ఫోర్డ్ ఫిగో

` 4.3 - 7.7 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

ఫోర్డ్ ఇతర కారు మోడల్లు

 
*Rs

ఫోర్డ్ ఫిగో వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

ముఖ్యాంశాలు:


జనవరి 22, 2016: ఫోర్డ్ భారతదేశం వారి లైనప్ లో ఫిగో హ్యాచ్బ్యాక్ యొక్క ఒక క్రాస్ఓవర్ వెర్షన్ ప్రారంభించే అవకాశం ఉంది వినోదం వ్యక్తపరిచాడు. ఫోర్డ్ ఫిగో వాహనం, క్రాస్ ఓవర్ వేరియంట్ కొరకు ఆదర్శ పునాదులను అందిస్తుంది. ఈ క్రాస్ ఓవర్ వెర్షన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా 100 పి ఎస్ పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ విభాగంలో, ఈ ఇంజన్ అత్యంత శక్తివంతమైనది అని చెప్పవచ్చు.

అవలోకనం


పరిచయం


ఫిగో, దేశంలో ఫోర్డ్ యొక్క అత్యంత విజయవంతమైన హాచ్బాక్ గా ఉంది దీని ఆధరణతో ఈ ఫోర్డ్, రెండవ తరంలోనికి ప్రవేశించడానికి సిద్దంగా ఉంది. ఈ 2015 పునరుక్తి, మరింత శక్తివంతమైనదిగా, సురక్షిత వాహనం లా మరియు అత్యంత ఆధునికంగా కనిపిస్తోంది. ఈ వాహనంలో ఫోర్డ్ సంస్థ, ఏ ఏ అంశాలను అందిస్తుందో ఒక త్వరిత వీక్షణ ను తీసుకుందాం.

అనుకూలాలు1. నిష్పత్తి విషయంలో, నగరాలకు సరైన పరిమాణం కలిగిన వాహనం అని చెప్పవచ్చు.
2. 100 పి ఎస్ పవర్ ను విడుదల చేసే డీజిల్ ఇంజన్, డ్రైవ్ పరంగా మితవ్యయం అలాగే సరదా అనుభూతిని అందించే విధంగా ఉంటుంది.
3. భద్రత విషయానికి వస్తే, ద్వంద్వ ఎయిర్బాగ్లు ప్రామాణికంగా అందించబడతాయి. అదే అగ్ర శ్రేణి వేరియంట్ విషయానికి వస్తే, ఆరు ఎయిర్బాగ్లు అందించబడతాయి.

ప్రతికూలాలు1. ఈ వాహనాలకు అందించిన పెట్రోల్ ఇంజన్ అంత అబివృద్ది చెందినది కాదు అలాగే నగర ప్రయాణాలకు కూడా అంత ఉత్తమమైనది కాదు.
2. అంతర్గత నాణ్యత విషయానికి వస్తే, బలహీనంగా కనిపిస్తుంది. దీని యొక్క పోటీ వాహనం అయిన గ్రాండ్ ఐ 10 వాహనంలో అయితే, నాణ్యత కలిగిన అంతర్గత భాగాలను అందించడం జరిగింది.
3. ఆటోమేటిక్ ఫంక్షన్ ను ఈ వాహన సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ కు కూడా అందించడం జరగలేదు. దీని వలన, కొన్ని మంచి లక్షణాలను ఈ వాహనం కోల్పోయింది అని చెప్పవచ్చు.

అత్యద్భుతమైన లక్షణాలు1. ఫోర్డ్ మై కీ : వేగ పరిమితిని అలాగే వాల్యూమ్ పరిమితి ని సెట్ చెయ్యడానికి ప్రోగ్రామబుల్ రెండవ కీ, ఫోర్డ్ లో మాత్రమే అందించబడింది. కారును నడపడం నేరుకోవాలి అనిపించినప్పుడు ఇది ఉపయోగపడుతుంది.
 
2. ఆరు ఎయిర్బాగ్లు, ఈ విభాగంలో ఈ వాహనానికి అందించడం వలన ఒక బెంచ్ మార్క్ ను సృష్టించింది. ముందు ఎప్పుడూ వినిపించని విధంగా ఈ వాహనం రూ 10 లక్షల కంటే తక్కువ ధరకు ఈ వాహనం అందించబడుతుంది.
 

బాహ్య భాగం


Image1
 
పాత ఫిగో, ఆదిపత్యం పరంగా బోరింగ్ అని పిలవబడుతుంది ఎందుకంటే, ఇది శ్తైల్ గా రూపొందించబడింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా బోరింగా ఎక్కడా పిలవబడటం లేదు. ముందుగా ఈ వాహనం యొక్క ముందు భాగం విషయానికి వస్తే, బారీ స్వెప్ట్ బేక్ హెడ్ ల్యాంప్లు అందించబడ్డాయి మరియు ఈ రెండింటి మధ్య భాగంలో ఆస్టన్ మార్టిన్ పోలికలను కలిగిన గ్రిల్ అందినబడుతుంది. దీని క్రింది భాగంలో ఒక బంపర్ బిగించబడి ఉంటుంది దీనికి ఒక జత ఫాగ్ ల్యాంప్లు విలీనం చేయబడి ఉంటాయి. కానీ, ఈ వాహనం యొక్క పరిమాణం పరంగా చిన్నగా ఉంటుంది.
 
Image2
 
ఈ వాహనం యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ప్రత్యేకమైన షోల్డర్ లైన్లు కారు పొడవునా అలాగే విండో ప్రాంతంలో కూడా విలీనం చేయబడి ఉంటాయి. ఒక విండో లైన్, వెనుక విండో నుండి అందించబడుతుంది మరియు ఇది, మందపాటి సి పిల్లార్ లోనికి ముగుస్తుంది. చక్కని టచ్ ను కలిగిన టర్న్ సూచికలు ఈ వాహనం యొక్క వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లకు అందించబడతాయి. మరోవైపు, ఈ వాహనం యొక్క వీల్ ఆర్చులకు చక్కని ఆకృతి కలిగిన 14 అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించబడతాయి. ఈ హాచ్బాక్ కు ఖచ్చితంగా, ఒక బారీ సెట్ కలిగిన వీల్స్ అందించబడతాయి.
 
Image3
 
ఈ వాహనం యొక్క వెనుక భాగం విషయానికి వస్తే, ఒక బారీ చక్కని బంపర్ కారు వెనుక భాగంలో అందించబడుతుంది. రివర్సింగ్ ల్యాంప్లు, వెనుక ఫాగ్ లైట్లు వంటివి వెనుక భాగంలో ఉండే టైల్ లైట్ క్లస్టర్ లో అందించబడతాయి. దీని వలన వెనుక భాగం మరింత అందంగా కనిపిస్తుంది. సమూహాన్ని విచ్చిన్నం చేయడానికి వెనుక భాగంలో ఉండే బంపర్ కు, ఒక జత రిఫ్లెక్టార్లు విలీనం చేయబడి ఉంటాయి.
 
ఈ వాహన బాహ్య భాగం యొక్క కొలతలు విషయానికి వస్తే, దాని తరగతిలో ఫోర్డ్ అనేది ఒక అతిపెద్ద కారుగా ఉంది. అంతేకాకుండా ఈ వాహనానికి బారీ వీల్బేస్ అందించబడింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా, సూక్ష్మ ఎస్యువి అయిన కెయువి 100 వాహనం కంటే ఈ వాహనం ఉత్తమం అని చెప్పవచ్చు.
 
Table1
 
ఈ ఫోర్డ్ వాహనం, ఏ డిజైన్ అవార్డులను గెలుచుకోలేదు. అదే సమయంలో, ఇది ఏడు వేర్వేరు రంగులు లో అందుబాటులో ఉంది మరియు అందమైన అలాగే వక్రతల మిశ్రమంతో రూపొందించబడింది. మనం ఖచ్చితంగా చెప్పగలం ఈ వాహనం డిజైన్ పరంగా సురక్షితమైన వాహనం అని చెప్పవచ్చు.
 

అంతర్గత భాగం


ఈ ఫోర్డ్ వాహనంలో మొదటిగా గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ వాహనం యొక్క లోపలి భాగం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ వాహనానికి, అత్యంత ఖచ్చితమైన సీటింగ్ అమరిక ను అందించడం జరిగింది. ఇటీవల ఫోర్డ్ నుండి విడుదల అయిన ఈ వాహనం ప్రత్యేకంగా కనబడుతుంది.
 
Image4
 
ఈ ఫోర్డ్ వాహనం యొక్క లోపలి భాగానికి, నలుపు మరియు బీజ్ రంగు పధకాలను అందించడం జరిగింది. ఫోర్డ్ ఫిగో అస్పైర్ లో ఉండే మొత్తం నలుపు రంగు పథకం అందించబడుతుంది. అంతేకాకుండా లోపలి భాగం మరింత అందంగా కనబడటం కోసం, సెంట్రల్ కన్సోల్ పై సిల్వర్ ముగింపు అందించబడుతుంది. అంతేకాకుండా, మోనోటోనీ నలుపు రంగు ను బ్రేక్ చేయుట కొరకు ఏసి వెంట్ల చుట్టూ తక్కువ మొత్తం లో క్రోం చేరికలను అందించడం జరిగింది. లోపలి భాగం మరింత అందంగా కనబడటం కోసం, లోపల ఉండే సీట్లకు ఫ్యాబ్రిక్ అపోలిస్ట్రీ ను అందించడం జరిగింది. కొనుగోలుదారులు ఫోర్డ్ అస్పైర్ లో ఉండే లెధర్ అపోలిస్ట్రీ ను గనుక ఇష్టపడుతున్నప్పటికీ, ఫోర్డ్ వాహనానికి ధర పరంగా ఈ అపోలిస్ట్రీ అందించబడటం లేదు.
 
Image5
 
ఈ ఫోర్డ్ వాహనం లోపలి భాగంలో ఉండే ముందు సీత్లు, చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. కొంచెం బాద కలిగించే విషయం ఏమిటంటే, క్యాబిన్ లో ఉండే సీట్లకు కుషన్ సౌకర్యాన్ని అందించవలసిన అవసరం ఉంది. క్యాబిన్ లో ఉండే డ్రైవర్ సీటు, ఎత్తు సర్ధుబాటు సౌకర్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా క్యాబిన్ కాక్పిట్ విభాగంలో ఉండే స్టీరింగ్ వీల్, టిల్ట్ సర్ధుబాటు సౌకర్యాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. స్టీరింగ్ వీల్ సర్దుబాటు ఫంక్షన్ ను కలిగి లేనప్పటికీ, సౌకర్యవంతమైన డ్రైవింగ్ స్థానాన్ని కలిగి ఉండటం అనేది పెద్ద విషయం కాదు.
 
Image6
 
సీటింగ్ పరంగా, వెనుక బెంచ్ ఫ్లాట్ ఫంక్షన్ ను కలిగి ఉంది మరియు ఖచ్చితంగా అలాగే మరింత కుషన్ సౌకర్యాన్ని కలిగి ఉండవలసిన అవసరం ఉంది. వెనుక సీట్ లలో, ఇద్దరు వ్యక్తులకు సౌకర్యవంతం అని చెప్పవచ్చు. అలాగే ఈ ఫోర్డ్ వాహనం యొక్క వెనుక భాగంలో మూడవ వ్యక్తి కొంచెం అసౌకర్యకరంగా కూర్చోవలసిన అవసరం ఉంది. చివరిగా, గ్రాండ్ ఐ 10 వాహనం వలే కాకుండా, ఈ ఫోర్డ్ వాహనం వెనుక ఏసి వెంట్ లను మరియు సెంటర్ ఆర్మ్ రెస్ట్ లను కలిగి లేదు.
 
Image7
 
ఈ మోడల్ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన టైటానియం + వాహనం విషయానికి వస్తే, ఈ విభాగంలో ఈ హాచ్బాక్ కు అన్ని అంశాలను ఎంపిక చేసుకోవచ్చు. ఈ వాహనానికి అందించబడిన అంశాల విషయానికి వస్తే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫంక్షన్ అందించబడుతుంది. అంతేకాకుండా, ఈ వాహనం క్యాబిన్ త్వరగా చల్లబడటం కోసం బటన్ లను కలిగిన మేక్స్ ఏసి అందించబడుతుంది. వినోద విభాగం విషయానికి వస్తే, ఈ ఫోర్డ్ వాహనం బ్లూటూత్, ఆక్స్ మరియు యూఎస్బి కనెక్టవిటీ లతో కూడిన ఇంటిగ్రేటెడ్ వినోద వ్యవస్థ ను అందించడం జరిగింది. అంతేకాకుండా, ఈ ఫోర్డ్ వాహనానికి వాయిస్ కాల్ లేదా సంగీతం ప్లే ఆదేశాలను ఉపయోగించడానికి అనుమతించే ఫోర్డ్ యొక్క సింక్ వ్యవస్థ ను అందించడం జరిగింది.
 
Image8
 
ఈ ఫోర్డ్ వాహనానికి, ఈకోస్పోర్ట్ లో ఉండే స్టీరింగ్ వీల్ ను అందించడం జరిగింది మరియు టెలిఫోనీ అలాగే చాల్స్ కొరకు స్విచ్చులు అందించబడతాయి. డ్రైవర్ కు డ్రైవింగ్ సమయంలో మంచి పట్టును అందించడానికి అనుమతించే గ్రైనీ నిర్మాణం కలిగిన దానితో స్టీరింగ్ వీల్ కప్పబడి ఉంటుంది. అయితే, స్టీరింగ్ వీల్ ఫోర్డ్ పరిమాణాల ద్వారా చాలా తేలికగా ఉంటుంది.
 
Image9
 
ఈ వాహన సిరీస్ లో ఉండే టైటానియం వేరియంట్ ను గనుక వినియోగదారులు ఎంపిక చేయాలి అనుకున్నట్లైతే, దీనిలో సిస్టం కొరకు అలాగే ఫోర్డ్ యొక్క సింక్ వ్యవస్థ కొరకు స్క్రీన్ లు అందించబడవు. దాని స్థానంలో, ఫోన్ కు బదులుగా డాక్ ను పొందవచ్చు. వినోదాన్ని ఆనందిస్తున్నప్పుడు లేదా పరికరంలో నావిగేషన్ ను ఉపయోగిస్తున్నప్పుడు ఫోన్ ను పెట్టేందుకు అమరిక మరియు డబ్బెడ్ డాక్ వంటివి, మంచి సౌకర్యవంతమైన స్థానం అని చెప్పవచ్చు.
 
Image10
 
ఈ విభాగంలో ఈ హాచ్బాక్ కు అవసరమైన అన్ని అంశాలను ఫోర్డ్ సంస్థ అందజేస్తుంది. అంతేకాకుండా ఈ ఫోర్డ్ సంస్థ యొక్క తయారీదారుడు, సీటింగ్ ఫ్లోర్ కొరకు తగినంత స్థలం, నిక్ నేక్స్ కొరకు క్యాబిన్ చుట్టూ చిన్న చిన్న హోల్స్ మరియు లగేజ్ ను పెట్టుకునేందుకు ఒక బారీ 257 లీటర్ల బూట్ కంపార్ట్మెంట్ సామర్ధ్యం వంటి స్థలాలను అందించడం జరిగింది. నిర్మాణ నాణ్యత విషయానికి వస్తే, ఈ వాహనాన్ని గ్రాండ్ ఐ 10, బోల్ట్ వంటి వాహనాలతో పోలిస్తే నాణ్యత ను కలిగి లేదు అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ హాచ్బాక్ వాహనం నేడు మార్కెట్ లో ఈ విభాగంలో, ఒక ప్రత్యేక స్థానంలో ఉంది అని చెప్పవచ్చు.
 
Table2
 

ఇంజన్ మరియు పనితీరు


ఈ ఫోర్డ్ ఫిగో వాహనం, రెండు పెట్రోల్ ఇంజన్ లతో అలాగే ఒక డీజిల్ ఇంజన్ తో అందుబాటులో ఉంది. అయితే బారీ పెట్రోల్ ఇంజన్, 6- స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో మాత్రమే అందుబాటులో ఉంది. అదే మిగిలిన రెండు ఇంజన్ ల విషయానికి వస్తే, 5- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉన్నాయి.
 
Table3_Ford Figo
 
Image11
 

1.2 లీటర్ టి విసిటి


1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, నగర రోడ్లకు సరిపోయే ఉత్తమమైనది అని చెప్పవచ్చు కానీ, రహదారి రోడ్లపై అత్యంత ఖచ్చితమైన అనుభూతిని అందించలేదు. ఈ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1196 సిసి స్థానభ్రంశ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది అలాగే, డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీ కరణ ఆధారంగా నాలుగు సిలండర్లను మరియు 16 వాల్వ్ లను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 6300 ఆర్ పి ఎం వద్ద 86.8 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 4000 ఆర్ పి ఎం వద్ద 112 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది మరియు దీని ద్వారా, విడుదల అయిన టార్క్ ఉత్పత్తి వాహనం యొక్క ముందు చక్రాలకు పంపిణీ అవుతుంది. మరోవైపు ఈ ఇంజన్ ఇంధన సామర్ధ్యం విషయానికి వస్తే, డైరెక్ట్ ఇంజక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థ తో జత చేయబడి నగరాలలో, 14.68 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అదే విధంగా రహదారులలో, 18.16 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు ఈ వాహనం యొక్క త్వరణం విషయానికి వస్తే, 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 15.7 సెకన్ల సమయం పడుతుంది. అదే విధంగా ఇదే వాహనం మరోవైపు, 157 కె ఎం పి హెచ్ గల అధిక వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
 
Image12
 

1.5 లీటర్ టి- విసిటి


ఈ ఇంజన్, ఈ మోడల్ సిరీస్ యొక్క టైటానియం వేరియంట్ లో మాత్రమే అందించబడుతుంది మరియు ఇది, 6- స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫోర్డ్ ఫిగో వాహనం, ఒక మంచి హాచ్బాక్ గా నిలచింది కానీ, పనితీరు విషయంలో ఆకట్టుకునే ఉత్పత్తిని ఇవ్వడంలో విఫలం అయ్యింది. ఈ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1499 సిసి స్థానభ్రంశ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది అలాగే డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా నాలుగు సిలండర్లను మరియు 16 వాల్వ్ లను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 6300 ఆర్ పి ఎం వద్ద 110.4 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 4250 ఆర్ పి ఎం వద్ద 136 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు, ఈ ఇంజన్ డైరెక్ట్ ఇంజక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థ తో జత చేయబడి నగరాలలో, 13.09 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అదే విధంగా రహదారులలో 17.01 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు ఈ వాహనం యొక్క త్వరణం విషయానికి వస్తే, 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 15.7 సెకన్ల సమయం పడుతుంది మరోవైపు ఇదే వాహనం, 156 కె ఎం పి హెచ్ గల అధిక వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
 
Table4_Ford Figo
 
Image13
 

1.5 లీటర్ టి డిసి ఐ


డ్రైవింగ్ సమయంలో సంతోషకరమైన అనుభూతిని పొందాలంటే, ఈ డీజిల్ ఇంజన్ ను తప్పక ఎంపిక చేసుకోవలసిన అవసరం ఉంది. ఈ ఇంజన్ తేలికైన శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 1498 సిసి స్థానభ్రంశ సామర్ధ్యాన్ని కలిగి ఎస్ ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా నాలుగు సిలండర్లను అలాగే ఎనిమిది వాల్వ్ లను కలిగి ఉంటుంది. ఈ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, అత్యధికంగా 3750 ఆర్ పి ఎం వద్ద 99 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 1750 నుండి 3000 ఆర్ పి ఎం మధ్యలో 215 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ కామన్ రైల్ ఇంధన సరఫరా వ్యవస్థ తో జత చేయబడి నగరాలలో, 22.4 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అదే విధంగా రహదారులలో, 25.83 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు ఈ ఇంజన్ యొక్క త్వరణం విషయానికి వస్తే, 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 11.6 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఇదే వాహనం, 170 కె ఎం పి హెచ్ గల అధిక వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
 

రైడ్ మరియు హ్యాండ్లింగ్


Image14
 
తయారీదారుడు ఈ వాహన సిరీస్ కు, వాహనం అన్ని వేళలా స్థిరంగా మరియు సమతుల్యంగా ఉండటానికి నమ్మకమైన బ్రేకింగ్ మెకానిజాన్ని అలాగే సమర్ధవంతమైన సస్పెన్షన్ మెకానిజాన్ని అందించాడు. ముందుగా సస్పెన్షన్ మెకానిజం విషయానికి వస్తే, ఈ వాహనానికి అందించిన సస్పెన్షన్ మెకానిజాన్ని గమనించినట్లైతే, స్విఫ్ట్ వాహనం లో అందించబడిన దాని కంటే మృదువుగా ఉంటుంది. గతుకుల రోడ్లపై అలాగే అసమాన రోడ్లపై సౌకర్యవంతమైన డ్రైవింగ్ ను అందించడానికి మంచి సస్పెన్షన్ ను అందించడం జరిగింది. ఈ వాహనం యొక్క ముందు ఆక్సిల్, మక్ఫెర్సొన్ స్ట్రట్ తో బిగించబడి ఉంటుంది. అంతేకాకుండా, ఇది నవీకరించబడిన కాయిల్ స్ప్రింగ్స్ మరియు యాంటీ రోల్ బాల్ తో లోడ్ చేయబడి ఉంటుంది. అదే వెనుక ఆక్సిల్ విషయానికి వస్తే, ఇండిపెండెంట్ ట్విస్ట్ బీం లతో విలీనం చేయబడి ఉంటుంది అలాగే ట్విన్ గ్యాస్ మరియు ఆయిల్ తో నిండి షాక్ అబ్జార్బర్స్ తో బిగించబడి ఉంటుంది. తయారీదారుడు, బారీ ట్రాఫిక్ సమయాలలో డ్రైవర్ యొక్క ఓత్తిడి ని తగ్గించడం కోసం తేలిక పాటి ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ వీల్ ను అందించడం జరిగింది. పాత ఫోర్డ్ వాహనం లో ఉండే హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ వీల్ తో పోలిస్తే, ఒక అనుభూతిని మరియు ఫీడ్బ్యాక్ పరంగా విఫలమైంది. ఇది, బంపర్ నుండి బంపర్ కు ట్రాఫిక్ లో ఒక సంపూర్ణ డ్రైవింగ్ ను కలిగి ఉంది. కానీ, రహదారుల పై మూడు అంకెల వేగాన్ని అందించడం లో కొద్ది సమయం పడుతుంది. ఈ వాహనం మూలలలో వెళుతున్నప్పుడు మాత్రం కలత లేదు. అయితే ఈ వాహనం కొరకు లావుగా ఉండే రబ్బర్ ను ఎంపిక చేసుకోవలసిన అవసరం ఉంది. అదే స్టాక్ టైర్ అయితే, రోడ్ల పై గట్టి పట్టును ఇవ్వడంలో విఫలమౌతుంది.
 
ఈ హాచ్బాక్ యొక్క బ్రేకింగ్ మెకానిజం విషయానికి వస్తే, ఈ వాహనం ముందు చక్రాలకు వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్లలను అందించడం జరిగింది అదే వెనుక వీల్స్ విషయానికి వస్తే, డ్రం బ్రేకులను అందించడం జరిగింది. ఈ రెండూ కలిసి అత్యంత సమర్ధవంతంగా మరియు వాతావరణ పరిస్థితి సరిగా లేని సమయంలో కూడా అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా ఈ బ్రేకింగ్ మెకానిజాన్ని మరింత మెరుగుపరచడానికి తయారీదారుడు ఈ వాహనానికి, యాంటి లాక్ బ్రేకింగ్ వ్యవస్థ ను మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి అంశాలను అందించాడు. వీటన్నింటితో పాటు ఈ వాహనానికి, హిల్ లాంచ్ అసిస్ట్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి అంశాలు కూడా అందించబడ్డాయి.
 

వేరియంట్లు


తయారీదారుడు ఈ ఫిగో వాహనాన్ని, ఐదు వేరియంట్ లలో అందించాడు. ముందుగా ఈ వాహన సిరీస్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్ విషయానికి వస్తే, నిత్యవసరాలకు ఉపయోగపడే ఎయిర్ కండీషనింగ్ యూనిట్ ను అందించడం జరిగింది. తదుపరి వేరియంట్ అయిన యాంబియంట్ వేరియంట్ విషయానికి వస్తే, డ్యూయల్ ఎయిర్ బాగ్ లను ప్రామాణికంగా అందించడం జరిగింది. అంతేకాకుండా ఈ వేరియంట్ లో, ప్రయాణికుడి వైపు వెలుపలి రేర్ వ్యూ మిర్రర్, ముందు పవర్ విండోలు మరియు సిల్వర్ పూత ను కలిగిన గ్రిల్ వంటి అంశాలను అందించడం జరిగింది. మీరు ఒక సంపూర్ణ బడ్జెట్ పై గనుక ఉంటే ఈ యాంబియంట్ వేరియంట్ ను ఎంపిక చేసుకోండి. ఎందుకంటే ఈ వాహనంలో, ప్రాదమిక భద్రతా అంశాలు అందించబడతాయి.
 
తదుపరి వేరియంట్ అయిన ట్రెండ్ వెర్షన్ విషయానికి వస్తే, రిమోట్ అన్ లాక్, నాలుగు స్పీకర్ లను కలిగిన ఆడియో వ్యవస్థ మరియు స్టీరింగ్ వీల్ పై ఆడియో నియంత్రణలు వంటి కొన్ని సౌలభ్య లక్షణాలను అందించడం జరిగింది. అంతేకాకుండా, ఈ వాహనం యొక్క వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ ల పై టర్న్ సూచికలు అలాగే నాలుగు పవర్ విండోలను అందించడం జరిగింది. అదే అగ్ర శ్రేణి వేరియంట్ అయిన టైటానియం వెర్షన్ విషయానికి వస్తే, ముందు ఫాగ్ ల్యాంప్లు, వెనుక డిఫోగ్గర్ మరియు క్లైమేట్ కంట్రోల్ వంటి అంశాలను అందించడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పలంటే ఏబిఎస్ మరియు ఈ బి డి వంటి కీలకమైన అంశాలు కూడా ఈ వేరియంట్ కు అందించబడ్డాయి. మరో అగ్ర శ్రేణి వేరియంట్ అయిన టైటానియం ప్లస్ వేరియంట్ విషయానికి వస్తే, సైడ్ మరియు కర్టైన్ ఎయిర్బాగ్లు, వినోద వ్యవస్థ మరియు వాయిస్ కమాండ్ కోసం 4.2 అంగుళాల స్క్రీన్ వంటి అంశాలను అందించడం జరిగింది. ఇది పూర్తి అంశాలతో లోడ్ చేయబడి ఉంటుంది.
 
