మారుతి డిజైర్ వర్సెస్ ఫోర్డ్ అస్పైర్: రియల్ వరల్డ్ పెర్ఫార్మెన్స్, మైలేజ్ పోలిక

మారుతి డిజైర్ 2017-2020 కోసం dhruv ద్వారా ఏప్రిల్ 23, 2019 10:08 am ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Maruti Dzire Vs Ford Aspire: Real World Performance, Mileage Comparison

ఫోర్డ్ అస్పైర్ ఇటీవలే ఒక ఫేస్లిఫ్ట్ ను అందుకుంది, అయితే ప్రస్తుత ధోరణులకు అనుగుణంగా మరింత సౌందర్య సాధనాల నవీకరణలను కూడా అందించింది. ఈ నివేదిక కోసం మేము ఎంతగానో ఆసక్తిని కనబరుస్తున్నాము ఎందుకంటే, బోనెట్ క్రింద ఏ మార్పులు చోటు చేసుకున్నాయో తెలుసుకునేందుకు ఆసక్తిని చుపిస్తున్నాము. అవును, మేము కొత్త 1.2-లీటర్, 3- సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గురించి మాట్లాడుతున్నాము, అది గరిష్టంగా 96 పిఎస్ పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది, పాత 1.2 లీటర్, 4- సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ను భర్తీ చేస్తుంది, ఇది 88 పిఎస్ గరిష్ట శక్తిని విడుదల చేసేది. రియల్ వరల్డ్ పరిస్థితుల్లో ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకోవడానికి, దాని విభాగంలో బాగా విక్రయించబడుతున్న మారుతి సుజుకి డిజైర్ (పెట్రోల్-ఎంటి) కారుకి వ్యతిరేకంగా దాని మాన్యువల్ వెర్షన్ ను పోల్చి చూసాము.

పెర్ఫామెన్స్ (పరీక్షించినట్లుగా)

 

ఫోర్డ్ అస్పైర్

మారుతి సుజుకి డిజైర్

0-100 కెఎంపిహెచ్

12.01 సెకన్లు

11.88 సెకన్లు

క్వార్టర్ మైలు

18.20 సెకన్లు @ 122.33 కెఎంపిహెచ్.

18.13 సెకన్లు @ 123.50 కెఎంపిహెచ్

30-80 కెఎంపిహెచ్ (3 వ గేర్)

11.47 సెకన్లు

10.39 సెకన్లు

40-100 కెఎంపిహెచ్ (4 వ గేర్)

21.35 సెకన్లు

19.82 సెకన్లు

బ్రేకింగ్ (100-0 కెఎంపిహెచ్)

44.76 మీటర్లు

44.66 మీటర్లు

బ్రేకింగ్ (80-0 కెఎంపిహెచ్)

28.39 మీటర్లు

28.15 మీటర్లు

0- 100 కెఎంపిహెచ్ మరియు క్వార్టర్ మైలు డ్రాగ్ సంబంధించినంత వరకు, డిజైర్ పైచేయి ఉన్నట్టుగా కనిపిస్తుంది. రెండిటి మధ్య దూరం, ఒక సెకను కంటే తక్కువగా ఉంది మరియు ఇది చివరకు డ్రైవర్ నైపున్యం పై ఆధారపడి ఉంటుంది. అయితే, ఈ కార్లు రెండింటినీ పోల్చి చూస్తే మొత్తం కథ విభిన్నంగా ఉంటుంది. అస్పైర్ కంటే, డిజైర్ చాలా వేగవంతమైనది. అస్పైర్ తో పోలిస్తే, డిజైర్ మూడవ గేర్ లో 30- 80 కెఎంపిహెచ్ వేగానికి చేరడానికి సెకన్లు వేగవంతమైనది. అదే నాల్గవ గేర్ లో, 40- 100 కెఎంపిహెచ్వేగానికి చేరడానికి కొన్ని సెకన్లు వేగవంతమైనది.

కానీ, మీరు వాటి బ్రేకింగ్ పనితీరును పోల్చినట్లయితే, డిజైర్- అస్పైర్ కంటే కొంచెం అంచులో ఉంది. ఇది డిజైర్ కు పెద్ద ప్రతికూలత ఏమి కాదు. ఏదేమైనా, ఈ విభాగంలో డిజైర్, నిరంతరం విజేతగా నిలుస్తుంది

ఇంధన సామర్ధ్యం (పరీక్షించినట్లుగా)

 

ఫోర్డ్ అస్పైర్

మారుతి సుజుకి డిజైర్

సిటీ

15.92 కెఎంపిఎల్

15.85 కెఎంపిఎల్

హైవే

19.52 కెఎంపిఎల్

20.90 కెఎంపిఎల్

 

సిటీ: హైవే

ఫోర్డ్ అస్పైర్

మారుతి సుజుకి డిజైర్

50:50:00

17.54 కెఎంపిఎల్

18.03 కెఎంపిఎల్

75:25:00

16.69 కెఎంపిఎల్

16.87 కెఎంపిఎల్

25:75

18.47 కెఎంపిఎల్

19.36 కెఎంపిఎల్

ఇంధన సామర్థ్యానికి సంబంధించినంతవరకు, రెండు కార్లు నగరంలో ముందంజలోనే ఉన్నాయి. ఏమైనప్పటికీ, మా పరీక్షలో కేవలం 0.7 కెఎంపిహెచ్ మైలేజ్ తో డిజైర్ కంటే అస్పైర్ ఉత్తమంగా నిలచింది. రహదారి విషయానికి వస్తే, డిజైర్ తన స్వంతదానిలోకి ఉత్తమ ప్రదర్శనను అందిస్తుంది మరియు అస్పైర్ కంటే 1 కి.మీ. ఎక్కువ మైలేజ్ ను ఇస్తుంది. మీరు నగరం మరియు రహదారి డ్రైవింగ్ మిశ్రమాన్ని పరిగణనలోకి తీసుకుంటే, డిజైర్ మరింత పొదుపు గల కారుగా ఉంది. ఈ రెండిటి మధ్య తేడా ఎక్కువ మొత్తంలో లేదు.

తీర్పు

మారుతి సుజుకి డిజైర్ పనితీరు, ఫోర్డ్ అస్పైర్ ను అధిగమిస్తుంది. ఆ రెండు మధ్య తేడా చాలా తక్కువ మొత్తంలో ఉంది. ఇంధన సామర్ధ్యం దృష్ట్యా, రహదారిపై అస్పైర్ ను డిజైర్ అధిగమించి, నిలబడింది. అదే నగరం విషయానికి వస్తే, అస్పైర్- డిజైర్ కంటే కొంత ప్రయోజనాన్ని ఎక్కువ కలిగి ఉంది. అలాగే ఖచ్చితమైన పనితీరు పరంగా, రెండు కార్లు పోటా పోటీగా ఉన్నాయి, కాని గేర్ త్వరణం విషయానికి వస్తే డిజైర్ మళ్లీ ఒక ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. రెండింటి యొక్క పెట్రోల్- ఎంటి పవర్ట్రెయిన్ ఎంపికలకు సంబంధించినంత వరకు డిజైర్ కారు ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు.

మరింత చదవండి: మారుతి స్విఫ్ట్ డిజైర్ ఏఎంటి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మారుతి Dzire 2017-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience