మారుతీ వారు లిమిటెడ్ ఎడిషన్ వాగన్ ఆర్ అవాన్స్ ని విడుదల చేశారు

ప్రచురించబడుట పైన Sep 11, 2015 10:21 AM ద్వారా Konark for మారుతి వాగన్ ఆర్

  • 3 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ముంబై: పండగ కాలం దగ్గర పడుతున్నందున మారుతీ సుజూకి వారు వాగన్ ఆర్ యొక లిమిటెడ్ ఎడిషన్ ని మూడు నెలల పరిమితి కాలం కోసం అందిస్తున్నారు. ఈ వాగన్ ఆర్ అవాన్స్ ని రూ. 4,29,944 లక్షల ఎక్స్-షోరూం ధరకు అందిస్తున్నారు. బ్లూటూత్ తో 2-డిన్ స్టీరియో, డ్యువల్ టోన్ డ్యష్బోర్డ్, బేజ్ ఇన్సెర్ట్స్ మరియూ రేర్ సీట్ పవర్ విండోస్ వంటి కొత్త లక్షణాలను ఈ అవాన్స్ ఎడిషన్ కి అందించడం జరిగింది.

మరుతీ సుజూకి ఇండియా కి మార్కెటింగ్ హెడ్ అయిన మిస్టర్. వినయ్ పంట్ గారు, " ఈ పండుగ కాలంలో ఈ వాగన్ ఆర్ అవాన్స్ ని తెలివైన కొత్త లక్షణాలతో ప్రవేశింప చేస్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. అందానికి మరియూ తెలివికి ఒక చక్కని మిశ్రమంగా ఈ వాగన్ ఆర్ అవాన్స్ నిలుస్తుంది. ఈ కొత్త లక్షణాలు దీనిని ఇంకా మెరుగైనది చేస్తాయి. ఇది మా బ్రాండ్ ని బలోపేతం చేసేందుకు ఉపయోగ పడుతుంది అని నమ్ముతున్నాము," అని అన్నారు.

వాగన్ ఆర్ అవాన్స్ మూడు రంగుల ఎంపికలలో లభ్యం అవుతోంది - సూపర్ వైట్, గ్లిసనింగ్ గ్రే మరియూ సిల్కీ సిల్వర్. బేస్ ఎలెక్సై పెట్రోల్ వేరియంట్ రూ. 4,29,944 లక్షల ధరకి అందిస్తుండగా ఎలెక్సై సీఎంజీ వేరియంట్ ని రూ. 4,83,973 లక్షల ఎక్స్-షోరూం ధరకి అందించడం జరుగుతుంది. దాదాపుగా 1.5 మిలియన్ యూనిట్ల వాగన్ ఆర్ లు ఇప్పటికి అమ్ముడు కావడంతో ఇది దేశంలో గత 5 ఏళ్ళలో అధికంగా అమ్ముడుపోతున్న ఐదు కార్లలో ఒకటిగా ఉంది.

Get Latest Offers and Updates on your WhatsApp

మారుతి Wagon R

840 సమీక్షలుఈ కారుకి రేటింగ్ ఇవ్వండి
పెట్రోల్22.5 kmpl
సిఎన్జి33.54 km/kg
ట్రాన్స్మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్
వీక్షించండి ఉత్తేజకరమైన ఆఫర్లు
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
ద్వారా ప్రచురించబడినది

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

ఎక్స్-షోరూమ్ ధర కొత్త ధర
  • ట్రెండింగ్
  • ఇటీవల

తాజా కార్లు

రాబోయే కార్లు

* న్యూఢిల్లీ అంచనా ధర
×
మీ నగరం ఏది?