మహీంద్రా మారాజ్జో VS రెనాల్ట్ లాడ్జి: వేరియంట్స్ పోలిక
మహీంద్రా మారాజ్జో కోసం dinesh ద్వారా జూన్ 17, 2019 12:08 pm ప్రచురించబడింది
- 38 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ రెండిటిలో ఏ MPV ని మీరు కొనుగోలు చేసుకోవాలి ? మేము కనుక్కుంటాము
మహీంద్రా సెప్టెంబర్ 3, 2018 న మారాజ్జో MPV ను ప్రవేశపెట్టింది. ఇది 10 లక్షల రూపాయల ప్రారంభ ధర వద్ద (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ప్రారంభించింది. ఈ ధర వద్ద, మహీంద్రా MPV యొక్క కొన్ని వేరియంట్స్ ధరల పరంగా రెనాల్ట్ లాడ్జీతో తలపడతాయి. ఈ రెండు కార్లు కూడా 7-మరియు 8-సీటర్ రెండు ఆప్షన్స్ తో అందించబడుతున్నాయి, అందువలన వీటిలో ఏదో ఒకటి కొనుగోలు చేసుకొనేందుకు మీరు మార్కెట్ లో ఉంటే గనుక ఏది కొనాలా అని తికమకలో పడతారు.
అందువలన దగ్గర దగ్గరగా ధరలు ఉండేటటువంటి ఈ కార్ల వేరియంట్స్ ని ఒకదానితో ఒకటి పోల్చి చూడడం ద్వారా మీ అవసరాలకు సరిగ్గా ఏది సరిపోతుందో కనుక్కుందాము. కానీ వాటి లక్షణాలపై మరిన్ని వివరాలను వెల్లడి చేయడానికి ముందు, వాటి వివరణలు మరియు ధరలను పరిశీలించండి.
కొలతలు
మహీంద్రా మారాజ్జో |
రెనాల్ట్ లాడ్జీ |
రెనాల్ట్ లాడ్జీ స్టెప్‌వే |
|
పొడవు |
4585mm |
4498mm |
4522mm |
వెడల్పు |
1866mm |
1751mm |
1767mm |
ఎత్తు |
1774mm |
1709mm |
1709mm |
వీల్బేస్ |
2760mm |
2810mm |
2810mm |
* లాడ్జీ స్టెప్వే ముఖ్యంగా కొంత అధనపు బాడీ క్లాడింగ్ తో ఉంటుంది.
- మరాజ్జో కారు లాడ్జీ కంటే పొడవైనది, విస్తృతమైనది మరియు ఎత్తైనదిగా ఉంటుంది. అయితే వీల్‌బేస్ విషయానికి వస్తే రెనాల్ట్ మహీంద్రా ని 50mm తో చిత్తు చేస్తుంది.
- బాహ్య కొలతలు మరాజ్జో మరింత షోల్డర్ రూం మరియు హెడ్ రూంను కలిగి ఉంటుందని అనిపించేలా ఉంటాయి, అలాగే ఆ రెండిటిలో లాడ్జీ మంచి లెగ్‌రూం ని కలిగి ఉంటుంది.
ఇంజిన్
మహీంద్రా మారాజ్జో |
రెనాల్ట్ లాడ్జీ / లాడ్జీ స్టెప్వే |
|
ఇంజిన్ |
1.5-లీటర్ |
1.5-లీటర్ |
పవర్ |
122.6PS |
85PS/110PS |
టార్క్ |
300Nm |
200Nm/245Nm |
ట్రాన్స్మిషన్ |
6-స్పీడ్ MT |
5-స్పీడ్ MT /6-స్పీడ్ MT |
మైలేజ్ |
17.3kmpl |
NA |
- MPV లు రెండూ కూడా ఒకే విధమైన సామర్థ్య ఇంజిన్లతో శక్తిని కలిగి ఉన్నప్పటికీ, మహీంద్రా మరింత శక్తివంతమైనది మరియు అధిక టార్క్ ని అందిస్తుంది. దాని అధిక స్పీడ్ లో ఉన్నప్పుడు లాడ్జీ యొక్క 1.5 లీటర్ ఇంజిన్ 12Ps శక్తిని మరియు 55Nm టార్క్ ని మార్జాజో కంటే తక్కువగా అందిస్తుంది.
- మరాజ్జో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో అమర్చబడి ఉంటుంది. లాడ్జీ మనకి 85Ps పవర్ తో 5-స్పీడ్ MT ను కలిగి ఉంటుంది, అయితే దాని 110Ps శక్తిని అందించే డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో అందుబాటులో ఉంటుంది.
ధరలు
మహీంద్రా మరాజ్జో |
రెనాల్ట్ లాడ్జీ |
- |
STD 85PS రూ. 8.33 లక్షలు |
- |
RXE 85PS రూ. 9.34 లక్షలు |
M2 రూ. 9.99 లక్షలు |
RXL 85PS స్టెప్‌వే రూ. 10.23 లక్షలు |
M4 రూ. 10.95 లక్షలు |
RXZ 85PS స్టెప్‌వే రూ. 11 లక్షలు |
|
RXZ 110PS స్టెప్‌వే రూ. 11.81 లక్షలు |
M6 రూ. 12.40 లక్షలు |
- |
M8 రూ. 13.90 లక్షలు |
- |
వేరియంట్స్
మారాజో యొక్క M2 వేరియంట్ లాడ్జీ యొక్క RXL 85PS స్టెప్వే వేరియంట్ కి వ్యతిరేకంగా పోల్చవచ్చు, మరోవైపు, మరాజ్జో యొక్క M4 వేరియంట్ లాడ్జీ యొక్క RXZ 85PS స్టెప్ వేరియంట్ తో పోల్చవచ్చు.
లక్షణాలు
మహీంద్రా మారాజో M2 Vs రెనాల్ట్ లాడ్జీ RXL 85PS స్టెప్వే
మోడల్ |
ధర |
మహీంద్రా మార్జోజో M2 |
రూ. 9.99 లక్షలు |
రెనాల్ట్ లాడ్జీRXL 85PS స్టెప్వే |
రూ. 10.23 లక్షలు |
తేడా |
రూ. 24,000 (లాడ్జీ చాలా ఖరీదైనది) |
సాధారణ లక్షణాలు: డ్రైవర్-సైడ్ ఎయిర్బాగ్, EBD తో ABS, రూఫ్-మౌంట్ 2 మరియు 3 వ వరుస A.C, పవర్ విండోస్ మరియు టిల్ట్-అడ్జస్టబుల్ పవర్ స్టీరింగ్ వంటి లక్షణాలు ఉన్నాయి.
లాడ్జీ పై మరాజ్జో ఏమిటి అందిస్తుంది: కో- డ్రైవర్ ఎయిర్బాగ్, వెనుక డిస్క్ బ్రేక్లు మరియు ISOFIX చైల్డ్ సీటు యాంకర్స్ వంటి లక్షణాలను అందిస్తుంది.
మరాజ్జో పై లాడ్జీ ఏమిటి అందిస్తుంది: వెనుక పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రికల్ సర్దుబాటు ORVMs, CD, AUX, USB మరియు బ్లూటూత్ తో టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అలాయ్స్, వెనుక వాషర్ మరియు వైపర్ మరియు వెనుక డిఫేజర్ మరియు ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ వంటి లక్షణాలను అందిస్తుంది.
తీర్పు: లాడ్జీ కంటే తక్కువ పరికరాలతో అమర్చబడి ఉన్నప్పటికి, మరాజ్జో ఇక్కడ దాని ప్రాధమిక భద్రతా లక్షణాల కారణంగా(డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్ రూపంలో) మా ఎంపికగా ఉంది. అయితే, మీరు వ్యక్తిగత ఉపయోగం కోసం దీనిని కొనుగోలు చేస్తారు (మీరే డ్రైవింగ్ చేసినట్లయితే మరియు ముందు సీటులో ఎవ్వరూ లేకున్నా) లేదా డ్రైవర్ ని పెట్టుకొని వెళ్ళాలనుకున్నా కూడా లాడ్జీ మంచి విలువను అందిస్తుంది. మొదటి సందర్భంలో, మీరు మరాజ్జో ని కొనుగోలు చేసుకుంటే, మీరు వెనుక పార్కింగ్ సెన్సార్లు మరియు టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ వంటి లక్షణాలు కొనుగోలు తరువాత మార్కెట్ లో పొందవచ్చు.
మహీంద్రా మరాజ్జో M4 vs రెనాల్ట్ లాడ్జీ RXZ 85PS స్టెప్వే:
మోడల్ |
ధర |
మహీంద్రా మారాజ్జో M4 |
రూ.10.95 లక్షలు |
రెనాల్ట్ లాడ్జీ RXZ 85PS స్టెప్వే |
రూ. 11 లక్షలు |
తేడా |
రూ. 5,000 (లాడ్జీ చాలా ఖరీదైనది) |
సాధారణ లక్షణాలు (మునుపటి వేరియంట్స్ లో): డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్, వెనుక వాషర్, వైపర్ మరియు డీఫాగర్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVM లు, మ్యూజిక్ సిష్టం, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటి లక్షణాలు ఉన్నాయి.
లాడ్జీ పైన మరాజ్జో ఏమిటి అందిస్తుంది: వెనుక డిస్క్ బ్రేక్లు మరియు ISOFIX చైల్డ్ సీటు యాంకర్స్ వంటి లక్షణాలను అందిస్తుంది.
మరాజ్జో పై లాడ్జీ ఏమిటి అందిస్తుంది: రేర్ పార్కింగ్ సెన్సార్లు, రివర్స్ పార్కింగ్ కెమెరా, 7-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, నావిగేషన్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ మరియు క్రూయిస్ కంట్రోల్ వంటి లక్షణాలను అందిస్తుంది.
తీర్పు:
చాలా మంచి లక్షణాలను పరిగణలోనికి తీసుకుంటే ఇక్కడ లాడ్జీ ఒక మంచి కారుగా కనిపిస్తుంది. మరాజ్జో M4 పై ఉన్న రూ.5,000 ప్రీమియం కోసం లాడ్జీ కారు రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు సెన్సార్స్, నావిగేషన్ వంటి లక్షణాలను అందిస్తుంది.
Also Read
- Mahindra Marazzo Comes With Extended Warranty Of Upto 5 Years/1,50,000km
- Mahindra Marazzo: 5 Things We Like
- Mahindra Marazzo: 5 Things That Could Have Been Better
Read More on : Marazzo diesel
0 out of 0 found this helpful