4 లక్షలకు పైగా పెండింగ్ డెలివరీలను కలిగి ఉన్న మారుతి సుజుకి
మే 15, 2023 02:58 pm rohit ద్వారా ప్రచురించబడింది
- 47 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మొత్తం పెండింగ్ ఆర్డర్‌లలో మూడవ వంతు CNG మోడల్స్‌వే అని మారుతి తెలియచేసింది
గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా కారు తయారీదారుల అమ్మకాలు సానుకూల పెరుగుదలను నమోదు చేసినప్పటికీ, కొన్ని కంపెనీలు మాత్రం సరఫరా అవరోధాలు మరియు మెటీరీయల్ؚ కొరత వంటి వివిధ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలోని అతి పెద్ద కారు తయారీదారు – మారుతి సుజుకి విషయంలో కూడా ఇదే జరుగుతోంది, ఇటీవలి జరిగిన ఇన్వెస్టర్ మీటింగ్‌లో (ఏప్రిల్ 26వ తేదీ) తన భారీ ఆర్డర్ వివరాల గురించి కొన్ని విషయలను మారుతి పంచుకుంది.
మారుతి వ్యాఖ్యలు
పెండింగ్ ఆర్డర్‌ల గురించిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ బర్తి (కార్పొరేట్ ప్లానింగ్ అండ్ గవర్న్మెంట్ అఫైర్స్) ఇలా అన్నారు, “ఈ రోజు ఉదయం వరకు మొత్తం ఆర్డర్ బుక్ 412,000 యూనిట్‌లుగా ఉంది. ఇందులో CNG మూడవ వంతుగా ఉంది. మేము ఆవిష్కరించిన కొత్త SUVల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.”
ఇది కూడా చదవండి: త్వరలోనే పునఃప్రవేశం చేయాలని కోరుకుంటున్న 7 ప్రముఖ కార్‌ల పేర్లు
CNGకి ఎక్కువ డిమాండ్
రాహుల్ బర్తి ప్రకటన ప్రకారం, మారుతి సుమారు 1.4 లక్షల CNG మోడల్‌ల బ్యాక్ؚలాగ్‌ను కలిగి ఉందని అంచనా. ఇదే సమావేశంలో, మారుతి గత ఆర్ధిక సంవత్సరంలో సుమారు 3.3 లక్షల CNG కార్‌లను విక్రయించింది అని వెల్లడించింది, కారు తయారీదారు వెల్లడించిన ప్రకారం ఈ పూర్తి కాలానికి CNG కార్‌ల వాటా 20 శాతంగా ఉంది. టాటా ఇటీవలే ఈ పోటీలోకి ప్రవేశించగా, హరిత ఇంధన ప్రత్యామ్నాయాన్ని అందించే 13 మోడల్‌లలో మారుతి CNG విభాగంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
ఉత్పత్తి మరియు బుకింగ్ؚల అప్ؚడేట్
గుజరాత్ ప్లాంట్‌లో మారుతి మొత్తం 1.44 లక్షల యూనిట్‌లను ఉత్పత్తి చేసింది కానీ ఎలక్ట్రానిక్ కాంపొనెంట్ؚల కొరత కారణంగా ఉత్పత్తి కార్యకలాపాలు ప్రభావితమైనాయని ప్రకటించింది.
ఈ కారు తయారీదారు తమ సరికొత్త మోడల్‌లను ఆటో ఎక్స్ؚపో 2023లో ప్రదర్శించింది – ఇవి 5-డోర్ జిమ్నీ మరియు ఫ్రాంక్స్ క్రాస్ؚఓవర్ SUV. విడుదల కానున్న ఈ ఆఫ్-రోడర్ దాదాపుగా 25,000 బుకింగ్ؚలను సాధించింది అని ఇటీవల నివేదించాము, ఫ్రాంక్స్ 15,500 కంటే ఎక్కువ ప్రీ-లాంచ్ ఆర్డర్‌లను మార్చి చివరి నాటికి అందుకుంది.
గ్రాండ్ విటారాకు కూడా అధిక డిమాండ్‌ను కలిగి ఉంది, ఫిబ్రవరి నాటికి తన మొత్తం బుకింగ్ؚలలో సుమారు 28 శాతం కాంపాక్ట్ SUV బలమైన-హైబ్రిడ్ వేరియెంట్ؚలు (మారుతికి మొదటిసారి) ఉన్నాయని కారు తయారీదారు ప్రకటించారు.
మారుతి తరువాత అడుగు ఏమిటి?
మారుతి నుండి వచ్చే తదుపరి భారీ విడుదల 5-డోర్‌ల జిమ్నీ, ఇది జూన్ ప్రారంభంలో వస్తుందని అంచనా. ఇది ఈ బ్రాండ్ ఆర్డర్ అంకెలను మరింతగా పెంచనుంది. ప్రీ-లాంచ్ బుకింగ్ లెక్కలను చూస్తే, ఆఫ్-రోడర్ విక్రయాలు ప్రారంభమయిన తరువాత డిమాండ్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నాము, ఇది డెలివరీ టైమ్ؚలైన్ؚలను మరింత పెంచవచ్చు.