• English
  • Login / Register

రేపే విడుదల అవ్వడనికి సిద్ధంగా ఉన్న మారుతీ సుజికీ ఎస్-క్రాస్

మారుతి ఎస్-క్రాస్ 2017-2020 కోసం nabeel ద్వారా ఆగష్టు 05, 2015 10:37 am ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మారుతీ సుకికీ ఎస్-క్రాస్ కోసం చాలా రోజుల నీరీక్షణకు తెర పడుతోంది. ఈ కారు దేశం అంతటా రేపు ప్రారంభం అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ సరికొత్త ఎస్-క్రాస్ భారత మార్కెట్ లోనికి అడుగు పెట్టి హ్యుందాయ్ క్రెటా, రెనాల్ట్ డస్టర్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, నిస్సాన్ టెరానో, టాటా సఫారి స్ట్రోం మరియు మహీంద్రా స్కార్పియో వంటి వాటితో పోటీ కి సిద్ధంగా ఉంది. ఈ కారు మారుతీ సుజికీ యొక్క కొత్త షోరూం నెక్సా ద్వారా విడుదల కానుంది మరియు రూ .8 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకే విడుదల కానున్నట్టుగా భావన. 

ఈ వాహనం 1.3 లీటర్ మరియు 1.6 లీటర్ డిడి ఐ ఎస్ ఇంజిన్ ఎంపికలతో రాబోతున్నది. దీనిలో పెట్రోల్ వేరియంట్ లేదు. మారుతీ సుజికీ వాహనాలలో పెట్రోల్ ఇంజిన్ లేని వాహనం ఇది ఒక్కటే. దీనిలో 1.3 లీటర్ ఇంజిన్ 90పిఎస్ శక్తిని అందిస్తుంది. అలానే శక్తివంతమైన 1.6 లీటర్ ఇంజిన్ 120పిఎస్ శక్తిని చాలా ఉత్తమంగా అందిస్తుంది. 

దీనిలో అగ్ర శ్రేణి వేరియంట్లు టచ్స్క్రీన్ ప్రదర్శన తో స్మార్ట్ ప్లే సమాచార వ్యవస్థను కలిగి ఉండి ,బ్లూటూత్ కనెక్టివిటీకి మద్దతు ఇస్తాయి. అలానే ఇది వాయిస్ కమాండింగ్లను మరియు సాటిలైట్ నేవిగేషన్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. దీనిలో దిగువ శ్రేణి మోడల్స్ బ్లూటూత్ తో పాటూ ఆడియో వ్యస్థను కలిగి ఉంటాయి. ఈ వ్యవస్థ సిడి/ఎంపి3 ప్లేయర్, యుఎస్బి కనెక్టివిటీ మరియు ఆక్స్-ఇన్ సాకెట్ పోర్ట్ లకు కూడా మద్దతు ఇస్తుంది. దీనిలో అన్ని వేరియంట్స్ కూడా నాలుగు ఉన్నత నాణ్యత స్పీకర్లు మరియు రెండు ట్విట్టర్లను కలిగి ఉంటాయి. 

was this article helpful ?

Write your Comment on Maruti ఎస్-క్రాస్ 2017-2020

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience