మరుతి బలెనో బుకింగ్స్ తెరుచుకున్నాయి
మారుతి బాలెనో 2015-2022 కోసం అభిజీత్ ద్వారా అక్టోబర్ 06, 2015 05:34 pm ప్రచురించబడింది
- 15 Views
- 9 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
అక్టోబరు 26న విడుదల అవుతున్న ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మరుతి బలెనో కోసమై బుకింగ్స్ ఇప్పుడు రూ. 11,000 వద్ద మొదలు అయ్యాయి. ఈ బుకింగ్స్ ని అన్ని నెక్సా డీలర్‌షిప్ ల వద్ద స్వీకరిస్తారు.
బుకింగ్స్ మినహా, SHVS హైబ్రీడ్ టెక్నాలజీ ఈ కారులో రాకుండా నేరుగా స్విఫ్ట్ లొనే ఈ 1.3-లీటర్ 75ps ఇంజినుని అందించవచ్చును. కాబట్టి ఇది మైల్డ్ హైబ్రీడ్ టెక్నాలజీ ఉంటే వచ్చే సామర్ధ్యం ఇందులో ఉండకపోవచ్చును. పెట్రోల్ విషయంలో, 1.2-లీటర్ మోటరు కూడా స్విఫ్ట్ ద్వారానే వస్తుంది మరియూ 84ps ని అందిస్తుంది. రెండు ఇంజిన్లుకి 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియూ పెట్రోల్ వాటికి SHVS ఆటోమాటిక్ ఆప్షన్ ని జత చేయబడి ఉంటుంది.
గ్రౌండ్ క్లియరెన్స్ 175mm మరియూ 16-అంగుళాల అల్లోయ్ వీల్స్ ని ఉన్నత శ్రేని వేరియంట్స్ కి అందించనున్నారు అని అంచనా. డిక్కీ స్థలం మునుపటి 354 లీటర్లు కాకుండా ఈసారి 339 లీటర్లు ఉండవచ్చును.
రక్షణ విషయంలో, డ్యువల్ ఎయిర్-బ్యాగ్స్ మరియూ ABS ఎస్ క్రాస్ లో లాగా అన్ని వేరియంట్స్ కి ప్రామాణికంగా అందిస్తున్నారు. స్విఫ్ట్ ఇంకా డిజైర్ కన్నా ఈ కొత్త సుజుకీ వేదికపై నిర్మించబడిన ఈ కారు 15 శాతం బరువు తక్కువగా ఉంది. అంతే కాకుండా ఇది బిగుతుగా కూడా ఉంది, తద్వారా కారు డ్రైవింగ్ మరింత సమర్ధవంతంగా ఉంటుంది.
ఉన్నత శ్రేని వేరియంట్స్ కి లోపల ఎక్కువ స్థలం వచ్చి, లెదర్ సీట్లు ఉంటాయి. బయట వైపు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఇంకా డే టైం రన్నింగ్ LEDs ఉంటాయి.