• English
  • Login / Register

డిల్లీలో డీజిల్ బాన్ ద్వారా పేరుకున్న 1,000 ఖరీదు కార్లు ఇంకా మహింద్రా ఎదుర్కొంటున్న అడ్డంకులు

డిసెంబర్ 16, 2015 03:58 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 24 Views
  • 1 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Delhi Pollution

జైపూర్: ఇటీవల డిల్లీ ప్రభుత్వ సంస్థల వారి నిర్ణయం ప్రకారం అధిక కాలుష్యం వెలువరించే కార్ల యొక్క బాన్ దేశీయ ఆటోమోటివ్ రంగంలో సమస్యలను తెచ్చి పెడుతుంది. మొత్తంగా ఎన్నో ఆటో తయారీసంస్థలు ఇబ్బంది పడుతున్నప్పట్టికీ, మహీంద్రా వారు ఎక్కువ నష్టాలను చవి చూస్తున్నారు. ఎందుకంటే, చాలా వరకూ మాహీంద్రా వారి ఉత్పత్తులు డీజిల్ వేరియంట్లలో మాత్రమే ఉండడం దీనికి ఒక కారణం. అనేక నివేధికల ప్రకారం, ఈ ప్రభుత్వ చర్యల వల్ల దాదాపుగా 1000 కోట్ల ఖరీదు గల కారు ఉత్పత్తులు డీలర్ల వద్ద నిర్భంధాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు డీజిల్ కార్ల పైన ప్రత్యేకమైన బాన్ ను విధించడం జరిగింది కాబట్టి. అంతేకాకుండా, ఎన్నో ఇతర పెద్ద బ్రాండ్ లు అయిన టాటా మోటార్స్, టయోటా, ఫోర్డ్, నిస్సాన్ మరియు ప్రపంచీయ బ్రాండ్‌లు అయిన ఆడీ, బిఎండబ్లు మరియు మెర్సెడీస్ బెంజ్ వంటి వంటి ఎందరో తయారీదారులు కష్ట కాలాన్ని ఎదుర్కొంటున్నారు. దీనివలన జాతీయ సగటు వాహన అమ్మకాలలో 7% నిఖర అమ్మకపు భాగాన్ని వారు కోల్పోతున్నారు.

ప్రస్తుత డిల్లీ నగరంలో పర్యావరణ కట్టుబాటు ప్రకారం అది BS4 ఉధ్గారక ప్రమాణాలకు కట్టుబడి ఉండగా దీని ఆచరణ తేదీలను ఇటీవలి ఆటో ఫ్యుయల్ పాలసీ వలన మరింత దగ్గరగా జరపడం జరిగింది. ఇప్పటికే అడ్వాన్స్ ద్వారా డీజిల్ కార్లను బుక్ చేసుకున్న వినియోగదారులు ఇప్పుడు దిక్కు తోచని పరిస్థితులలో పడ్డారు. అడ్వాన్స్ ఇవ్వని ఈ డీజిల్ కార్లను తీసుకోవాలనుకొనే వినియోగదారులు మాత్రం ఇంకా అవకాశం ఉండడం వలన ఇకమీదట పెట్రోల్ వేరియంట్ కార్లకు మారుతున్నారు. ఇంకా,వినియోగదారులు వారి కారు రిజిస్ట్రేషన్ ను N.C.R ప్రదేశం నుండి చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఇంకా ఈ ప్రమాణాలు ఆచరణలో లేవు గనుక. భారతదేశంలోని మహీంద్రా వారి శ్రేణి ని చూసినట్లయితే, బొలేరో, క్వాంటో, థార్, TUV300, స్కార్పియో, వెరిటో, వెరిటో వైబ్, XUV500, జైలో మరియు ఇ20 వీటిలో కేవలం ఐ20 మాత్రమే డీజిల్ ఏతర ఇంధన సామర్ధ్యం కలిగిన వాహనం.

Delhi Traffic

దాదాపుగా డిల్లీలో 36% వాహనాలు డీజిల్ ఇంజిన్ తో నడపబడుతున్నాయి. అయితే 90% ఇవి SUV లు మరియు ఇతర డీజిల్ యుటిలిటీ వాహనాలు. ఇంకా ఈ కార్ బాన్ వెనుక వినియోగదారులు ఖరీదు ని బట్టి 2016లో కార్ల పట్ల ఆశక్తి చూపించడం ఒక ప్రత్యేకమైన కారణం. ఈ బాన్ కేవలం ఆటో తయారీదారులను మాత్రమే కాకుండా ఇదివరకే అడ్వాన్స్ ఇచ్చిన మరియు డెలివరీలు కొరకు ఎదురు చూస్తున్న వినియోగదారులను ఇబ్బంది పెడుతుంది. దీనికి అధనంగా ఇటీవల డిల్లీ ప్రభుత్వం ప్రతిపాదొంచిన ఆడ్-ఈవెన్ ఫార్ములా ద్వారా తెలియ వస్తున్న విషయం ఏమిటంటే ప్రభుత్వం ఎక్కువగా వాహన సంస్థలపై దృష్టి సారిస్తుంది.

పవన్ గొయెంకా, డైరెక్టర్ మహీంద్రా & మహీంద్రా ఈ విధంగా అన్నారు " కేవలం డీజిల్ వాహనాలను మాత్రమే ప్రభుత్వం ఎందుకు ఎత్తి చూపుతుందో అర్ధం కావడం లేదు. ప్రత్యేకంగా మేము ఈ ఉత్పత్తులలో అన్ని ప్రమాణాలలో ప్రభుత్వ నిర్దేశకాలకు అనుగుణంగా పాటిస్తున్నాము." అని తెలిపారు. మిస్టర్ గోయింకా ఇంకా ఈ విధంగా అన్నారు " ఒక వాహనం ఈ విధంగా అన్ని ప్రభుత్వ ప్రమాణాలను పాటిస్తున్నప్పుడు ఎందుకు బాన్ విధించాలి? అంతేకాకుండా ఈ బాన్ కి ముందు సంబంధిత ఆటో ఇండస్ట్రీ పెద్దలను ఏ విధంగాను సంప్రదించడం జరగలేదు. ఇంకా డీలర్ల వద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్ల పరిస్థితి అస్సలు తెలియడం లేదు. బహుశా, ప్రభుత్వం వారి దగ్గర నుంచి దీని గురించి వివరాలు త్వరలో తెలుస్తాయని భావిస్తున్నాము."

అదనంగా విష్ణు మాథుర్, డిరెక్టర్ జనరల్ ఆఫ్ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ మానుఫ్యాక్చర్స్(సీం) ఇలా అన్నారు " ఆటో వ్యవస్థ ఒక సున్నిత టార్గెట్ గా ఈ మధ్య కాలంలో మారింది. గత కాలంలో ప్రభుత్వం మరియు న్యాయస్థానాలు ఏ నిర్దేశకాలు చేసిన మేము సూటిగా పాటించడం జరిగింది. అయితే ఒక పరిపూర్ణ అధ్యయనం లేకుండా ప్రతిపాదించే ఇటువంటి నిర్దేశకాలు ఎటువంటి మంచి పరిష్కారాలను ఇవ్వలేకపోవచ్చు. "

ఇంకా చదవండి

ఆనంద్ మహీంద్రా ఇపుడు ఫార్ములా-E జీవనాధార కమిటీలో సభ్యత్వాన్ని పొందింది

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience