• English
  • Login / Register

మారుతి సుజుకి ఎస్-క్రాస్ వర్సెస్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్

మారుతి ఎస్-క్రాస్ 2017-2020 కోసం sourabh ద్వారా జూలై 21, 2015 11:45 am ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: మారుతి సుజుకి దాని మొట్టమొదటి కాంపాక్ట్ క్రాస్ ఓవర్ అయిన ఎస్-క్రాస్ ప్రారంభించడం ద్వారా కాంపాక్ట్ ఎస్యూవీ లలో రెనాల్ట్, ఫోర్డ్ మరియు హ్యుందాయ్ సరసన చేరుతుంది.  భారతదేశం యొక్క అతిపెద్ద కార్ల తయారీదారుడి నుండి వచ్చే ఈ కాంపాక్ట్ ఎస్యూవీని రెనాల్ట్ డస్టర్, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మరియూ హ్యుందాయ్ క్రేటాతో కూడా పోటీగా పరీక్షించబడుతుంది. మనం ఇప్పటికే రెనాల్ట్ డస్టర్ మరియు క్రేటా తో ఎస్-క్రాస్ యొక్క పోలిక కవర్ చేశాము, ఇప్పుడు క్రాస్ఓవర్ అయిన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కి వ్యతిరేకంగా ఎలా నిలుస్తుందో చూద్దాము. 

బాహ్య స్వరూపం

ఈకోస్పోర్ట్ ఉప 4-మీటర్ల కాంపాక్ట్ వాహనం కానీ ఎస్-క్రాస్ కాదు కాబట్టి, క్రాస్ఓవర్ అవడం వలన కాంపాక్ట్ వాహనంపై ఖచ్చితమైన పై చేయి ఉంది.  మారుతి సుజుకి ఎస్-క్రాస్ 4300ఎమెం  x 1765ఎమెం x 1590ఎమెం  యొక్క పొడవు-వెడల్పు మరియూ ఎత్తు పరిమాణాలతో భారీగా కనిపిస్తోంది, అదే ఈకోస్పోర్ట్  3999ఎమెం x 1765ఎమెం x 1708ఎమెం యొక్క పొడవు-వెడల్పు మరియూ ఎత్తు పరిమాణాలతో ఉంది. కానీ అదే సమయంలో దాని ఉప 4 మీటర్ల బ్యాడ్జ్ వలన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వాహన ఎక్సైజ్ డ్యూటీ తొలగింపు ప్రయోజనం అందుకోవడం వలన ధర తగ్గింది.

కానీ ఈకోస్పోర్ట్ తో పోలిస్తే, ఎస్-క్రాస్ యొక్క భారీ 2520ఎమెం వీల్ బేస్ వలన సౌకర్యవంతమైన మోకాలి గది పొందింది. ఈకోస్పోర్ట్ కి 200ఎమెం యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ ఉండగా ఎస్-క్రాస్ కి 180ఎమెం యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఇందు చేత, ఎస్-క్రాస్ ముఖ్యంగా భారతీయ రోడ్లపై అందులోనూ ఎత్తుగా ఉండే స్పీడ్ బ్రేకర్లతోనూ సమస్యలు ఎదుర్కోక తప్పదు.

ఇంజిను మరియూ దాని పని తీరు

మారుతి సుజుకి ఎస్-క్రాస్ డీజిల్ లో మాత్రమే లభ్యం. డీజిల్ మారుతి సుజుకి నుండి రెండు ఇంజిను ఎంపికలు లభ్యం, ఒకటి 1.3 లీటర్ మరియు 1.6 లీటర్. 1.3 లీటర్ ఇంజిను యొక్క 4000ఆర్పీఎం వద్ద 90పీఎస్ మరియూ 1750ఆర్పీఎం వద్ద 200ఎనెం గా ఉంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో అందించడమైంది.  1.6 లీటర్ ఇంజన్ 3750ఆర్పీఎం వద్ద 120పీఎస్ గరిష్ట శక్తిని మరియు 1750ఆర్పీఎం వద్ద 320ఎనెం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. 1.6 లీటర్ ఇంజన్ కి, 6-స్పీడ్ గేర్ బాక్స్ అమర్చబడి ఉంది.

ఈకోస్పోర్ట్ పెట్రోల్ మరియు డీజిల్ లో లభ్యం అయినప్పటికీ, ఇక్కడ కేవలం డీజిల్ వాహనం గురించి మాత్రమే మాట్లాడదాము. 1.5-లీటర్ ఇంజన్ 2000-2750ఆర్పీఎం వద్ద 91పీఎస్ ని మరియూ 3750ఆర్పీఎం వద్ద 204ఎనెం టార్క్ ని ఉత్పత్తి చేసే సామర్ధ్యం కలిగి ఉంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ని కలిగి ఉంది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ క్రాస్ఓవర్ అవడం వలన పై చేయి దక్కించుకున్నా, ఈకోస్పోర్ట్ లో లోపాలు ఉన్నప్పటికీ కూడా ధర సరసమైనది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Maruti ఎస్-క్రాస్ 2017-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience