• English
  • Login / Register

మారుతి సుజుకి ఇగ్నిస్ భారతదేశం లో టెస్ట్ చేస్తున్నప్పుడు అనధికారికంగా కనిపించింది

మారుతి ఇగ్నిస్ కోసం saad ద్వారా ఫిబ్రవరి 11, 2016 01:55 pm ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మైక్రో SUV లో రాబోతున్న ఇగ్నీస్ ఈ సంవత్సరంలో పండుగల సీజన్ లో ప్రారంభం కావాల్సి ఉంది. 

మారుతి సుజికి ఇగ్నీస్ కాన్సెప్ట్ రూపంలో ఇటీవల ముగిసిన ఆటో ఎక్స్పో 2016 వద్ద భారతదేశంలో ప్రవేశించింది. ఈ కారు జాపాన్ లో ప్రారంభించబడిన తరువాత టోక్యో మోటార్ షో లో తొలిసారి ప్రదర్శితమయ్యాక అందరి నోళ్ళల్లో చర్చనీయాశం అయ్యింది. చూస్తుంటే ఇది భారతదేశంలో మొదటిసారి అనధికారికంగా కనిపించిన తరువాత నుండి భారత ప్రేమికుల ఆసక్తి తదుపరి స్థాయికి చేరుకుంది. అనధికారిక చిత్రాల ద్వారా వెళ్ళినట్లయితే కారు యొక్క సైడ్ ప్రొఫైల్ తప్ప మిగిలినది అంతా కూడా నల్ల రంగుతో కప్పబడి ఉంది.  

భారతదేశ ప్రత్యేక వెర్షన్ క్రోమ్ లాడెన్ గ్రిల్ తో జపనీస్ కి విరుద్ధంగా కనిపిస్తుంది. ముఖ్యమైన మార్పులలో రూఫ్లైన్స్ భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా నైపుణ్యంగా తయారుచేయబడ్డాయి. మారుతి సుజుకి కొత్త హెడ్లైట్ క్లస్టర్ ని ప్రత్యేకంగా రూపొందించిన DRLSతో కలిపి అందించింది. ఇంకా దీనిలో ఓఆర్విఎంస్ టర్న్ ఇండికేటర్స్, 18 అంగుళాల అలాయ్స్ మరియు వెనుక అమర్చబడిన స్పాయిలర్స్ బాహ్య భాగాలలో ఒక భాగంగా ఉంది.  


మారుతి సుజుకి ఇగ్నిస్ భారత మార్కెట్ కోసం 1.2 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ మరియు 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ శక్తితో అందించబడుతుంది. దీనిలో  1.2 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ 83bhp శక్తిని మరియు 115Nm టార్క్ ని అందిస్తుంది మరియు 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ 74bhp శక్తిని మరియు 190Nm టార్క్ ని అందిస్తుంది. డీజిల్ ఇంజిన్ సియాజ్ సెడాన్ లో చూసినట్లయితే SHVS టెక్నాలజీతో సహాయం పొందుతుంది. ట్రాన్స్మిషన్ ఎంపికల గురించి మాట్లాడుకుంటే ఈ రెండు ఇంజిన్లు 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ తో జత చేయబడి ఉంటాయి. అయితే పెట్రోల్ ఇంజిన్ CVT ఆటోమేటిక్ గేర్బాక్స్ రూపంలో అదనపు ఎంపికతో అందించబడుతుంది. 

భారతదేశంలో రాబోయే మోడల్ కి ఒక కొత్త పేరుని ఆశిస్తున్నాము. పోటీ పరంగా, మారుతి సుజికి ఇగ్నీస్ సూక్ష్మ SUV లకు చెందిన తాజా విభాగంలో ఎంటర్ అవుతుంది. ఇది మహీంద్రా KUV100 ద్వారా తొలిసారి వచ్చింది. కానీ ఇది ఇతర విభాగాలతో పోటీ పడేలా చేస్తుంది. 

was this article helpful ?

Write your Comment on Maruti ఇగ్నిస్

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience