Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

జపాన్ؚలో, భారీగా కప్పినట్లుగా కనిపించిన మహీంద్రా స్కార్పియో N

మహీంద్రా స్కార్పియో ఎన్ కోసం rohit ద్వారా మార్చి 06, 2023 10:53 am ప్రచురించబడింది

మహీంద్రా సప్లయర్ؚల కోసం జరిపిన కాంపొనెంట్ టెస్టింగ్ؚలో భాగంగా ఈ SUV అక్కడ కనిపించిందని విశ్వసిస్తున్నాము.

  • మహీంద్రా, తన మూడవ-జనరేషన్ స్కార్పియోని (స్కార్పియో N అని పిలుస్తారు) భారతదేశంలో 2022 మధ్యలో విడుదల చేసింది.

  • రహస్యంగా చిక్కిన మోడల్ భారీగా మభ్యపెట్టె డిజైన్‌తో ఉన్నట్లు కనిపించింది.

  • దీని LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు మరియు 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ టాప్-స్పెక్ Z8 వేరియంట్‌గా సూచిస్తున్నాయి.

  • 2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ లేదా 2.2-లీటర్ డీజిల్ యూనిట్ దీనికి శక్తిని అందిస్తుంది.

  • RWD, 4WD రెండు ఎంపికలను పొందుతుంది.

  • భారతదేశంలో దీని ధర రూ.12.74 లక్షలు మరియు రూ.24.05 లక్షల మధ్య ఉంటుంది (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).

మహీంద్రా సరికొత్త ఆఫ్-రోడర్ SUV, స్కార్పియో N, ఎంతో ప్రజాదరణ పొందిన మోడల్. దక్షిణ ఆఫ్రికాలో పరిచయం చేసిన తరువాత, ఇది అంతర్జాతీయ మోడల్‌గా మారింది, జపాన్ؚలో భారీగా మభ్యపెట్టె డిజైన్‌తో కనపడిన చిత్రాలు ఆన్ؚలైన్ؚలో రావడం ఆశ్చర్యాన్ని కలిగించాయి.

అది అక్కడ ఎందుకు ఉంది?

ప్రస్తుతానికి దీని గురించి వివరాలు లేకపోయినా, సప్లయర్ؚల కోసం జరిపిన కాంపొనెంట్ టెస్టింగ్ؚలో భాగంగా ఈ సరికొత్త మరియు ప్రజాదరణ పొందిన మహీంద్రా SUV టెస్ట్ డిజైన్ అక్కడ కనిపించిందని విశ్వసిస్తున్నాము. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రత్యేక బ్రాండ్ؚలు సరఫరా చేసే బ్రేక్ భాగాలు, ఎలక్ట్రానిక్ చిప్ؚలు, బేరింగ్ؚలు, గేర్ؚలను దాదాపుగా అన్ని కార్‌లలో ఉపయోగిస్తారు.

ఇండియాలో అందుబాటులో ఉన్న స్కార్పియో Nతో పోలిస్తే, జపాన్ؚలో కనిపించిన మోడల్‌లో ఎలాంటి మార్పులు లేవు. దీని LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు మరియు 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ టాప్-స్పెక్ Z8 వేరియంట్‌గా సూచిస్తుంది.

ఇది కూడా చదవండి: కేవలం డీజిల్-ఆటోమ్యాటిక్ కాంబోతో సౌత్ ఆఫ్రికాలో అడుగుపెట్టిన స్కార్పియో N

భారతదేశంలో స్కార్పియో N

మహీంద్రా, భారతదేశంలో 2022 మధ్యలో స్కార్పియో N అని పిలిచే మూడవ-జనరేషన్ స్కార్పియోని విడుదల చేసింది. ఈ SUV–Z2, Z4, Z6 మరియు Z8 అనే నాలుగు వేరియెంట్‌లలో విక్రయిస్తున్నారు – వీటి ధరలు రూ.12.74 లక్షల నుండి రూ. 24.05 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. మహీంద్రా ఈ వాహనాలను ఆరు, ఏడు సీట్‌ల కాన్ఫిగరేషన్ؚలో అందిస్తుంది.

సంబంధించినది: వైరల్ అయిన మహీంద్రా స్కార్పియో N, జలపాతం సంఘటనలలో జరిగిన పొరపాటు ఇదే

స్కార్పియో N రెండు ఇంజన్ ఎంపికలతో వస్తుంది: 2.2-లీటర్ డీజిల్ యూనిట్ (132PS/300Nm లేదా 175PS/400Nm వరకు) మరియు 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (203PS/380Nm వరకు). ఈ రెండు ఇంజన్‌లు ప్రామాణికంగా 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో జత చేయబడినవి. మరింత శక్తివంతమైన డీజిల్ మరియు పెట్రోల్ యూనిట్‌లు ఆరు-స్పీడ్ ఆటోమ్యాటిక్ గేర్ బాక్స్ ఎంపికను కూడా పొందుతాయి. స్కార్పియో Nలో రేర్-వీల్-డ్రైవ్ సెట్అప్ ప్రామాణికంగా ఉంటుంది, 175PS డీజిల్ కూడా నాలుగు-వీల్ డ్రైవ్ؚలో అందుబాటులో ఉంటుంది.

టాటా హ్యారియర్/సఫారి, హ్యుందాయ్ క్రెటా/ఆల్కజార్ వంటి వాటితో పోటీ పడుతుంది, టయోటా ఫార్చ్యూనర్, MG గ్లోస్టర్ؚలకు చవకైన ఎంపిక అవుతుంది.

ఇక్కడ మరింత చదవండి: మహీంద్రా స్కార్పియో N ఆన్ؚరోడ్ ధర

r
ద్వారా ప్రచురించబడినది

rohit

  • 44 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన మహీంద్రా స్కార్పియో n

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర