రోజుల పాటు ఉత్పత్తిని నిలిపివేస్తుంది.

ప్రకటన ప్రకారం, గుర్గావ్ మరియు మనేసర్ ప్లాంట్లకు ఉత్పత్తి ఆ రెండు తేదీల రోజులలో ఉండదు. దేశం యొక్క అతిపెద్ద కార్ల తయారీదారు తన యొక్క ముఖ్యమైన కార్ల ఉత్పత్తిని రెండు రోజుల పాటు మూసివేయడం అనేది చాలా పెద్ద విషయం మరియు ఇది ఆర్ధిక మాధ్యం దిబ్బ తినింది అని చెప్పడానికి ఒక సూచనగా చెప్పవచ్చు.

జూలై 2019 లో, మారుతి 1 లక్షల కన్నా తక్కువ యూనిట్లను రవాణా చేసింది, ఇది సంవత్సరానికి గణాంకాలలో 36.7 శాతం పడిపోయింది. గత నెల గణాంకాలు జూలై కంటే 94,728 వద్ద తక్కువగా ఉన్నాయి, అయితే సంవత్సరానికి తగ్గుదల ఆగస్టు 2018 కంటే 34.3 శాతం తక్కువగా ఉంది.

ఆటోమోటివ్ తిరోగమనానికి దోహదపడే అనేక కారణాలలో ముఖ్యమైనది, బిఎస్ 6 ఉద్గార నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత డీజిల్ ఇంజిన్లలో స్థిరత్వం లేకపోవడం అనేది పెద్ద అంశంగా చెప్పవచ్చు. ఏప్రిల్ 2020 నుండి అన్ని డీజిల్ ఎంపికలను నిలిపివేసే ప్రణాళికలను ప్రకటించిన మొట్టమొదట సంస్థ మారుతి. దీనితో పాటుగా, కొనుగోలుదారుల అంచనాలు పెరిగిపోవడం మరియు సరసమైన ధరలలో మంచి లక్షణాలు కలిగి ఉన్న కార్లు కొనుక్కోవాలన్న కోరిక పెరిగి సరైన నిర్ణాయాలు తీసుకోలేకపోతున్నారు. దీని వలన అమ్మకాలు తగ్గిపోతున్నాయి.

సంబంధిత వార్త: 2019 లో ఆటోమోటివ్ పరిశ్రమ మందగమనం వెనుక ప్రముఖ 8 కారణాలు

నెలవారీ అమ్మకాల గణాంకాలు తగ్గిపోతున్న ఈ కాలంలో మొత్తంగా చాలా ఉద్యోగాలు పోయాయి మరియు ఇతర ప్రక్రియలు కూడా ప్రభావితం కావడంతో డీలర్‌షిప్‌లు మూసివేయబడ్డాయి, అన్నీ అమ్ముడుపోని కార్ల జాబితాను నిర్వహించే ప్రయత్నంలో ఇవన్నీ జరిగాయి. ఈ సంవత్సరం కార్ల తయారీ కర్మాగారంలో ఈ ఒక్క సంస్థ మాత్రమే ఉత్పత్తి అందించడం లేదని మనం చెప్పలేము, ఇతర తయారీదారులు త్వరలో కూడా ఇదే విధమైన బాటలో వెళ్ళవచ్చు అని భావిస్తున్నాము.

ఇవి కూడా చదవండి: రిజిస్ట్రేషన్ ముగిసే వరకు బిఎస్ 4 వాహనాలు బిఎస్ 6 కాలంలో కార్యాచరణలో ఉంటాయి : ఆర్థిక మంత్రి

s
ద్వారా ప్రచురించబడినది

sonny

  • 13 సమీక్షలు
  • 0 Comments

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర