టియువి300 వాహనానికి వెబ్ సైట్ ను ప్రారంభించిన మహీంద్రా

జూలై 31, 2015 04:38 pm manish ద్వారా ప్రచురించబడింది

జైపూర్: మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ (ఎం అండ్ ఎం) ఎప్పుడూ బ్రూస్ వేన్ లాగే చర్చనీయ అంశాలకు దూరంగానే ఉంటుంది. మహీంద్రా కూడా ఈ సాదృశ్యాన్ని కొంతవరకు సీరియస్ గా తీసుకుంది. బాగా స్పూర్తిగా నిలుస్తుందనుకున్న చీతా -ఎక్స్ యు వి 500 మీకు గుర్తుందా! మళ్లీ దాన్ని పునరుద్ధరించారనుకోండి. మనం ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి, మహీంద్రా గ్రూప్ ప్రారభించబోయే టియువి300 కోసం ఇప్పుడు ఒక వెబ్ సైట్ ను ప్రారంభించింది. 

ఈ వెబ్ సైట్ ఒక వీడియోను కలిగి ఉంది. అది ఏదో విశేషమైన మరియు శక్తివంతమైన మెటల్ వాల్ ను మనకి చూపిస్తుంది. ఆ వాల్ కొన్ని స్ట్రైక్స్ తో పొడిపొడిగా టియువి300 అనే ఒక కొత్త లోగో తో కనబడుతుంది. 

ఈ కారు సెప్టెంబర్ మధ్యలో ప్రారంభించబడుతుంది. మేము ఎల్లప్పుడు ఇటాలియన్ వారి ఉత్పత్తులను బాగా గౌరవిస్తాము అని మహీంద్రా సంస్థ తెలిపింది. అందుకే, ఈ వాహనంను ఇటాలియన్ డిజైన్ సంస్థ పినిన్ఫారినా నుండి తీసుకువచ్చిన ఇన్పుట్లతో మహీంద్రా వారిచే సొంతంగా రూపొందించారు. టియువి300 యొక్క రూపకల్పన ఒక యుద్ధ ట్యాంక్ నుండి ప్రేరణగా తీసుకుని రూపొందించారు. ఈ అధికారిక స్కెచ్లను చూస్తుంటే ఈ ఎస్యూవి, ఎక్స్ యు వి500 వలె కాకుండా, నిలువు గీతల లక్షణాలతో మరియు బాక్సీ ఆకారంతో కూడి వెనుక వైపు ఒక అదనపు వీల్ తో జత చేయబడి ఉంది. 

ఆర్ & డి, మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో ( ఎం ఆర్ వి) గణనలను నిర్వహిస్తుంది మరియు ఈ సంస్థ టియువి300 ను ఎగుమతి చేస్తున్నామని ఇది ప్రపంచ ఉత్పత్తి అని ప్రకటించింది. ఈ కొత్త కారులో అమర్చిన అన్ని లక్షణాలు కూడా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తగినట్లుగా ఉన్నాయని ఇవి భద్రతా లక్షణాలను అందించడంలో సహాయపడతాయని తెలిపింది. 

వెబ్ సైట్ ఒక లింక్ ను కలిగి ఉంది. దానిలో మీ వివరాలు ఇవ్వడం ద్వారా టియువి300 ఎపుడు ప్రారంభవుతుంది అనే విషయం మీకు తెలుస్తుంది. దీనిలోని ఎం హాక్ డీజిల్ ఇంజన్ యొక్క లక్షణాల విషయానికొస్తే అది మనం ఊహించిన విధంగానే అలాగే నిలిచిపోయింది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

కార్ వార్తలు

  • ట్రెండింగ్ వార్తలు
  • ఇటీవల వార్తలు

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience