Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

లియోనెల్ మెస్సీ మరియు టాటా బ్యాడ్జ్- ఇతని రాకతో టాటా సంస్థ అదృష్టం మారబోతోందా?

జనవరి 12, 2016 01:42 pm konark ద్వారా ప్రచురించబడింది

నవంబర్ 2015 లో, భారతీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అంతర్జాతీయ ఫుట్బాల్ సంచలనం లియోనెల్ మెస్సీ ని టాటా ప్యాసింజర్ వాహనాలు పోర్ట్ఫోలియో కోసం వారి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది.

టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన యూనిట్ అద్యక్ష్యుడు మయాంక్ పరీక్ ప్రకారం బోర్డు మెస్సీ ని నియమించడానికి వెనుక కారణం, "మా ఆలోచనలో యువతకి ఫుట్బాల్ తో మరియు మెస్సీ తో మంచి అనుభందం ఉంది అని తెలుసుకున్నాము అందువలన ఇలాంటి భిన్నమయిన నిర్ణయాన్ని తీసుకొని మెస్సీ ని నియమించము. ఫూట్బాల్ కి ఐకాన్ గా పరిగణించబడుతున్న ఇతడు అందరికీ స్పూర్తిదాయకుడు మరియు నమ్మదగిన వాడు. అంతేకాకుండా ఇతడు ఈ విజయం సాధించడానికి వెనుక సుదీర్ఘమయిన శ్రమ మరియు కఠినమైన అసమానత ని అధిగమించిన 17 సంవత్సరాల శ్రమ కారణం. అంతే కాకుండా మా సర్వ్ ప్రకారం ఈ సాకర్ కుడా కికెట్ లాగానే యువతని ఆకర్షించే ఒక దేశీయ క్రీడా అని తెలిసింది" అన్నారు.

టి వి వాణిజ్య మరియు హార్డింగ్ల ద్వారా TVC క్రింద పరిశీలిద్దాం రండి.

టాటా మోటార్స్ అంతర్జాతీయ బ్రాండ్ చేసే ఈ ఎత్తుగడ వెనుక ప్రధాన కారణం ఇది దాని యొక్క బ్రాండ్ ని గణనీయంగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది అని తెలుస్తుంది.మెస్సీ ఒక నీలం టాటా మోటార్స్ జెర్సీ వేసుకుని, అతని క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించడం అనే ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్ తెరలను మరియు సామాజిక మీడియా పై అనూహ్య విజయాన్ని సాధించి పెట్టనుంది.

మెస్సీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ టాటా మోటార్స్ సబ్సిడరీ అయినటువంటి రేంజ్ రోవర్, ని నడుపుతున్నాడు. మెస్సీ మరియు టాటా, మధ్య 2 సంవత్సరాల కాంట్రాక్ట్ ఒప్పందం కుదిరింది.

విడుదలయిన టీజర్ వీడియో ప్రకారం టాటా జైకా ఫిబ్రవరి మద్య కాలంలో ప్రారంభం కాబోతుంది. జైకా తో పాటూ టాటా కొత్త లైన్ ఉత్పత్తులు కూడా టాటా నేక్సాన్ (కాంపాక్ట్ SUV), టాటా హేగ్జా కూడా భారతీయ మార్కెట్ లోకి రాబోతున్నాయి. మార్కెట్ లో కాంపాక్ట్ SUV లకు డిమాండ్ అకస్మాత్తుగా పెరుగుదల కనిపించింది, నేక్సా ని ప్రారంభించడం భారత మార్కెట్ లో తయారీదారుడి ఒక కొత్త ఎత్తుగడ అవుతుంది.

ఇటీవల గోవాలో జైకా యొక్క దరివే నిర్వహించబడింది. ఒకసారి వీక్షించండి.

టాటా రాబోతున్న జైకా తో ఖచ్చితంగా ఒక కొత్త మార్పుని తీసుకురాబోతోంది. దీని స్టైలింగ్, ఇంటీరియర్స్, పనితీరు నుండి ప్రతిదీ విశ్వసనీయంగా ఉండబోతోంది. ఇది వారికీ ఖచ్చితంగా ఒక ముక్యమయిన ఉత్పత్తి. మెస్సీ రాకతో దీనికి ఒక బంగారు భవిష్యత్తు రాబోతోంది అని చెపవచ్చు.

ఇది కుడా చదవండి ;
టాటా జైకా వాహనం యొక్క ప్రారంభ నవీకరణ ; బహుశా ఫిబ్రవరి నెల మద్యలో ప్రారంభం కావొచ్చు.

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
Rs.8.95 - 10.52 సి ఆర్*
కొత్త వేరియంట్
Rs.18.90 - 26.90 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.21.90 - 30.50 లక్షలు*
Rs.9 - 17.80 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.11.82 - 16.55 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర