• English
  • Login / Register

మారుతి జిమ్నీని వివరంగా చూపించే 20 చిత్రాలు

మారుతి జిమ్ని కోసం rohit ద్వారా జనవరి 19, 2023 11:10 am ప్రచురించబడింది

  • 36 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

పొడవైన-వీల్ؚబేస్ గల జిమ్మీ, దాదాపుగా అదే విధంగా ఉన్న చిన్న మోడల్ వలే కనిపిస్తుంది, కానీ ఇది రెండు అదనపు డోర్ؚలతో వస్తుంది. 

 

Maruti Jimny

ఆటో ఎక్స్ పో 2023 రెండవ రోజున మారుతి చేసే ఆవిష్కరణ ఎంతో మంది భారతీయులు ఎంతగానో ఎదురుచుసిన క్షణం, ఎందుకంటే ‘ఫ్రాంక్స్’ అని పిలిచే కొత్త క్రాస్ ఓవర్ؚతో పాటు ఐదు-డోర్ؚల జిమ్నీని కూడా మొదటిసారిగా ప్రదర్శించనుంది. ఇది దాదాపుగా మూడు-డోర్ల తన కౌంటర్ పార్ట్ؚలాగే కనిపిస్తున్నప్పటికీ, పొడిగించిన జిమ్నీ మొదటి మోడల్ కంటే కొన్ని ప్రత్యేకతలు ఎక్కువగా కలిగి ఉండేలా ఈ కారు తయారీదారు నిర్ధారించుకున్నారు. 

క్రింది గ్యాలరీలో ఐదు-డోర్ల జిమ్నీ ఎక్స్ؚటీరియర్ మరియు ఇంటీరియర్ؚలను మనము పరిశీలిద్దాం. 

 

ఫ్రంట్ 

SUV ముందు భాగం చూస్తే జిమ్నీని గుర్తు పట్టడం తేలిక, ఎందుకంటే ఇది ఇప్పటికీ దాదాపుగా మూడు-డోర్ల వర్షన్ؚలాగే కనిపిస్తోంది.

 

Maruti Jimny grille

మధ్యలో సుజుకి లోగోతో ఐదు-స్లాట్ల ఐకానిక్ గ్రిల్ؚను ఇది కొనసాగించింది, అయితే, చిన్న జిమ్నీలో ఉండే పూర్తి నలుపు గ్రిల్ (ఇప్పుడు ఇది మరింతగా హమ్మర్ లాగా కనిపించేలా చేశారు) కంటే భిన్నంగా ఉండేలా, మారుతి దీనికి క్రోమ్ ఇన్సర్ట్ؚలను ఇచ్చింది. 

Maruti Jimny headlight

లోపల చిన్న LED DRL అమర్చబడిన గుండ్రని హెడ్ లైట్ క్లస్టర్లను (LED ప్రొజెక్టర్ యూనిట్లు) మరియు ఫ్రంట్ ఫెండర్ؚలకు దగ్గరగా అమర్చబడిన గుండ్రని ఇండికేటర్ లైట్లను జిమ్నీ కలిగి ఉంది. దీని ఫ్రంట్ బంపర్ ఫాగ్ ల్యాంప్ؚలను కలిగి ఉన్న ఎయిర్ డ్యామ్ పై మెష్ؚతో, ధృడమైన అప్పీల్ؚను కలిగి ఉంది. 

Maruti Jimny headlight washer

ఐదు-డోర్ల జిమ్నీ కూడా హెడ్ లైట్ వాషర్లను కలిగి ఉంది, ఈ-సెగ్మెంట్లో ఇది భారతదేశంలో  మొట్టమొదటిది.

 

సైడ్

Maruti Jimny side

చిన్న మరియు పొడవైన వీల్ؚబేస్ జిమ్నీల మధ్య ఉన్న భారీ మార్పును మీరు ఇక్కడ గమనించగలరు. రెండిటిలో గ్రౌండ్ క్లియరెన్స్ 210mmగా ఎటువంటి మార్పు లేకుండా ఉంది. 

 

Maruti Jimny ORVM

 

దీని పెరిగిన వీల్ؚబేస్ؚను చూస్తే, మారుతి సుజుకి జిమ్నీ పొడవును పెంచిందని స్పష్టంగా తెలుస్తుంది. చిన్న వర్షన్ؚలో లేని రెండు అదనపు డోర్ؚలు మరియు ఒక రేర్ క్వార్టర్ గ్లాస్ ప్యానెల్ؚతో ఇది వస్తుంది. మూడు-డోర్ల మోడల్ؚలో ఉన్న విధంగా ఫ్రంట్ విండోలైన్ؚలో కింక్, ఫ్రంట్ ఫెండర్-మౌంటెడ్ టర్న్ ఇండికేటర్లు మరియు స్కేరీష్ ORVM (అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్) యూనిట్లు దీనిలో కూడా ఉన్నాయి. 

 

Maruti Jimny alloy wheel

ఐదు-డోర్ల జిమ్నీ, స్క్వేరెడ్-ఆఫ్ వీల్ ఆర్చ్ؚలను కలిగి ఉంటుంది, వీటిలో 15-అంగుళాల అలాయ్ వీల్స్ ఉన్నాయి. తన చిన్న నమూనాలోలాగే పొడవైన-వీల్ؚబేస్ జిమ్నీలో కూడా అదే వీల్ డిజైన్ؚను మారుతి సుజుకి కొనసాగించింది.

 

వెనుక భాగం

Maruti Jimny rear

టెయిల్ గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్ؚతో సహా, మూడు-డోర్ల జిమ్నీ మరియు ఐదు-డోర్ల జిమ్నీ వెనుక భాగం దాదాపుగా ఒకేలా కనిపిస్తాయి, వీటి మధ్య తేడాని కనిపెట్టడం మీకు కష్టంగా ఉంటుంది. 

 

Maruti Jimny 'AllGrip' badge

 

టెయిల్ గేట్ ఎడమ వైపు దిగువన ‘సుజుకి’ మానికర్ ఉండే చోట ఐదు-డోర్ల ఈ వాహనానికి ‘జిమ్నీ’ బ్యాడ్జ్ వస్తుంది, అలాగే “AllGrip” ట్యాగ్ అదే విధంగా కొనసాగింది. దీనికి రూఫ్-మౌంటెడ్ వాషర్ కూడా ఉంది. వైపర్, స్పేర్ వీల్ؚకు వెనుక భాగంలో ఉంది. 

 

Maruti Jimny door sensor

 

మూడు-డోర్ల మోడల్ؚలో లేని, టెయిల్ గేట్ను యాక్సెస్ చేయగలిగే సెన్సర్ కూడా ఇండియా-స్పెక్ జిమ్నీలో ఉంది. 

 

Maruti Jimny taillights and rear parking sensors

వెనుక పార్కింగ్ సెన్సర్లు మరియు టో హుక్స్ؚతో పాటు, టెయిల్ లైట్లను కూడా వెనుక బంపర్ؚలో క్రింద భాగంలో అమర్చారు. 

 

Maruti Jimny boot

 

దీనికి రెండవ వరుసలో 208 లీటర్ల బూట్ స్పేస్ వస్తుంది. దాన్ని మీరు కిందకి ముడిస్తే, 332 లీటర్ల లాగేజ్ స్టోరేజ్ స్థలంగా మారుతుంది. 

సంబంధించినది: జిమ్నీ వాహనాన్ని పూర్తి యాక్సెసరీలతో మారుతి ఆటో ఎక్స్ పో 2023లో ప్రదర్శించింది.

 

క్యాబిన్

Maruti Jimny cabin

పొడవైన-వీల్ బేస్ మోడల్ ఇంటీరియర్ డిజైన్ؚను మారుతి ఎక్కువగా మార్చలేదు ఇది మూడు-డోర్ల జిమ్నీ డిజైన్ؚ వలే ఉంది. బ్రషెడ్ సిల్వర్ యాక్ؚసెంట్లతో, పూర్తి-నలుపు క్యాబిన్ థీమ్ؚను మరియు డ్యాష్ؚబోర్డు పై కో-డ్రైవర్ వైపు గ్రాబ్ హ్యాండిల్ؚను కొనసాగించింది. 

 

Maruti Jimny steering wheel

ఇండియా-స్పెక్ SUV, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించే జిమ్నీలో అందుబాటులో ఉన్న లెదర్-చుట్టి ఉండే (టాప్-స్పెక్ ఆల్ఫా వేరియంట్లో) అదే స్టీరింగ్ వీల్ؚతో వస్తుంది. 

 

Maruti Jimny instrument cluster

బేసిక్ అనలాగ్ ఇన్స్ؚట్రుమెంట్ క్లస్టర్ కూడా చిన్నది, నిలువుగా రంగులు ఉన్న MIDని మధ్యలో కలిగి ఉండే మూడు-డోర్ల జిమ్నీ నుండి నేరుగా తీసుకున్నారు. 

 

Maruti Jimny nine-inch touchscreen

ఒక భారీ మార్పు ఏమిటంటే, ఇండియా-స్పెక్ జిమ్నీ ఆల్ఫా వేరియంట్, కొత్త బాలెనో మరియి బ్రెజ్జాలలో వచ్చే తొమ్మిది-అంగుళాల టచ్ స్క్రీన్ యూనిట్ؚను కలిగి ఉంది. కానీ మీరు ఎంట్రీ-లెవెల్ జెటా వేరియంట్ؚను ఎంచుకుంటే, మీకు ఏడు-అంగుళాల చిన్న డిస్ప్లే వస్తుంది. అయినప్పటికీ, మీరు ఎంచుకునే వేరియంట్ؚతో సంబంధం లేకుండా, SVUలో వైర్ؚలెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే ఒక ప్రామాణికంగా ఉంటాయి. 

 

Maruti Jimny centre console switches

అదే విధంగా మూడు డయళ్లతో క్లైమెట్ కంట్రోల్స్ ఉన్నాయి మరియు మధ్యలో డిజిటల్ టెంపరేచర్ రీడ్అవుట్ؚ కలిగి ఉంది. దాని క్రింద, పవర్ విండో లాక్ మరియు డ్రైవర్-వైపు విండో ఆటో అప్/డౌన్ స్విచ్ؚలు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-డిసెంట్ కంట్రోల్, USB మరియు 12V సాకెట్లు మరియు ఒక కబ్బీ హోల్ ఉన్నాయి. 

 

Maruti Jimny low-range transfer case

తర్వాత, రెండు గేర్ లివర్లు ఉన్నాయి: ఐదు-స్పీడ్ మాన్యువల్ లేదా నాలుగు-స్పీడ్ ఆటోమాటిక్ స్టిక్ؚలలో ఒకటి, మరియు 4x4 లో-రేంజ్ ట్రాన్స్ؚఫర్ కేస్. ఆ అదనపు షిఫ్టర్, జిమ్నీ ఫీచర్ జాబితాలో మారుతి అల్ؚగ్రిప్ ప్రో అని పిలిచిన దానిలో భాగం.

 

Maruti Jimny front seats

 

ఈ SUV ఫాబ్రిక్ సీట్లను కలిగి ఉంది, దీని మొదటి వరుసని పూర్తి సమతలంగా క్రిందకి ముడచవచ్చు (అలాగే వెనక్కి వాల్చవచ్చు కూడా), క్యాంపింగ్ లేదా సాహస యాత్రలకు వెళ్తున్నప్పుడు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. 

 

Maruti Jimny rear seats

అయితే రెండవ వరుస, మూడు-డోర్ؚలు ఉన్న జిమ్నీతో పోల్చితే ఐదు-డోర్ؚలు ఉన్న జిమ్నీ గరిష్ట ప్రయోజనాన్ని ఇస్తుంది. పొడిగింపబడిన వీల్ బేస్ కారణంగా ఇక్కడ ప్రయాణీకులకు ఎక్కువ లెగ్ రూమ్ ఉంటుంది. అయితే, అదనపు డోర్ؚలు మరియు అదనపు ఖాళీ ఉన్నప్పటికీ, జిమ్నీ అధికారికంగా ఒక నాలుగు సీటర్ల వాహనం, దీనికి ఆర్మ్ రెస్ట్, వెనుక AC వెంట్ؚలు లేదా USB సాకెట్లు కూడా లేవు. 

సంబంధించినది: ఈ మెరిసే 7 జిమ్నీ రంగులలో మీరు దేన్ని ఎంచుకుంటారు?

ఇండియా-స్పెక్ జిమ్మి బుకింగ్ؚలు ప్రారంభమయ్యాయి, ఇది మార్చిؚలో లాంచ్ అవ్వనుంది. కాబట్టి, మారుతి SUV పూర్తి రివ్యూ కోసం CarDekhoను చూడండి. 

 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Maruti జిమ్ని

1 వ్యాఖ్య
1
H
h devkumar
Jan 18, 2023, 9:27:41 AM

what may be the approx. price of m jiimmy

Read More...
సమాధానం
Write a Reply
2
A
ajit menon
Jan 19, 2023, 4:41:32 PM

Around Rs 10 lakh

Read More...
    సమాధానం
    Write a Reply
    2
    A
    ajit menon
    Jan 19, 2023, 4:41:33 PM

    Around Rs 10 lakh

    Read More...
      సమాధానం
      Write a Reply
      Read Full News

      సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

      *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

      ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

      • లేటెస్ట్
      • రాబోయేవి
      • పాపులర్
      ×
      We need your సిటీ to customize your experience