2015 జూలై 30 న యు301 వాహనం యొక్క కీలకమైన వివరాలను బహిర్గతం చేయబోతున్న మహీంద్రా
మహీంద్రా త్వరలో రాబోయే ఎస్యువి కోడ్ నేమ్ యు301 వివరాలను మరియు అధికారిక పేరును త్వరలో వెల్లడించబోతున్నారు. ఈ వాహనం ఇప్పటికే చాలా సార్లు రహస్యంగా టెస్ట్ పరుగులు చేస్తున్నప్పుడు బయటపడింది. దీనిని బొలెరో మరియు క్వాంటో ల పైన ఉంచబోతున్నారు. స్వదేశ తయారీదారులు మరిన్ని రెండు కాంపాక్ట్ ఎస్యువి లు అయిన ఎస్101 మరియు కొత్త క్వాంటో ని తయారు చేస్తున్నారు.
డిజైన్ పరంగా యు301 వాహనం బొలేరోతో పోలిస్తే, ఖరీదైనదిగా కనిపిస్తుంది. కానీ క్లాసీ లుక్ ని అలానే నిలుపుకుంది. దీనిలో ఉండే కొత్త గ్రిల్ హనీ కోంబ్ మెష్ తో ఎక్స్యువి 500 మరియు స్కార్పియో ని పోలి ఉంటుంది. ఈ వాహనం, 15-అంగుళాల రేడియల్స్ తో 5-స్పోక్ ట్విన్ స్లాట్ అల్లాయ్స్ తో జత చేయబడి ఉంటుంది. అంతర్గత భాగాల విషయానికి వస్తే, మరింత సౌకర్యవంతమైన మరియు ప్రీమియం కాబిన్ ఇస్తుంది మరియు టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థ, క్లైమేట్ కంట్రోల్, ఏసి, క్రూజ్ కంట్రోల్ వంటి లక్షణాలు రానున్న కొత్త ఎస్యువి లో జోడించవచ్చునని ఊహిస్తున్నారు.
హుడ్ క్రింది భాగానికి వస్తే, ఈ వాహనం 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ తో రాబోతుంది. ఇదే ఇంజన్ ను మనం క్వాంటో లో కూడా చూడవచ్చు. ఈ ఇంజన్ మంచి ఇంధన సామర్ధ్యాన్ని పంపిణీ చేయడానికి, ఈ వాహనం మాన్యువల్ మరియు ఆటోమేటిక్ రెండు గేర్బాక్స్ సిస్టమ్ లతో రాబోతుంది. క్వాంటో లో ఉన్న ఇదే ఇంజన్, అత్యధికంగా 100 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా 240 Nm గల పీక్ టార్క్ ను కూడా విడుదల చేస్తుంది.