వెల్లడి: అబార్త్ పుంటో యొక్క ఆగ్జలరేషన్ మరియూ మైలేజీ వివరాలు
సెప్టెంబర్ 30, 2015 11:43 am manish ద్వారా ప్రచురించబడింది
- 19 Views
- 1 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ఫియట్ వారు అబార్త్ బ్రాండ్ పేరిట హ్యాచ్ బ్యాక్ ని అందించి చాలా కాలం అయ్యింది. అబార్త్ 595 కాంపిటియోజోన్ ఎడిషన్ విడుదల తరువాత ఈ ఫియట్ పుంటో అబార్త్ మొదటగా బుద్ద్ అంతర్జాతీయ సర్క్యూట్ లో ఆగస్ట్ నెలలో ప్రదర్శింపబడింది.
ఒక నెల తరువాత, ఈ కారు వివరాలు ఆన్లైన్ లో వెల్లడి అయ్యాయి. కారు మూడు రంగులలో - నలుపు, తెలుపు మరియూ మ్యాట్ గ్రే లో లభిస్తుంది. కారుకి స్పోర్టీగా ఉండే హంగులు, విభిన్న డీకాల్స్ హుడ్ పై, రూఫ్ పై, టెయిల్-గేట్ పై మరియూ డోర్స్ పై ఉంటాయి. వారి అధికారిక వెబ్‌సైట్ లో కారుని రెడ్ మరియూ బ్లాక్ కలర్ స్కీములో పరీక్షించారు. అందులో గ్రిల్లు మరియూ ఫాగ్ ల్యాంప్స్ పై రెడ్ పూతలు కనపడ్డాయి. కారు కి 16-అంగుళాల స్కార్పియన్ స్టింగ్ అల్లోయ్ వీల్స్ తో, అబార్త్ ట్రేడ్‌మార్క్ స్కార్పియన్ బ్యాడ్జింగ్ ఫియట్ లోగో ని భర్తీ చేస్తుంది.
లోపల, ఆల్ బ్లాక్ స్కీం తో ఎరుపు మరియూ పసుపు కుట్టు కనిపిస్తుంది. కారుకి అలుమినియం పెడల్స్ ఉంటాయి కానీ పుంటో టాప్-ఎండ్ వేరియంట్స్ కంటే ఎక్కువగా ఎటువంటి మార్పులు కనపడవు.
కారుకి ఫియట్ లీనియా వారి 1.4-లీటర్ T-జెట్ టర్బో చార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిను కలిగి ఉంటుంది. ఇది 145bhp శక్తి ని మరియూ 212Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజినుకి 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ జత చేయబడుతుంది. ఈ కారు 0-100 Kmph ని కేవలం 8.8 సెకనుల్లో చేరుకుంటుంది. ఆన్లైన్ లో దీని మైలేజీ 16.3Kmpl గా ఉంటుంది అని అంటున్నారు. సామర్ధ్యం పెంచేందుకై, కారు ఎత్తు 20mm తగ్గించారు మరియూ సస్పెన్షన్ బిగుతు చేశారు. అబార్త్ పుంటో కి డిస్క్ బ్రేకులు నాలుగు మూలల్లో ఉంటాయి.
కారు యొక్క బుకింగ్స్ రూ. 50,000 వద్ద మొదలయ్యాయి. వచ్చే నెలల్లో దీని విడుదల ఉంటుంది మరియూ రూ. 10 లక్షల వరకు ఉండవచ్చు.