భారతదేశంలో అడుగుపెట్టిన మారుతి ఎర్టిగా-ఆధారిత Toyota Rumion MPV; ఈ పండుగ సీజన్ؚలో విడుదల
టయోటా రూమియన్ కోసం tarun ద్వారా ఆగష్టు 11, 2023 07:34 pm ప్రచురించబడింది
- 58 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇది ప్రధానంగా కొంత భిన్నమైన స్టైలింగ్ మరియు మెరుగైన ప్రామాణిక వ్యారెంటీ కలిగిన మారుతి ఎర్టిగా అని చెప్పవచ్చు
-
భారతదేశంలో టయోటా రూమియన్ త్వరలోనే రానుంది, దీని ధరలు పండుగ సీజన్ؚలో ప్రకటించనున్నాను.
-
ఎర్టిగాؚతో పోలిస్తే ఇది సరికొత్త ఫ్రంట్ ప్రొఫైల్ మరియు భిన్నమైన 15-అంగుళాల అలాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది.
-
ఇంటీరియర్ పూర్తిగా ఎర్టిగాలో ఉన్నట్లుగానే ఉంటుంది, కానీ డ్యూయల్-టోన్ థీమ్ؚను పొందింది.
-
7-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, నాలుగు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, ESP మరియు రేర్ కెమెరాలు ఉన్నాయి.
-
మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚలతో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను పొందుతుంది; CNG కూడా అందించబడుతుంది.
-
ధరలు ఎర్టిగాకు సారూప్యంగా ఉంటాయని అంచనా, ఇవి రూ.8.64 లక్షల నుండి రూ.13.08 లక్షల మధ్య ఉండవచ్చు.
భారతదేశ మార్కెట్‌లో ప్రవేశ పెట్టనున్న టయోటా రూమియన్ వివరాలను వెల్లడించారు, ఈ పండగ సీజన్ؚలో ఇది విడుదల కానుంది. బాలెనో-గ్లాంజా, మునుపటి-జెన్ బ్రెజ్జా/అర్బన్ క్రూయిజర్, గ్రాండ్ విటారా హైరైడర్, మరియు ఇన్నోవా హైక్రాస్-ఇన్విక్టో తరువాత, మారుతి-టయోటా భాగస్వామ్యంలో ఇది నాలుగవ కారు. దీని బుకింగ్ؚలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
వేరియెంట్ తనిఖీ
వేరియెంట్ؚలు |
మాన్యువల్ |
AT |
CNG |
S |
☑️ |
☑️ |
☑️ |
G |
☑️ |
- |
- |
V |
☑️ |
☑️ |
- |
రూమియన్‌ను మూడు విస్తృత వేరియెంట్‌లలో అందించనున్నాను – S, G మరియు V. బేసి వేరియెంట్ؚను ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚతో పొందవచ్చు, మిడ్-స్పెడ్ వేరియెంట్ؚలో ఈ సౌకర్యం లేదు. CNG ఎంపిక కూడా కేవలం ఎంట్రీ-లెవెల్ S వేరియెంట్ؚకు మాత్రమే పరిమితం చేయబడింది. మరొక వైపు, మాన్యువల్ ఈ లైన్అప్ అంతటా ప్రామాణికంగా అందించబడుతోంది.
ఇన్నోవా ఆధారిత ముందు ప్రొఫైల్
టయోటా రూమియన్, పూర్తిగా ఎర్టిగాలా కనిపిస్తున్నపటికి, అనేక మారుతి-ఆఫరింగ్ؚలలో చూసినట్లుగా భిన్నంగా కనిపిస్తుంది. దీని గ్రిల్ డిజైన్ ఇన్నోవా హైక్రాస్‌పై ఆధారపడింది, కాబట్టి ముందు ప్రొఫైల్ కొత్తగా కనిపించనుంది. బంపర్, ఫాగ్ؚల్యాంప్ హౌసింగ్, దిగువ ఎయిర్ డ్యామ్ కూడా దీని మారుతి ప్రత్యర్ధి కంటే భిన్నంగా ఉండవచ్చు.
15-అంగుళాల అలాయ్ వీల్స్ మినహా, సైడ్ ప్రొఫైల్‌లో ఎటువంటి మార్పులు లేవు. వెనుక ప్రొఫైల్ؚలో తేలికపాటి మార్పులను పొందింది, ఇది బ్యాడ్జింగ్ؚకు మాత్రమే పరిమితమైంది.
ఇది ఐదు రంగుల ఎంపికలో లభిస్తుంది –స్పంకీ బ్లూ, రస్టిక్ బ్రౌన్, ఐకానిక్ గ్రే, కెఫే వైట్ మరియు ఎంటైసింగ్ సిల్వర్.
తేలికపాటి ఇంటీరియర్ అప్ؚగ్రేడ్ؚలు
రూమియాన్ క్యాబిన్ ఎర్టిగా క్యాబిన్ؚకు సారూప్యంగా ఉంటుంది, డ్యాష్ؚబోర్డు టేక్ؚవుడ్ ఆప్లిక్ؚతో డ్యూయల్-టోన్ థీమ్ؚతో వస్తుంది. సీట్లు డ్యూయల్-టోన్ ఫ్యాబ్రిక్ రంగులో వస్తుండగా, ఎర్టిగాలో కేవలం సింగిల్-టోన్ లేత-గోధుమ రంగు సీట్లును చూడవచ్చు. మరొక తేడా స్టీరింగ్ వీల్ పై కనిపించే టయోటా బ్యాడ్జింగ్.
చెప్పుకోదగిన ఫీచర్‌ల జాబితా
ఎర్టిగాలో ఉన్న ఫీచర్‌లను నేరుగా ఇందులో అందిస్తున్నారు. టయోటా రూమియన్ హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ؚల్యాంపులు, ఇంజన్ పుష్ స్టార్ట్-స్టాప్ బటన్, ఆటోమ్యాటిక్ AC, రూఫ్‌పై అమర్చిన AC వెంట్ؚలు, క్రూయిజ్ కంట్రోల్, 7-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ మరియు వైర్ؚలెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్ؚప్లేలను కలిగి ఉంది.
భద్రత పరంగా నాలుగు ఎయిర్ బ్యాగ్ؚలు, ESP, హిల్ హోల్డ్ ఆసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్ؚలు, సెన్సార్‌లతో రేర్ పార్కింగ్ కెమెరా ఉన్నాయి.
రెండు పవర్ؚట్రెయిన్ؚలలో అందిస్తున్నారు
ఇంజన్ |
1.5-లీటర్ పెట్రోల్ |
1.5-లీటర్ పెట్రోల్ CNG |
పవర్ |
103PS |
88PS |
టార్క్ |
136.8Nm |
121.5Nm |
ట్రాన్స్ؚమిషన్ؚలు |
5-స్పీడ్ MT / 6-స్పీడ్ల AT |
5-స్పీడ్ MT |
మైలేజీ |
20.51kmpl |
26.11km/kg |
రూమియన్‌ను ఎర్టిగాలో ఉన్న 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో అందిస్తున్నారు, ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమ్యాటిక్ ఎంపికలతో వస్తుంది. ఆటోమ్యాటిక్ వేరియెంట్ؚలు ప్యాడిల్ షిఫ్టర్‌తో అదనపు సౌకర్యాన్ని పొందుతాయి. CNG ఎంపిక కూడా అందుబాటులో ఉంది, ఇది 26.11km/kg సామర్ధ్యాన్ని క్లెయిమ్ చేస్తుంది.
అంచనా ధరలు మరియు పోటీదారులు
రూమియన్‌పై ప్రామాణికంగా 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్‌ల వ్యారెంటీని టయోటా అందిస్తుంది (ఏది ముందుగా అయితే అది). దీని ధర మారుతి ఎర్టిగా ధరను పోలి ఉంటుందని అంచనా, ఇది రూ.8.64 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతుంది. దీనికి ప్రత్యక్ష పోటీదారులు లేరు, అయితే దీన్ని టయోటా ఇన్నోవా క్రిస్టా, కియా క్యారెన్స్ మరియు మహీంద్రా మరాజ్జోలకు ప్రత్యామ్నాయంగా చూడవచ్చు.
ఇక్కడ మరింత చదవండి: ఎర్టిగా ఆన్ؚరోడ్ ధర