మారుతి వారి వెబ్ సైట్ లో విటారా బ్రెజ్జా ని ప్రదర్శించింది
జనవరి 20, 2016 11:50 am sumit ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ ్యాఖ్యను వ్రాయండి
భారతదేశం యొక్క అతిపెద్ద వాహన తయారీసంస్థ దాని అధికారిక వెబ్సైట్ లో త్వరలో ప్రారంభం కాబోయే విటారా బ్రెజ్జా ని ప్రదర్శించింది. అయితే సంస్థ ఇంకా తన వెబ్సైట్లో కారు చిత్రాలు పోస్ట్ చేయకపోయినా, ఇది ఇటీవల దాని కాంపాక్ట్ SUV యొక్క టీజర్ చిత్రం విడుదల చేసింది మరియు ఇది రాబోయే 2016 ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శించబడుతుందని ఊహించడమైనది. మారుతి సంస్థ ఈ వాహనం యొక్క అధికారిక స్కెచ్ ని విడుదల చేసింది దీని ద్వారా ఈ వాహనం రూఫ్ లైన్, రైసింగ్ బెల్ట్ లైన్, నిటారుగా ఉండే హుడ్, గుండ్రంగా ఉండే దీర్ఘచతురస్రాకార వీల్ ఆర్చ్లు, హై గ్రౌండ్ క్లియరన్స్, చిన్న ఓవర్ హ్యాంగ్స్, కోణీయ టెయిల్ ల్యాంప్స్ మరియు బై జినాన్ ప్రొజెక్టర్లు వంటి లక్షణాలను కలిగి ఉన్నట్ట్లుగా తెలుస్తుంది.
దీని అంతర్భాగాలు ఎక్కువగా S-క్రాస్ నుండి అరువు తెచ్చుకున్నట్లు ఉంటాయి. బ్రెజ్జా యొక్క సౌందర్యం వివరిస్తూ, కారు యొక్క డిజైనర్ ఇలా అన్నారు " ఈ కారు యొక్క చదరపు వీల్ ఆర్చ్లు వాహానానికి మద్దతు ఇస్తుంది. అలానే దీనిలో షార్ట్ ఓవర్ హ్యాంగ్స్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ మరియు నిటారుగా ఉండే హుడ్ వాహనానికి సరైన వైఖరి ఇస్తుంది. రైజింగ్ బెల్ట్, రాకర్ లైన్స్ మరియు రూఫ్ లైన్స్ వెనుక వైపు వాలి వాహనానికి డైనమిక్ లుక్ ని ఇస్తుంది. ఈ కారు యొక్క బాడీ ఉపరితలాలు అందంగా మరియు సహజ సిద్ధంగా ఉండి ఆకర్షణీయంగా ఉంటాయి. చుట్టబెట్టిన గ్రీన్ హౌస్ కి పైగా వెంటనే గుర్తించదగినట్టుగా ఫ్లోటింగ్ రూఫ్ దృశ్యపరమైన ఆకర్షణీయతను పెంచుతుంది మరియు బ్రెజ్జా ని ఈ పోటీ తట్టుకొనే విధంగా చేస్తుంది. "
విటారా వాహనం మారుతి యొక్క 1.2L మరియు 1.4L పెట్రోలు ఇంజన్ తో అధారితం చేయబడుతుంది, అయితే డీజిల్ లో 1.4 లీటర్ DDiS మిల్లు ఉంటుంది. అయితే ఈ కారు నెక్సా ద్వారా కాకుండా మారుతి డీలర్షిప్ల ద్వారా అమ్మకానికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు.
ఇంకా చదవండి
మారుతి సుజుకి యొక్క కొత్త కాంపాక్ట్ ఎస్యువి యొక్క అధికారిక నామం విటారా బ్రెజ్జా