• English
  • Login / Register

మారుతీ సుజూకీ వారు నెక్సా ప్రీమియం డీలర్షిప్లను ప్రారంభం చేశారు

జూలై 24, 2015 10:49 am akshit ద్వారా ప్రచురించబడింది

  • 23 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

డిల్లీ: మారుతీ సుజూకీ ఇండియా లిమిటెడ్ వారు ఈరోజు వారి కొత్త ప్రీమియం అమ్మకాల ద్వారం అయిన నెక్సా ని ప్రారంభం చేయడం జరిగింది. కంపెనీ వారు వారి ఎస్-క్రాస్ ని ఈ కొత్త డీలర్షిప్ల ద్వారా మొదటి వారం అమ్మకాలను నిర్వహించనున్నారు.  

"నెక్సా ఒక కొత్త రకమైన ఆతిథ్య అనుభవాన్ని మారుతీ సుజూకీ నుండి అందిస్తుంది. భారతీయ మార్కెట్ మరియూ భారతీయ సమాజం వారు త్వర త్వరగా మార్పుకు లోనవుతూ కొత్త కొత్త కస్టమర్లు పుట్టుకొస్తున్నారు. మేము వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ఉత్పత్తులు అందిస్తూ కస్టమర్ల అంచనాలను అందుకోగలగాలి", అని మారుతీ సుజూకీ ఇండియా లిమిటెద్ కి చీఫ్ ఎగ్సిక్యూటివ్ ఆఫీసరు అయిన కెనిచి అయుకావా అన్నారు.

దాదాపు 35-40 నెక్సా డీలర్షిప్పులు ఎస్-క్రాస్ దేశంలో విడుదల అయ్యే సమయానికి అందుబాటులో ఉంటాయి. ఇవి 6 నుండి 8 నెలలలోగా 100 సంఖ్యకు చేరుకుంటాయి. కంపెనీ వారు ఇప్పటికే ఉన్న 1,000 ఉద్యోగులు కాకుండా 1,500 ఉద్యోగులను అధికంగా నెక్సా డీలర్షిప్పులను చూసుకునేందుకు గాను తీసుకోనున్నారు.  

ఒక పురస్కారాల కార్యక్రమాన్ని 'మై నెక్సా' పేరిట విధేయులైన కస్టమర్లను ప్రోత్సాహించేందుకై నడపనున్నారు. కంపెనీ వారు ఎన్నో బ్రాండులతో అనుసంధానం అయ్యి ఈ పురస్కారాలను క్రెడిట్ కార్డులపై రీడీమ్ పాయింట్స్ గా ఇవ్వనున్నారు.

మారుతీ సుజూకీ ఇండియా లిమిటెడ్ వారు ప్రస్తుత ప్యాసెంజర్ కార్ మార్కెట్ లో 45 శాతం వాటాని అనుభవిస్తున్నారు. ఇప్పుడు 2 మిలియన్ల కార్లు ఏటా 2020 దాకా అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది మొన్న ముగిసిన మార్చి నెల వరకు అమ్మగలిగిన 1.17 మిలియన్స్ మార్కు తో మొదలైంది. ఈ దిశగా నెక్సా షోరూంలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఆశిస్తున్నారు.  

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience