• English
 • Login / Register

అతి త్వరలో విడుదల కానున్న మారుతి ఫ్రాంక్స్

మారుతి ఫ్రాంక్స్ కోసం ansh ద్వారా మార్చి 17, 2023 04:49 pm ప్రచురించబడింది

 • 55 Views
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ క్రాస్ؚఓవర్ ధరలను ఏప్రిల్ؚలో ప్రకటించనున్న కారు తయారీదారుడు.

Maruti Fronx

 • ఫ్రాంక్స్ؚను ఆటో ఎక్స్ؚపో 2023లో ఆవిష్కరించారు, అప్పటి నుండి బుకింగ్ؚలు ప్రారంభమయ్యాయి.

 • ఇది 90PS, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 100PS 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ – రెండు ఇంజన్ ఎంపికలతో వస్తుంది. 

 • ఫీచర్‌ల జాబితాలో తొమ్మిది-అంగుళాల ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్, హెడ్స్అప్ డిస్ప్లే మరియు క్రూజ్ కంట్రోల్ ఉన్నాయి. 

 • ఇప్పటికే 10,000 కంటే ఎక్కువ ముందస్తు ఆర్డర్‌లను అందుకుంది.

 • దీని ధర రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉంటుందని అంచనా.

ఐదు-డోర్‌ల జిమ్నీతో పాటుగా ఫ్రాంక్స్ؚను ఆటో ఎక్స్ؚపో 2023లో మారుతి ఆవిష్కరించింది, కానీ దాని ధరలను ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఈ క్రాస్ؚఓవర్-SUV ఇప్పటికే డీలర్ؚషిప్ؚల వద్దకు చేరుకుంది, అందిన సమాచారం ప్రకారం ఇది ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కానుంది. 

ఫ్రాంక్స్ పవర్ؚ‌ట్రెయిన్ؚలు

Maruti Fronx Engine

స్పెసిఫికేషన్‌లు

ఇంజన్ 

1.2-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ 

1.0-litre టర్బో పెట్రోల్

ట్రాన్స్ؚమిషన్

ఐదు-స్పీడ్ మాన్యువల్/ఐదు-స్పీడ్ AMT 

ఐదు-స్పీడ్ మాన్యువల్-ఆరు-స్పీడ్ ఆటోమ్యాటిక్  

పవర్ 

90PS

100PS

టార్క్ 

113Nm

148Nm

బాలెనో-ఆధారిత ఫ్రాంక్స్, మారుతి కార్‌ల లైన్అప్‌కు టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను తిరిగి స్వాగతం పలుకుతుంది. ఇప్పుడు, ఈ వాహన కొనుగోలుదారు ప్రాధాన్యతను అనుగుణంగా, ఐదు-స్పీడ్ మాన్యువల్ లేదా ప్యాడిల్ షిఫ్టర్‌లతో ఆరు-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమ్యాటిక్ؚతో జత చేయబడుతుంది. బాలెనో హ్యాచ్ؚబ్యాక్‌లో ఉన్న విధంగానే ఫ్రాంక్స్ؚలో కూడా CNG ఎంపిక ఉండవచ్చు. 

ఫీచర్‌లు మరియు భద్రత

Maruti Fronx Cabin

చాలా వరకు బాలెనోలో ఉన్న ఫీచర్‌లు అన్నీ ఫ్రాంక్స్ؚ‌లో ఉన్నాయి. వైర్ؚలెస్ అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లేలతో తొమ్మిది-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్, హెడ్స్అప్  డిస్ప్లే, క్రూజ్ కంట్రోల్, ARKAMYS సౌండ్ సిస్టమ్, ప్యాడిల్ షిఫ్టర్‌లు, ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ ఉంటాయి. ప్రయాణీకుల భద్రత విషయానికి వస్తే, ఇది ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, EBDతో ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP), హిల్-హోల్డ్ అసిస్ట్ మరియు 350-డిగ్రీల కెమెరా ఉంటాయి.

ఇది కూడా చదవండి: ChatGPT ప్రకారం అనువైన 4 భారతదేశ కార్‌లు ఇవే 

ధర మరియు పోటీదారులు

Maruti Fronx

కారు తయారీదారు ఈ SUV ధరను రూ.8 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించవచ్చు, ఇది సబ్ؚకాంపాక్ట్ SUVలకు, కియా సోనెట్, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ మరియు హ్యుందాయ్ i20 వంటి ఖరీదైన హ్యాచ్ؚబ్యాక్ؚలకు ప్రత్యామ్నాయం కాగలదు. 

ఇది కూడా చదవండి: మారుతి ఫ్రాంక్స్ అంచనా ధరలు: బాలెనోతో పోలిస్తే దీని ధర ఎంత ఎక్కువగా ఉంటుంది?

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మారుతి ఫ్రాంక్స్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

 • లేటెస్ట్
 • రాబోయేవి
 • పాపులర్
×
We need your సిటీ to customize your experience