ఆన్ లైన్ లో వైరెల్ అవుతున్న Mahindra Thar EV పేటెంట్ చిత్రాలు, అందులో ప్రత్యేకతలు
మహీంద్రా థార్ ఇ కోసం rohit ద్వారా నవంబర్ 02, 2023 06:17 pm సవరించబడింది
- 277 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
పేటెంట్ పొందిన చిత్రాలను గమనించినట్లైతే, మహీంద్రా థార్ EV డిజైన్ ఎలక్ట్రిక్ మహీంద్రా థార్ యొక్క కాన్సెప్ట్ వెర్షన్ ను పోలి ఉంటుంది.
-
మహీంద్రా 2023 ఆగస్టులో దక్షిణాఫ్రికాలో 5-డోర్ల థార్ EV ను (థార్.ఇ అని పిలుస్తారు) ప్రదర్శించారు.
-
దీనిని 2026 నాటికి భారతదేశంలో విడుదల చేయవచ్చు. దీని ధర సుమారు రూ .25 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.
-
పేటెంట్ చిత్రాలలో కాన్సెప్ట్ మోడల్ ను పోలిన స్క్వేర్ LED DRLలు మరియు అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
-
దీని డ్యాష్ బోర్డు మరియు సీటుకు సంబంధించిన కూడా చిత్రాలు కాపీరైట్ చేయబడ్డాయి, దీని డిజైన్ మరియు వివరాలు కూడా కాన్సెప్ట్ మోడల్ ను పోలి ఉంటాయి.
-
థార్ EV పెద్ద బ్యాటరీ ప్యాక్ తో అందించబడుతుంది, ఇది 400 కిలోమీటర్లకు పైగా పూర్తి ఛార్జ్ చేయగలదు.
మహీంద్రా 2023 ఆగస్టులో భారతదేశం యొక్క 77 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దక్షిణాఫ్రికాలో మహీంద్రా థార్ EV యొక్క కాన్సెప్ట్ వెర్షన్ను ప్రదర్శించారు. ఇప్పుడు మహీంద్రా 5-డోర్ల థాయ్ EVకి పేటెంట్ పొందింది, దీనికి సంబంధించిన కొన్ని చిత్రాలు ఆన్లైన్లో విడుదల చేయబడ్డాయి. ఎలక్ట్రిక్ థార్ 2026 నాటికి భారతదేశంలో విడుదల అయ్యే అవకాశం ఉంది.
పేటెంట్ చిత్రాలలో గమనించిన వివరాలు
పేటెంట్ చిత్రాలలో, దక్షిణాఫ్రికాలో ప్రదర్శించిన 5-డోర్ థార్ EV (లేదా థార్.ఇ) డిజైన్ మోడల్ను పోలి ఉన్నట్లు మనం చూడవచ్చు. కాన్సెప్ట్ మోడల్ మాదిరిగానే, ఇది చతురస్రాకారంలో LED DRL, మూడు LED బార్లు మరియు గ్రిల్పై 'థార్.ఇ' అనే బ్యాడ్జీలతో అందించబడుతుంది. పేటెంట్ చిత్రాలలో, కాన్సెప్ట్ మోడల్ అల్లాయ్ వీల్స్, పెద్ద వీల్ ఆర్చ్ మరియు స్టైలిష్ ఫ్రంట్ బంపర్ కూడా కనిపించాయి.
మహీంద్రా ఎలక్ట్రిక్ థార్ డ్యాష్ బోర్డ్ కు పేటెంట్ పొందింది, ఇందులో పెద్ద స్క్వేర్ టచ్ స్క్రీన్ సిస్టమ్ మరియు డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. పేటెంట్ చిత్రాలలో కాన్సెప్ట్ వెర్షన్ తో కూడిన 2-స్పోక్ ఆక్టాగొనల్ స్టీరింగ్ వీల్ కనిపించనప్పటికీ, కంపెనీ తన ప్రొడక్షన్ మోడల్ లో ఈ ఫీచర్ ను అందించవచ్చు.
థార్ EV యొక్క ముందు మరియు వెనుక బెంచ్ సీట్లు చతురస్రాకారంలో ఉంటాయి, దీనికి కూడా కాపీరైట్ ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఆఫ్-రోడింగ్ కారు యొక్క కాన్సెప్ట్ మోడల్ లో కూడా ఇవే ఫీచర్లు కనిపించాయి. కాన్సెప్ట్ వెర్షన్ లో, ముందు సీటులో కనెక్టెడ్ హెడ్ రెస్ట్ మరియు వెనుక ప్రయాణికుల కోసం రూఫ్ మౌంటెడ్ హెడ్ రెస్ట్ అందించబడ్డాయి.
ఇది కూడా చూడండి: స్పై షాట్ లో 5-డోర్ల మహీంద్రా థార్, కవర్ తో మళ్లీ కనిపించిన రేర్ ప్రొఫైల్
కార్దెకో ఇండియా (@cardekhoindia) షేర్ చేసిన పోస్ట్
పవర్ట్రెయిన్ వివరాలు
థార్ EV యొక్క ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్ గురించి సమాచారం ఇంకా వెల్లడించబడలేదు, కానీ ఇది పెద్ద బ్యాటరీ ప్యాక్ అందించబడవచ్చు. పూర్తి ఛార్జింగ్లో దాని సర్టిఫైడ్ పరిధి 400 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. ఇందులో డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్, 4-వీల్ డ్రైవ్ (4WD) సిస్టమ్ టెర్రైన్ డ్రైవ్ మోడ్ ప్రామాణికంగా అందించబడతాయి.
-
ఇక్కడ మీకు ఏవైనా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయో లేదో తనిఖీ చేయండి.
-
మీకు ఇష్టమైన కారు యొక్క EMIను, మా కారు EMI కాలిక్యులేటర్ లో తనిఖీ చేయండి.
ఆశించిన ధర
5-డోర్ మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ యొక్క ప్రారంభ ధర రూ .25 లక్షలు (ఎక్స్-షోరూమ్). ప్రస్తుతం మహీంద్రా థార్ EVతో పోటీపడుతున్న కారులు లేవు.
ఇది కూడా చదవండి: సింగూరు ప్లాంట్ కేసులో గెలిచిన టాటా మోటార్స్, టాటా నానో కోసం ఈ ప్లాంట్ కేటాయించబడింది
మరింత చదవండి : మహీంద్రా థార్ ఆటోమేటిక్
0 out of 0 found this helpful