జూన్ 7 న వెలువరించనున్న మారుతి సుజుకి "ఎస్-క్రాస్"

జూన్ 04, 2015 02:22 pm అభిజీత్ ద్వారా సవరించబడింది

జైపూర్: చాలా కాలం గా ఎదురుచూస్తున్న కాంపాక్ట్ ఎస్యువి అయిన మారుతి, ఎస్-క్రాస్ ను రాబోయే జూన్ 7, 2015 లో బహిర్గతం చేయబోతున్నారు. ఈ కారును ఈ ఏడాది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల టైటిల్ స్పాన్సర్గా ఉంది మరియు మలేషియా లో జరుగుతున్న కార్యక్రమంలో దీనిని మొదటి సారిగా ప్రదర్శించనున్నారు.  

ఐఐఎఫ్ఎ (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమి) అత్యంత ప్రతిష్టాత్మక భారతీయ చలనచిత్రాలు అవార్డులను ప్రధానం చేసే సంస్థ, దీనికి భారీ ఎత్తులో అభిమానులు కూడా ఉన్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థ దేశ విదేశాలలో పెద్ద సంఖ్యలో ప్రజలను చేరుకోవడానికి మారుతి సుజుకి కి ఒక వేదిక వలే నిలిచింది.

రాబోయే ఎస్ క్రాస్ వాహనాలలో 1.3 లీటర్ డీజిల్ ఇంజెన్ ను అమర్చనున్నారు. అయితే, ఎర్టిగా మరియు సియాజ్ వాహనాలలో 1.6 లీటర్ల డీజిల్ ఇంజెన్ ను అమర్చారు. ఈ రెండు ఇంజెన్లు కూడా ఫియాట్ నుండి తయారుచేయబడినవే. ఎస్ క్రాస్ వాహనాల ఇంజెన్ అత్యధికంగా 90bhp పవర్ ను ఉత్పత్తి చేస్తాయి. మరియు ఈ ఇంజెన్లు  5-స్పీడ్ మాన్యువల్ సిస్టమ్ తో జతచేయబడి ఉంటాయి. మరోవైపు, ఎర్టిగా మరియు సియాజ్ వాహనాల విషయానికి వస్తే, వీటి ఇంజెన్ లు అత్యధికంగా 118bhp పవర్ ను ఉత్పత్తి చేస్తాయి. మరియు ఈ ఇంజెన్లు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడతాయి.

రాబోయే మారుతి సుజుకి ఎస్ క్రాస్స్ లో క్రాస్ ఓవర్ వలనే, ఆల్ అరౌండ్ కార్ క్లేడింగ్, పెద్ద స్వెప్ట్ బేక్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, ముందు మరియు వెనుక బంపర్ తో పాటు లోవర్ స్కఫ్ ప్లేట్స్ మరియు ఫోర్డ్ ఈకోస్పోర్ట్ లో మాదిరిగా బాహ్య రేర్ వ్యూ మిర్రర్స్ పొందుపరచబడి ఉంటాయి.    

భారతదేశం లో ఈ కారుని ఈ సంవత్సరం పండగ సీజన్ లో, అక్టోబర్ నెలలో ప్రారంబించడానికి సిద్దమౌతున్నారు. రెనాల్ట్ డస్టర్, ఈకోస్పోర్ట్ మరియు రాబోయే హ్యుందాయ్  ix25 / క్రీటా వాహనాలతో పోటీ పడటానికి త్వరలో రానుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience