Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మారుతి వై ఆర్ ఏ యొక్క నామము 'బలెనో'- ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో ప్రదర్శన

మారుతి వైఆరే కోసం అభిజీత్ ద్వారా ఆగష్టు 10, 2015 09:32 am ప్రచురించబడింది

జైపూర్: మారుతి ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్టు వై ఆర్ ఏ, ఐఐఏ -ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో తన మొట్ట మొదటి ప్రపంచ ప్రదర్శనను ఇవ్వడానికి సిద్ధమవుతోంది. సుజుకి దీనిని తమ యొక్క ఆదర్శ హాచ్బాక్ గా పిలుచుచున్నారు మరియు దీనిని ప్రీమియం హచ్బాక్ క్లాస్ గా భారతీయ ఆటో రంగంలో భర్తీ చేస్తామని తయారీ దారులు చెబుతున్నారు. ఇది హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 మరియు హోండా జాజ్ వంటి వాటితో పోటీపడనుంది.

ఈ సంవత్సరం జెనీవా మోటార్ షోలో ప్రదర్శించిన ఐకె-2 ఉత్పత్తి వెర్షన్ అంశాన్ని ద్వారా దీనిని రూపొందిస్తున్నాము. ఈ కారు స్టైలిష్ క్యాబిన్, విశాలమైన ఇంటీరియర్స్ మరియు కొత్త సాంకేతిక పరిఙ్ఞానం తో ఉండడం వలన దీనిని 'బలెనో' అని పిలుస్తున్నారు. ఇది సుజుకి యొక్క అప్లికేషన్ 1.0 లీటర్ బూస్టర్-జెట్ డైరెక్ట్ ఇంజక్షన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ తో అభివృద్ధి చెందింది. ఇది శక్తివంతమైన మరియు ఆర్ధికంగా మంచి ఇంధనం అని చెప్పవచ్చు.

దీనితో పాటూ అన్ని కొత్త కార్లు బరువుని తగ్గించి మరియు పరిమాణం తగ్గించి అందుబాటులో ఉన్నాయి. ఇది యుకె లో 2016లో వేసవి కాలంలో ప్రారంభం కానున్నది. భారతదేశంలో ఆ సంవత్సరంలోనే ఏదో ఒక సమయంలో ప్రారంభం కానున్నది.

ప్రస్తుతం సంస్థ నుండి ఎటువంటి సమాచారం లేదు. కానీ సుజికీ ప్రదర్శించిన వీడియో ప్రకారం ఈ కారు డీఅర్ ఎల్ ఎస్, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, ఫ్లోటింగ్ రూఫ్లైన్ మరియు వెనుక ఎలిడి టెయిల్ ల్యాంప్ క్లస్టర్ వంటి లక్షణాలు ఉన్నట్టు తెలుస్తుంది. మరిన్ని వివరాలు 15 సెప్టెంబర్ న ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో వెల్లడి చేయనున్నారు.

ద్వారా ప్రచురించబడినది

అభిజీత్

  • 13 సమీక్షలు
  • 9 Comments

Write your Comment పైన మారుతి వైఆరే

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర