• English
  • Login / Register

మహీంద్రా KUV100 రూ. 10,000 వద్ద బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి

మహీంద్రా కెయువి 100 ఎన్ఎక్స్టి కోసం nabeel ద్వారా డిసెంబర్ 22, 2015 12:35 pm ప్రచురించబడింది

  • 15 Views
  • 325 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్ ;

KUV 100

గత వారం, మహీంద్రా దాని రాబోయే కారు, KUV100 యొక్క చిత్రాలు మరియు వివరాలని వెల్లడించింది… గతంలో ఇది S101 అనే సంకేత పదం తో ఉంది. ఈ కారు భారతీయ మార్కెట్లో మొదటి సూక్ష్మ SUV గా ఉంటుంది మరియు ఇది మారుతి సుజుకి ఇగ్నిస్ ని అనుసరించబడుతుంది. మహీంద్రా డీలర్షిప్ వారు ఇలా అన్నారు. కార్ దేకో లో KUV100 బుకింగ్స్ ధర 10,000లు ఉంటుందని, దీని డెలివరీ జనవరి 30, 2016 నుండి ప్రారంభం అవతుందని అన్నారు. మహీంద్రKUV100 వాహనం mFALCON అనే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లని పరిచయం చేసింది. ఈ ఇంజిన్లు 5- స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ సిస్టం తో వస్తాయి. సమీప భవిష్యత్తులో ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ని కుడా పరిచయం చేయవచ్చు. ఈ కారు ధర సుమారు 4-7 లక్షల వరకు ఉండవచ్చు. ఇది జనవరి 15,2016 న ప్రారంభం కానుంది.

KUV 100

ఈ కారు ప్రక్క నుండి చూస్తే రెండు స్ట్రింగ్ బాడీ లైన్స్ తో స్థూలంగా కనిపిస్తుంది. అలాయ్ చక్రాలు చూడటానికి అయితే బాగానే వున్నాయి కాని ఈ3-D ప్రపంచంలో ఆకట్టుకుంటాయో లేదో వేచి చూడాల్సిందే. బల్కీ గా కనిపించేందుకు కారు యొక్క వెనుక డోర్ హేండిల్ ని C పిల్లర్ కి సమీపంలో ఉంచుతారు. హెడ్ల్యాంప్ యూనిట్ DRLs ని కలిగి వుండి ప్రక్క ప్రొఫైల్ లో mFalcon బ్యాడ్జ్ అనే ఫీచర్ ని కలిగి వుంటుంది. దీని గ్రిల్ XUV లక్షణంతో, మహీంద్రా అనే చిహ్నం తో వుంటుంది. పెద్ద గాలి డ్యాములు, బంపర్స్ తో బోల్డ్ గా ఉండి, SUV వైకరిని కలిగి వుంటుంది. బంపర్ లో న్యూ ఫాగ్ లైట్ ని ఉంచుతారు. ఇది ముందు నుండి చూస్తే దీర్ఘచతురస్రాకారంలో ఉండి ఆకర్షణీయంగా ఉంటుంది. మహీంద్రా కారు 4 వేరియంట్లలో ప్రామాణిక ABS ని కలిగి ఉండి ఎయిర్ బాగ్స్ వంటి ఆప్షనల్ ఫీచర్స్ ని కలిగి వుండి చక్కగా రూపుదిద్దుకోబడింది.

mFALCON

ప్రస్తుతం అన్ని కొత్త mFALCON కుటుంబాలలో 2 ఇంజిన్లు ఉన్నాయి. అవి G80 పెట్రోల్, D75 డీజిల్. పెట్రోల్ ఇంజిన్ 1.2 లీటర్ 3 సిలిండర్ కలిగి ఉండి 5,500 rpm వద్ద 82bhp శక్తిని, మరియు 3,500 rpm వద్ద 114 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ 1.2-లీటర్ 3-సిలిండర్ టర్బో బ్లాక్ ఇంజిన్ ని కలిగి ఉండి, 3,750 rpm వద్ద 77bhp శక్తిని, మరియు 1,750-2,250 rpm మధ్య లో 190 Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ల యొక్క పనితనం చూడటానికి మనం జనవరి 15, 2016 వరకు వేచి చూడాలి. కానీ ఖచ్చితంగా , మహీంద్రా SUV రికార్డు వలన , ఫోర్డ్ ఫిగోహ్యుందాయ్ ఐ 10, మారుతి స్విఫ్ట్, టాటా జైకా వంటి కార్లకి ఇది కఠిన మయిన సమయం .

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Mahindra కెయువి 100 ఎన్ఎక్స్టి

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
  • కియా syros
    కియా syros
    Rs.6 లక్షలుఅంచనా ధర
    అంచనా ప్రారంభం: మార, 2025
  • బివైడి సీగల్
    బివైడి సీగల్
    Rs.10 లక్షలుఅంచనా ధర
    అంచనా ప్రారంభం: జనవ, 2025
  • లెక్సస్ lbx
    లెక్సస్ lbx
    Rs.45 లక్షలుఅంచనా ధర
    అంచనా ప్రారంభం: డిసంబర్, 2024
  • ఎంజి 3
    ఎంజి 3
    Rs.6 లక్షలుఅంచనా ధర
    అంచనా ప్రారంభం: ఫిబరవరి, 2025
  • నిస్సాన్ లీఫ్
    నిస్సాన్ లీఫ్
    Rs.30 లక్షలుఅంచనా ధర
    అంచనా ప్రారంభం: ఫిబరవరి, 2025
×
We need your సిటీ to customize your experience