Table5
 

భద్రత


Image15
 
ఫోర్డ్ సంస్థ గరిష్ట స్థాయిలో భద్రతను అందించడం లో ఎన్నడూ రాజీ పడలేదు. ఈ హ్యాచ్బ్యాక్, ప్రయాణికులకు రక్షణ కల్పించేందుకు ఇంపాక్ట్ ప్రొటెక్షన్ బీంస్ మరియు క్రంపుల్ జోన్స్ తో కూడిన అధిక బలం స్టీల్ బాడీ కేజ్ తో రూపొందించబడింది. ఈ వాహనంలో డ్రైవర్ ఎయిర్బ్యాగ్స్ రక్షణ స్థాయి మెరుగుపరుస్తూ, ప్రామాణికంగా అన్ని వేరియంట్లకు అందించబడుతున్నాయి. దీనితోపాటు, 3-పాయింట్ సీట్ బెల్ట్స్ కూడా అందరి ప్రయాణికులకు ప్రామాణికంగా అందించబడుతున్నాయి. అంతేకాకుండా ఈ మోడల్ సిరీస్ యొక్క యాంబియంట్ వేరియంట్ ఇమ్మొబలైజర్ తో పాటు ప్రయాణీకుల ఎయిర్బ్యాగ్ ని కలిగి ఉంటుంది. తదుపరి వేరియంట్, అదనంగా కీలెస్ ఎంట్రీ ని కలిగి ఉంది. అయితే అగ్ర మరియు టైటానియం వెర్షన్లు ఈబిడి తో ఏబిఎస్, ఎలక్ట్రానిక్ స్థిరత్వ నియంత్రణ, హిల్ లాంచ్ అసిస్ట్, పెరీమీటర్ అలారం, ఎత్తు సర్దుబాటు ముందరి సీట్‌బెల్ట్స్, మరియు డ్రైవర్ యొక్క సీటుబెల్ట్ రిమైండర్ వంటి అంశాలను కలిగి ఉంటాయి. ఎమర్జెన్సీ అసిస్టెన్స్ తో పాటూ సైడ్ మరియు కర్టెయిన్ ఎయిర్బ్యాగ్స్ అలాగే మై ఫోర్డ్ కీ వంటి భద్రతా లక్షణాలు అగ్ర శ్రేణి వేరియంట్ అయిన టైటానియం ప్లస్ వేరియంట్ కి అందించబడ్డాయి.
 
Table6
 

తుది విశ్లేషణ


ఫోర్డ్ ఫిగో వాహనం అనేది, నగర ప్రయాణికుల కోసం అందించబడినది. అంతేకాకుండా, ఇది సౌలభ్యం, మితవ్యయం మరియు సరదా డ్రైవ్ ను అందించడం లో ఒక ప్రత్యేక స్థానం లో ఉంటుంది. నాణ్యత లో కొన్ని అసమానతలు ఈ వాహనం యొక్క లోపలా మరియు వెలుపల ఉన్నాయి. ఇది నగర ప్రయాణికులకు ఒక మంచి వాహనంగా ఉంది. ఈ వాహన సిరీస్ యొక్క పెట్రోల్ ఇంజన్లు, మరింత శుద్ది చేయబడినవి మరియు నగర ప్రయాణంలో సులభ డ్రైవ్ ను అందిస్తాయి. తదుపరి తరం కారు కోసం ఎదురు చూస్తున్నట్లైతే, ఈ వాహనానికి మరొక డీజిల్ ఇంజన్ ను అందించడం కూడా జరిగింది. మొత్తం మీద, ఈ ఫోర్డ్ ఫిగో హాచ్బాక్ వాహనం, ఇదే విభాగంలో ఉండే గ్రాండ్ ఐ 10, బోల్ట్ మరియు స్విఫ్ట్ వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది.