మారుతి ఎస్-ప్రెస్సో పెట్రోల్-ఆటోమేటిక్ మైలేజ్: రియల్ Vs క్లెయిమ్
ఎస్-ప్రెస్సోలో ఉన్న మారుతి యొక్క 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ రెండు పెడల్ లతో మాత్రమే నడిపినట్లయితే ఎంత మైలేజ్ ని అందిస్తుంది?
మారుతి ఇటీవలే భారతదేశంలో ఎస్-ప్రెస్సో ను విడుదల చేసింది మరియు ఇతర చిన్న మారుతి కార్ల మాదిరిగానే ఇది పెట్రోల్ ఇంజిన్ తో మాత్రమే లభిస్తుంది. భారతీయ కార్ల తయారీసంస్థ దీనికి మాన్యువల్ మరియు AMT ల మధ్య ఎంపికను అందిస్తుంది మరియు ఫ్యుయల్ ఎఫిషియన్సీ కోసం మేము ఇటీవల AMT ని పరీక్షించాము. ఇంజిన్ స్పెక్స్, క్లెయిమ్ చేసిన ఫ్యుయల్ ఎఫిషియన్సీ మరియు మేము పరీక్షించిన ఎస్-ప్రెస్సో యొక్క నిజమైన ఫ్యుయల్ ఎఫిషియన్సీ ని పరిశీలిద్దాం:
ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ |
1.0-లీటర్ |
పవర్ |
68 PS |
టార్క్ |
90 Nm |
ట్రాన్స్మిషన్ |
5-స్పీడ్ AMT |
క్లెయిమ్ చేసిన ఇంధన సామర్థ్యం |
21.7 kmpl |
పరీక్షించిన ఇంధన సామర్థ్యం (నగరం) |
19.96 kmpl |
పరీక్షించిన ఇంధన సామర్థ్యం (హైవే) |
21.73 kmpl |
ఇది కూడా చదవండి: మారుతి ఎస్-ప్రెస్సో వేరియంట్స్ వివరించబడ్డాయి: ఏది ఎంచుకోవాలి?
సంఖ్యల నుండి, పరీక్షించిన ఎస్-ప్రెస్సో యొక్క ఫ్యుయల్ ఎఫిషియన్సీ మారుతి చేత క్లెయిమ్ చేయబడిన దానితో సమానంగా ఉందని స్పష్టమవుతుంది. సాధారణంగా తయారీదారులు క్లెయిమ్ చేసిన ఫ్యుయల్ ఎఫిషియన్సీ గణాంకాలు వాస్తవ ప్రపంచ పరిస్థితులలో సాధించడం కష్టం కాబట్టి ఇది ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పాలి.
ఇప్పుడు, మీ వినియోగాన్ని బట్టి ఎస్-ప్రెస్సో యొక్క AMT వెర్షన్ నుండి మీరు ఆశించే ఫ్యుయల్ ఎఫిషియన్సీ ని పరిశీలిద్దాం:
50% సిటీ లో 50% హైవే మీద |
25% సిటీ లో 75% హైవే మీద |
75% సిటీ లో 25% హైవే మీద |
20.81 kmpl |
21.26 kmpl |
20.37 kmpl |
ఇది కూడా చదవండి: మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో CNG మొదటిసారిగా టెస్టింగ్ కి గురయ్యింది
పైన చెప్పిన సందర్భాలలో పెద్ద తేడా ఏమీ లేదు. కానీ ఏదేమైనా, AMT S- ప్రెస్సో హైవే పై ప్రధానంగా నడిచేటప్పుడు 21 kmpl కంటే ఎక్కువ ఫ్యుయల్ ఎఫిషియన్సీ ని తిరిగి ఇస్తుందని మీరు ఆశించవచ్చు. సిటీ లో ప్రధానంగా నడపబడితే, దాని సామర్థ్యం 20 కిలోమీటర్లకు పడిపోతుంది మరియు మీ వాడకం సిటీ లో మరియు హైవే రెండిటిలో ఉండేటట్లయితే, ఎస్-ప్రెస్సో 21 కిలోమీటర్లకు దగ్గరగా ఫ్యుయల్ ఎఫిషియన్సీ అందిస్తుందని మీరు ఆశించవచ్చు.
మా పరీక్ష సమయంలో మేము వాస్తవ-ప్రపంచ డ్రైవింగ్ శైలిని ప్రతిబింబించినప్పటికీ, మీ కారు ఇచ్చే నిజమైన ఫ్యుయల్ ఎఫిషియన్సీ డ్రైవింగ్ స్టైల్, మీరు ఎదుర్కొనే ట్రాఫిక్ మరియు కారు ఎంత చక్కగా నిర్వహించబడుతుందో వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.
మీరు AMT S- ప్రెస్సోను కలిగి ఉంటే, దిగువ వ్యాఖ్యలలో మీ కారు యొక్క మైలేజ్ ని పంచుకోండి.
మరింత చదవండి: ఎస్-ప్రెస్సో ఆన్ రోడ్ ప్రైజ్
Write your Comment on Maruti ఎస్-ప్రెస్సో
S Presso ,body coloured bumper not provided ,though catalogue say so for higher model No price concession .And many more short comings.