మహీంద్రా XUV300 vs మారుతి బ్రెజ్జా: వేరియంట్స్ పోలిక
మహీంద్రా ఎక్స్యూవి300 కోసం dinesh ద్వారా ఏప్రిల్ 17, 2019 04:29 pm ప్రచురించబడింది
- 28 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
రూ. 7.90 లక్షలు (ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా) ప్రారంభ ధర వద్ద ప్రారంభించబడి, XUV300 అధిక ఆశాజనకంగా సబ్-4m SUV విభాగం ఏదైతే మారుతి బ్రెజ్జా, టాటా నెక్సన్ మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి వాటిని సాశిస్తున్నాయో ఆ విభాగంలోకి ప్రవేశించి వాటితో పోటీ పడేందుకు సిద్ధం అయ్యింది. మీరు తాజా సబ్-4m SUV మరియు సెగ్మెంట్-లీడర్ మారుతి బ్రెజ్జాల మధ్య తికమక పడుతూ ఉన్నారా, అయితే మేము వాటిలో ఒకే ధర కలిగినటువంటి వేరియంట్లను పోల్చి చూశాము, తద్వారా ఏది మంచి విలువను అందిస్తుందనేది తెలుస్తుంది.
వివరాలు లోకి వెళ్ళే ముందు, రెండు సబ్-4m SUV యొక్క మెకానికల్ వివరాలను పరిశీలిద్దాము
కొలతలు:
మహింద్రాXUV300 |
మారుతి విటారా బ్రెజ్జా |
|
పొడవు |
3995mm |
3995mm |
వెడల్పు |
1821mm |
1790mm |
ఎత్తు |
1627mm |
1640mm |
వీల్‌బేస్ |
2600mm |
2500mm |
- అయితే సబ్-4m SUV లు రెండూ పొడవులో ఒకే విధంగా ఉంటాయి, అయితే XUV300 ఇక్కడ విస్తృత కారు.
- 2600 mm వద్ద, అది కూడా పెద్ద వీల్బేస్ ని కలిగి ఉంటుంది. నిజానికి, XUV300 దాని విభాగంలో పొడవైన వీల్ బేస్ కలిగి ఉంది. పైన ఉన్న విభాగానికి చెందిన క్రెటా కంటే ఇది చాలా ఎక్కువ.
ఇంజిన్:
డీజిల్ |
మహింద్రాXUV300 |
మారుతి విటారా బ్రెజ్జా |
ఇంజిన్ |
1.5- లీటర్ |
1.3- లీటర్ |
పవర్ |
115PS |
90PS |
టార్క్ |
300Nm |
200Nm |
ట్రాన్స్మిషన్ |
6- స్పీడ్ MT |
5- స్పీడ్ MT/AMT |
. మహీంద్రా XUV300 రెండిటిలో పెద్ద ఇంజన్ లను కలిగి ఉంది.ఇది మరింత శక్తివంతమైనది మరియు మారుతి యొక్క 1.3 లీటర్ DDiS 200 యూనిట్ కంటే ఎక్కువ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.
. XUV300 6-స్పీడ్ MT తో మాత్రమే లభిస్తుంది, అయితే విటారా బ్రెజ్జా 5-స్పీడ్ MT లేదా AMT తో కలిగి ఉండవచ్చు.
మహింద్రాXUV300 (ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా) |
మారుతి విటారా బ్రెజ్జా (ఎక్స్-షోరూమ్- ఢిల్లీ) |
LDI రూ. 7.67 లక్షలు |
|
W4 రూ.8.49 లక్షలు |
VDI రూ. 8.19 లక్షలు |
W6 రూ. 9.30 లక్షలు |
ZDI రూ. 8.96 లక్షలు |
ZDI+ రూ. 9.92 లక్షలు |
|
W8 రూ. 10.80 లక్షలు |
|
W8(O) రూ. 10.99 లక్షలు |
వేరియంట్స్ పోలికలు: మేము రెండు సబ్-4m SUV లలో ఒకే విధమైన ధరలను కలిగినటువంటి వేరియంట్ల ను (ధర వ్యత్యాసం ~ రూ 50,000) పోల్చి చూసాము.
మహింద్రాXUV300 W4 |
రూ. 8.49 లక్షలు |
మారుతి విటారా బ్రెజ్జా VDI |
రూ. 8.19 లక్షలు |
వ్యత్యాసం |
రూ. 30,000 (XUV300 అధిక ధరను కలిగి ఉంది) |
సాధారణ లక్షణాలు:
భద్రత: డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్, EBD తో ABS, Isofix పిల్లల సీటు యాంకర్స్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, ఫ్రంట్ సీట్లు రిమైండర్ సీట్‌బెల్ట్ మరియు ఫ్రంట్ సీట్‌బెల్ట్ ప్రీ-టెన్ష్నర్స్ మరియు లోడ్ లిమిటర్స్.
బాహ్యభాగాలు: బాడీ రంగు బంపర్స్, ORVMs మరియు డోర్ హ్యాండిల్స్, మరియు స్టీల్ వీల్స్.
