• login / register

మారుతి ఎస్-ప్రెస్సో: ఏ రంగు ఉత్తమమైనది?

ప్రచురించబడుట పైన nov 02, 2019 11:22 am ద్వారా dhruv for మారుతి ఎస్-ప్రెస్సో

  • 34 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఎస్-ప్రెస్సో అనేది ఆల్టో K 10 యొక్క ధర పరిధిలో ఉంటూ ఎవరైతే కొంచెం ఫంకీ గా ఉండే కారుని కొనాలని చూస్తున్నారో వారికోసం ఎస్-ప్రెస్సో ఆ అనుభూతిని ఖచ్చితంగా అందిస్తుంది. రంగు ఎంపికల గురించి మేము ఏమనుకుంటున్నామో ఇక్కడ ఉంది

Maruti S-Presso: Which Colour Is The Best?

ఇటీవల విడుదల చేసిన మారుతి ఎస్-ప్రెస్సో ధర రూ .3.69 లక్షల నుండి రూ .4.91 లక్షలు (ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ), SUV లాంటి వైఖరితో ఫంకీగా కనిపించే కారును కొనాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. కానీ మీరు ఏ రంగును ఎంచుకోవాలి? నిర్ణయించడంలో మేము మీకు సహాయం చేస్తాము.

సాలిడ్ సిజెల్ ఆరెంజ్

Maruti S-Presso: Which Colour Is The Best?

మారుతి హైలైట్ చేస్తున్న రంగు ఇది మరియు ఇది కారు యొక్క లక్షణాలను బాగా నొక్కి చెబుతుంది. దీని టాల్‌బాయ్ వైఖరి, బాడీ పైన లైన్స్ మరియు డిజైన్ అంశాలను ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు. మీరు ఎంచుకున్న ఎస్-ప్రెస్సో యొక్క ఏ వేరియంట్‌తో సంబంధం లేకుండా ఈ ఆరెంజ్ షేడ్ నిలుస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

సాలిడ్ సుపీరియర్ వైట్

Maruti S-Presso: Which Colour Is The Best?

భారతదేశంలో తెల్లటి షేడ్ లో అందించబడని కార్లు ఏవీ లేవు మరియు ఎస్-ప్రెస్సో కూడా దీనికి మినహాయింపు కాదు. తెల్లటి షేడ్ బాడీ యొక్క రూపాన్ని డల్ గా చూపించినప్పటికీ, ఇది క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, హెడ్‌ల్యాంప్‌లు మరియు భారీ బ్లాక్ అండ్ వైట్ బంపర్ వంటి డిజైన్ అంశాలపై దృష్టిని తెస్తుంది. మీరు అధిక-స్పెక్ వేరియంట్ కోసం వెళుతున్నట్లయితే మాత్రమే మేము ఈ రంగును సిఫార్సు చేస్తున్నాము, లేకపోతే మీరు డల్ గా కనిపించే S- ప్రెస్సోని కొనుక్కున్నట్లు అవుతుంది.

ఇది కూడా చదవండి: మారుతి ఎస్-ప్రెస్సో వేరియంట్స్ వివరించబడ్డాయి: ఏది ఎంచుకోవాలి?

మెటాలిక్ సిల్కీ సిల్వర్

Maruti S-Presso: Which Colour Is The Best?

తెలుపు-ఎస్-ప్రెస్సో కొద్దిగా డల్ గా కనిపించించగా, మెటాలిక్ సిల్కీ సిల్వర్ షేడ్ మంచిగా ఉంటూ కొంచెం సింపుల్ గా కనిపిస్తుంది. ఇది ప్రతిఒక్కరికీ అంత ఆకర్షణగా కనిపించదు, కానీ కొద్దిగా తీక్షణంగా దీనిని చూస్తే గనుక డిజైన్ అంశాలన్నీ ఈ కలర్ లో హైలైట్ అయ్యి కనిపిస్తాయి. మీరు గనుక మీ కారుని కొంచెం అందంగా ఉండాలనుకుంటే మరియు మరీ అంత ఆకర్షణీయంగా కాకుండా సింపుల్ గా ఉంటూ బాగుండాలి అనుకుంటే ఈ కలర్ మీకు ఖచ్చితంగా సూట్ అవుతుంది. ఇక్కడ అదనపు ప్లస్ ఏమిటంటే, ఈ సిల్వర్ షేడ్ లో క్రోమ్ ఫ్రంట్ గ్రిల్ బాగుంటుంది. 

సాలిడ్ ఫైర్ రెడ్

Maruti S-Presso: Which Colour Is The Best?

ఈ ఎరుపు మరియు ఆరెంజ్ మధ్య ఎంచుకోడానికి మీరు ఏ రంగును ఇష్టపడతారు. రోడ్డుపై రెండూ సమానంగా నిలుస్తాయి, అయినప్పటికీ ఎరుపు రంగు S- ప్రెస్సో యొక్క బాడీ పై కొన్ని లైన్స్ ని మాఫ్ చేస్తుంది. ఈ రంగు ఎస్-ప్రెస్సో యొక్క చాలా వేరియంట్లలో కూడా బాగా కనిపిస్తుంది, ముఖ్యంగా బయట తక్కువ డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నవి. ఉదాహరణకు, క్రోమ్ గ్రిల్‌తో ఎరుపు రంగు బాగా కనిపిస్తుంది మరియు తక్కువ వేరియంట్‌లలో బాడీ కలర్ ఎలిమెంట్స్ లేకుండా కూడా బాగుంటుంది. 

మెటాలిక్ గ్రానైట్ గ్రే

Maruti S-Presso: Which Colour Is The Best?

మీకు ఎస్-ప్రెస్సో యొక్క బంపర్‌లపై ఉన్న భారీ నల్ల బిట్‌లను చూడడానికి ఇష్టం లేకపోతే కాని మీరు ఒకదాన్ని కొనాలని చూస్తున్నట్లయితే, ఈ రంగు మీ కోసం. బాడీ యొక్క రంగు బంపర్లతో సమానంగా ఉంటుంది, ఇది బాడీ రంగు యొక్క పొడిగింపు వలె కనిపిస్తుంది. వ్యత్యాసం గుర్తించదగినది అయినప్పటికీ, ఇది డ్యుయల్ -టోన్ కలర్ స్కీమ్ లాగా ఉంటుంది, ఇవి కంటికి ఆహ్లాదకరంగా ఉంటాయి. మీరు మమ్మల్ని గనుక ఏ రంగు ఇష్టం అని అడిగితే, ఇది మా అభిమాన రంగు.

ఇది కూడా చదవండి: మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో రివ్యూ: ఫస్ట్ డ్రైవ్

పెర్ల్ స్టార్రి బ్లూ

Maruti S-Presso: Which Colour Is The Best?

ఈ బ్లూ షేడ్ చూడడానికి భిన్నంగా నిలుస్తుంది, కానీ ఆరెంజ్ అంత అపీల్ అయితే రాదు. మీకు గనుక జనాలలో భిన్నంగా నిలిచే కారు కావాలనుకుంటే ఇది మీకు సూట్ అవుతుంది. అయినప్పటికీ, ORVM లు మరియు డోర్ హ్యాండిల్స్ వంటి నాన్-బాడీ రంగు అంశాలతో, ఈ రంగు మరీ అంత అద్భుతంగా ఏమీ ఉండదు. కాబట్టి, మీరు హై వేరియంట్ ని కొనుక్కోవాలి అనుకుంటే మాత్రమే ఈ బ్లూ కలర్ షేడ్ మీకు బాగుంటుంది. 

మరింత చదవండి: ఎస్-ప్రెస్సో ఆన్ రోడ్ ప్రైజ్

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన మారుతి ఎస్-ప్రెస్సో

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

Ex-showroom Price New Delhi
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?