మారుతి ఎస్-ప్రెస్సో యొక్క ప్రారంభానికి ముందే ఇంటీరియర్ వివరాలు
దీనిలో కొన్ని స్టైలింగ్ సూచనలు మినీ కూపర్ ని మీకు గుర్తు చేస్తాయి! ఒకసారి చూద్దాము
- ఎస్-ప్రెస్సో సెంటర్ లో లొకేట్ చేయబడి ఉన్న ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది.
- పవర్ విండో స్విచ్‌లు కూడా సెంటర్ కన్సోల్‌లో ఉన్నాయి.
- ఎస్-ప్రెస్సో క్యాబిన్ ఆల్-బ్లాక్ థీమ్‌ను కలిగి ఉంది.
- రెండవ వరుసలో ఉన్న మిడిల్ ప్యాసింజర్‌కు రెండు పాయింట్ల సీట్‌బెల్ట్ మాత్రమే లభిస్తుంది మరియు హెడ్‌రెస్ట్ లేదు.
- బూట్ రెండు మధ్య-పరిమాణ సూట్‌కేసులను సులభంగా ఉంచగలదు.
సెప్టెంబర్ 30 న ప్రారంభించబడే ఎస్-ప్రెస్సో యొక్క లోపలి భాగాన్ని ప్రదర్శించే కొత్త బ్యాచ్ చిత్రాలను మేము చూశాము. ఈ చిత్రాలు క్యాబిన్‌ను వివరంగా హైలైట్ చేస్తాయి మరియు రాబోయే రెనాల్ట్ క్విడ్ ప్రత్యర్థి నుండి ఏమి ఆశించాలో తెలుపుతాయి.
డాష్బోర్డ్
డాష్ ఫంకీ డిజైన్‌ను కలిగి ఉన్న ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ని మధ్య భాగంలో ఉంచబడుతుంది మరియు దాని క్రింద ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ప్లేతో ఉంది. టచ్‌స్క్రీన్ క్రింద హజార్డ్ లైట్స్ స్విచ్ ఉంది, ఫ్రంట్ పవర్ విండోస్ కోసం స్విచ్‌లు ఉన్నాయి. మొత్తం సెటప్ ఆరెంజ్ ఇన్సర్ట్‌లతో చుట్టుముట్టబడింది, ఇది మినీ కూపర్ డాష్‌బోర్డ్ ని గుర్తు చేస్తుంది.
అయితే, ఎస్-ప్రెస్సోలో, ఈ లేఅవుట్ ఖర్చులను తగ్గించడానికి సహాయపడుతుంది. స్టీరింగ్‌కు ఆడియో నియంత్రణలు లభిస్తాయి, కానీ ఏ.సి మాత్రం మాన్యువల్ . టాప్ వేరియంట్ వేరియంట్ లో మనకి ఇలా కనిపించింది. అలాగే, ఎస్-ప్రెస్సో కొన్ని వేరియంట్లలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లతో అందించబడుతుంది.
ఇవి కూడా చదవండి: మారుతి ఎస్-ప్రెస్సో స్పెసిఫికేషన్స్, వేరియంట్ వివరాలు లాంచ్ ముందు లీక్ అయ్యాయి
క్యాబిన్ స్పేస్
కారులో కూర్చోకుండా దాని క్యాబిన్ ఎంత విశాలమైనదో మేము చెప్పలేము, అయితే ఇది నలుగురు పెద్దలను హాయిగా కూర్చోబెట్టినట్లు కనిపిస్తుంది. బహుశా యువ కొనుగోలుదారులను ఆకర్షించడానికి క్యాబిన్ పూర్తిగా స్పోర్టి లుక్ కోసం నలుపు రంగులో ఉంటుంది. ఇది నలుగురు ప్రయాణీకులకు నాన్-అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లను కలిగి ఉంది మరియు వెనుక భాగంలో ఉన్న మధ్య ప్రయాణీకుడు ల్యాప్ బెల్ట్ లేదా రెండు-పాయింట్ల సీట్‌బెల్ట్ ఉంటుంది.
బూట్ స్పేస్
ఎస్-ప్రెస్సో ఎంత బూట్ స్పేస్ ఇస్తుందో మారుతి ఇంకా వెల్లడించలేదు. ఏదేమైనా, పై చిత్రం ద్వారా అది మధ్యస్థ-పరిమాణ సూట్‌కేసులను సులభంగా ఉంచగలదని సూచిస్తుంది.
మారుతి ఎస్-ప్రెస్సోకు రూ .4 లక్షల మార్క్ ధర ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఆ ధర వద్ద, దాని అతిపెద్ద ప్రత్యర్థి రెనాల్ట్ క్విడ్. మారుతి యొక్క ఆల్టో కె 10 లేదా డాట్సన్ GO వంటి వాటి నుండి పోటీ ఉంటుంది, ఎందుకంటే వాటి ధరలు ఎస్-ప్రెస్సో ధరల వలే ఉంటాయి.
సంబంధిత వార్త: మారుతి ఎస్-ప్రెస్సో ఆశించిన ధరలు: ఇది రెనాల్ట్ క్విడ్, డాట్సన్ రెడి-GO, GOల కంటే తక్కువగా ఉంటాయా?