సౌకర్యాలు: సెంట్రల్ లాకింగ్, మాన్యువల్ A.C, ఎలక్ట్రికల్ సర్దుబాటు ORVM లు, ముందు మరియు వెనుక సీట్ల అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, ఫోల్డబుల్ వెనుక సీట్లు మరియు, ముందు మరియు వెనుక పవర్ విండోస్
ఇంఫోటైన్మెంట్: బ్లూటూత్ USB మరియు AUX తో 2-DIN మ్యూజిక్ సిస్టమ్
మహీంద్రా XUV300 W4 మారుతి బ్రెజ్జా VDI పై ఏమిటి అందిస్తుంది:
బహుళ స్టీరింగ్ మోడ్లు, వెనుక డిస్క్ బ్రేక్లు, కార్నర్స్ లో బ్రేక్ కంట్రోల్, LED టెయిల్ లాంప్స్, 60:40 స్ప్లిట్ వెనుక సీట్లు, వెనుక మిడిల్ సీటు కోసం మూడవ హెడ్ రెస్ట్, టైర్ పొజిషన్ మానిటర్ మరియు ప్యాసింజర్ ఎయిర్బాగ్ డియాక్టివేషన్ స్విచ్.
మారుతి బ్రెజ్జా VDI మహీంద్రా XUV300 పై ఏమిటి అందిస్తుంది:
వీల్ క్యాప్లు, కీలేస్ సెంట్రల్ లాకింగ్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, హై స్పీడ్ అలర్ట్ వ్యవస్థ మరియు స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్.
తీర్పు: రెండు కార్లు ఇక్కడ సమానంగా అమర్చబడి ఉన్నాయి. కాబట్టి, మీరు టైట్ బడ్జెట్ లో ఉంటే, మారుతి బ్రెజా కోసం వెళ్ళమని మేము మీకు సిఫార్సు చేస్తాము. అయితే, మీరు కొంచెం మీ బడ్జెట్ ని పెంచగలము అంటే XUV300 W4 కోసం వెళ్ళమని మేము సూచిస్తాము. ఎందుకంటే కేవలం 30,000 రూపాయల ప్రీమియం పై XUV300 విభాగంలోనే మొదటి లక్షణాలు అయినటువంటి మల్టిపుల్ స్టీరింగ్ మోడ్లు, వెనుక డిస్క్ బ్రేక్లు మరియు టైర్ డైరెక్షన్ మానిటర్ వంటి లక్షణాలను పొందడం వలన డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపర్చడం మాత్రమే కాకుండా, మీరు మరింత ఖరీదైన కారు నడుపుతున్నారనే భావన కూడా కలిగిస్తుంది.
మహీంద్రా XUV300 W6 |
రూ. 9.30 లక్షలు |
మారుతి బ్రెజ్జా ZDI |
రూ. 8.96 లక్షలు |
వ్యత్యాసం |
రూ. 34,000 (XUV300 అధిక ధరను కలిగి ఉంది) |
సాధారణ ఫీచర్లు (మునుపటి రకాల్లో)
బాహ్య భాగాలు: వీల్ క్యాప్స్
సౌకర్యాలు: స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, రిమోట్ కీతో సెంట్రల్ లాకింగ్ మరియు 60:40 స్ప్లిట్ వెనుక సీట్లు
మహీంద్రా XUV300 W6 మారుతి బ్రెజ్జా ZDI పై ఏమిటి అందిస్తుంది: బహుళ స్టీరింగ్ రీతులు, వెనుక డిస్క్ బ్రేక్లు, కార్నర్స్ లో బ్రేక్ కంట్రోల్, LED టెయిల్ లాంప్స్, వెనుక మిడిల్ సీట్ల కోసం మూడవ హెడ్ రెస్ట్, బ్లూటూత్ USB మరియు AUX తో 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, టైర్ పొజిషన్ మానిటర్ మరియు ప్యాసింజర్ ఎయిర్బాగ్ డియాక్టివేషన్ స్విచ్.
మారుతి బ్రెజ్జా ZDI మహీంద్రా XUV300 W6 పై ఏమిటి అందిస్తుంది: అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, వెనుక వాషర్, వైపర్ మరియు డెమిస్టర్, ఆటో AC, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెనుక పార్కింగ్ సెన్సార్లు మరియు హై స్పీడ్ అలర్ట్ వ్యవస్థ.
తీర్పు: ఇక్కడ, మీరు మారుతి బ్రెజ్జా కోసం వెళ్ళమని మేము సిఫార్సు చేస్తున్నాము, ఎందుకంటే ఇది తక్కువ ధర వద్ద మహీంద్రా XUV300 కంటే ఎక్కువ ఉపయోగకరమైన లక్షణాలను అందిస్తుంది. మహీంద్రా బహుళ స్టీరింగ్ రీతులు, టైర్ పొజిషన్ మానిటర్ వంటి వాటిని పొందుతుంది కానీ ఆ లక్షణాలు ఆటో A.C, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు మరియు బ్రేజ్జాలో వెనుక పార్కింగ్ సెన్సార్ల వలె ఎక్కువగా ఉపయోగపడవు. బాదాకరంగా హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు XUV300 W6 లో మిస్ అయ్యింది.
టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కు సంబంధించినంతవరకు, మీరు మారుతి డీలర్షిప్ నుండి దీని అమర్చుకోవచ్చు. ముఖ్యంగా, మీరు గమనించినట్లయితే మహీంద్రా XUV300 బ్రేజ్జా వలే కాకుండా వెనుక డిస్క్ బ్రేక్లను పొందుతుంది. ఇది ఖచ్చితంగా మహీంద్రా SUV బ్రేకింగ్ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది అయితే, బ్రెజ్జా యొక్క ముందు డిస్క్ మరియు వెనుక డ్రమ్ బ్రేక్ సెటప్ మిమ్మల్ని మాత్రం నిరాశపరచదు.
0 out of 0 found this helpful