వైరల్ అయిన మహీంద్రా స్కార్పియో N, జలపాతం సంఘటనలలో జరిగిన పొరపాటు ఇదే
మార్చి 01, 2023 01:19 pm tarun ద్వారా సవరించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
నిర్వహణ మరియు ప్రయాణీకుల భద్రతకు సంబంధించి సన్ؚరూఫ్ؚలు ఎన్నో సమస్యలను తీసుకురావచ్చు.
-
స్పీకర్‌లు, క్యాబిన్ లైట్ ప్యానెల్ నుండి నీరు లీక్ అవుతున్న స్కార్పియో N వాహనం వీడియో వైరల్ అయ్యింది.
-
సన్ؚరూఫ్ؚను సరిగ్గా మూయకపోవడం లేదా మూసుకుపోయిన డ్రెయిన్ హోల్స్ దీనికి సంభావ్య కారణాలు కావచ్చు.
-
రూఫ్ؚకు అమర్చిన స్పీకర్ ప్యానెల్ సరిగ్గా సన్ؚరూఫ్ؚకు క్రింద ఉన్నందున నీరు తేలికగా ప్రవేశించి ఉండవచ్చు.
-
ఈ సంఘటన వలన ఎలక్ట్రానిక్స్ సరిగ్గా పనిచేయకపోవడం అలాగే లోపలి భాగాలు తుప్పు పట్టడం వంటి సమస్యలకు దారితీయవచ్చు.
జలపాతం క్రింద ఉన్న మహీంద్రా స్కార్పియో N రూఫ్ నుంచి నీరు లీక్ అవుతున్న వీడియో ఇటీవల వైరల్ అయ్యింది. వాహనం యజమాని తన స్కార్పియో N Z8L 4WDలో స్పితికి ప్రయాణిస్తుండగా, దారిలో ఈ సంఘటన జరిగింది.
సమస్య ఎక్కడ తలెత్తింది?
ఈ వ్యక్తి తన స్కార్పియో Nను “తక్షణ, ఉచిత వాష్” కోసం జలపాతం క్రింద నిలిపాడు, కొన్ని సెకన్‌ల తరువాత రూఫ్ؚకు అమర్చిన స్పీకర్‌లు, క్యాబిన్ లైట్ ప్యానెల్ నుండి నీరు లీక్ కావడం మొదలైంది. ప్యాసెంజర్ విండో కూడా తెరిచి ఉన్నందున, అక్కడి నుంచి కూడా నీరు లోపలికి పోయాయి; కానీ దాన్ని మూసిన తర్వాత కూడా నీరు లీక్ అవుతునే ఉంది.
ఇలా ఎందుకు జరిగింది?
ఈ సంఘటన జరగడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు, ప్రధానంగా సన్ؚరూఫ్ؚ సరిగ్గా మూసి ఉండకపోవచ్చు. సన్ؚరూఫ్ పూర్తిగా దాని స్థానంలో అమర్చబడిందా, ప్యానెల్ؚలో ఖాళీ లేకుండా ఉందా అని తనిఖీ చేయడం చాలా అవసరం. డిజైన్ పరంగా సన్ؚరూఫ్ؚలలో ఇటువంటి సమస్యలు ఉండవచ్చు, ఈ సమస్యలలో నీరు చేరడం కూడా ఉంటుంది. ఈ సన్ؚరూఫ్ ప్యానెల్‌లలో సాధారణంగా డ్రెయిన్ హోల్స్ ఉంటాయి, చేరిన నీరు వీటి నుండి సురక్షితమైన మార్గం ద్వారా బయటకు పోతుంది.
ఇది కూడా చదవండి: మహీంద్ర స్కోర్పియో దిగువ శ్రేణి వేరియెంట్‌ల డెలివరీకి మరింతగా వేచి ఉండాల్సిన అవసరం లేదు.
ఈ డ్రెయిన్ హోల్స్ మట్టి, కొమ్మలు, ఆకులతో మూసుకుపోతే నీరు సన్ؚరూఫ్ పేన్ؚలో ఉండిపోతుంది. ప్రయాణిస్తున్నప్పుడు పడే నీటిని తొలగించడానికి మాత్రమే ఈ డ్రెయిన్ డిజైన్ చేయబడింది కానీ ఇక్కడ జలపాతం నుండి నిరంతరంగా వస్తున్న నీటి పరిమాణం డ్రెయిన్ సామర్ధ్యం కంటే ఎక్కువగా ఉన్నందున నీరు వెంటనే డ్రెయిన్ అవ్వలేదు.
స్కార్పియో Nలో ఉన్న మరొక సమస్య ఏమిటంటే, స్పీకర్‌లు నేరుగా సన్ؚరూఫ్ ప్యానెల్ క్రిందే అమర్చబడి ఉంటాయి. కాబట్టి సన్ؚరూఫ్ నుండి నీరు లోపలికి వెళ్ళిన ప్రతిసారీ అది స్పీకర్‌ల నుండి, క్యాబిన్ లైట్ స్విచ్ؚల నుండి లీక్ అవుతుంది.
సన్ؚరూఫ్ؚలు ఉన్న కార్‌లను కలిగిన యజమానులు జలపాతాల క్రింద కారుతో ప్రయాణించడం అసాధారణం కాకపోయిన,ఎక్కువ ఖరీదైన కార్‌ల విషయంలో ప్రతీసారి ఈ విధంగా ఉండకపోవచ్చు. ఉదాహరణకు, ఈ XUV700 జలపాతం క్రింద నుండి వెళ్ళిన, మరింత పెద్ద పనోరమిక్ సన్ؚరూఫ్ ఉన్నప్పటికీ దీనికి ఏమీ జరగలేదు.
ఇది కూడా చదవండి: మహీంద్రా స్కార్పియో N వేరియెంట్-వారీ ఫీచర్‌లు వివరించబడ్డాయి
స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, క్యాబిన్ లోపలకి నీరు ప్రవహించినందున ఎలక్ట్రానిక్స్ సరిగ్గా పని చేయకపోవడం, అనేక భాగాలు తుప్పుపట్టడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు అని తప్పక పేర్కొనాలి. అటువంటి కార్యకలాపాల కోసం సన్ؚరూఫ్ؚ ఉన్న కారును ఉపయోగించకుండా ఉండటం మంచిది. ఎందుకంటే అది మీ కారుకు, భద్రతకు రెండిటికీ ప్రమాదకరం.
ఇక్కడ మరింత చదవండి : మహీంద్రా స్కార్పియో N ఆన్ؚరోడ్ ధర