• English
  • Login / Register

రేపే విడుదల కాబోతున్నవోల్వో వి40 నుండి ఆశించే అంశాలేంటో చూద్దాం

జూన్ 16, 2015 06:13 pm sourabh ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: వోల్వో సంస్థ నుండి వి40 క్రాస్ కంట్రీ క్రాస్ఓవర్ పరిచయం తర్వాత, వోల్వో, భారతదేశంలో నవీకరించబడిన వి40 హాచ్బాక్ ను రేపే ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫేస్లిఫ్ట్ వెర్షన్ అయిన వి40, వి40 క్రాస్ కంట్రీ క్రాస్ఓవర్ ఆధారంగా అనేక స్టైలింగ్ అంశాలతో రాబోతుంది. కానీ, ఇది హాచ్బాక్ కావడం వలన కఠినమైన లక్షణాలు మరియు బాడీ ప్లాస్టిక్ క్లాడింగ్ ను కోల్పోయి రాబోతుంది. వి40 పరిచయం తరువాత, ప్రీమియం హాచ్బాక్లు అయిన మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్, బిఎండబ్ల్యూ 1 సిరీస్, మరియు ఆడి నుండి కాంపాక్ట్ సెడాన్ అయిన ఏ3 వంటి హాచ్బాక్ లకు గట్టి పోటీ ను ఇవ్వడానికి రేపే రాబోతుంది. వోల్వో వి40 హాచ్బాక్ నుండి ఆశించేవి ఏమేమిటో స్పష్టంగా చూద్దాం రండి.

బాహ్యభాగాలు

  • ఇది హాచ్బాక్ కావటం వలన, తక్కువ కఠినమైన బాహ్యలక్షణాలతో రాబోతుంది.
  • వ్40 క్రాస్ఓవర్ లో నల్లని ప్లాస్టిక్ క్లాడింగ్ ఉంటుంది. కానీ, ఈ వి40 హాచ్బాక్ లో ముందు ప్రొఫైల్ క్లీన్ గా ఉంటుంది.
  • వోల్వో వి40 క్రాస్ ఓవర్ లో ఉండే ముందు మరియు వెనుక స్కిడ్ ప్లేట్లు, సైడ్ బాడేఅ క్లాడింగ్ మరియు రూఫ్ రైల్స్ వంటివి ఇప్పుడు వి40 లో రావటం లేదు.    
  • ఇప్పుడు ఈ హాచ్బాక్ లో, వి40క్రాస్ఓవర్ తో పోలిస్తే తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ తో రాబోతుంది.
  • దీని ముందు ప్రొఫైల్ విషయానికి వస్తే, ఆటో బెండింగ్ హెడ్ ల్యాంప్స్ తో పాటు ఎల్ ఈ డి డే టైం రన్నింగ్ లైట్స్ తో రాబోతుంది. రైడింగ్ విషయానికి వస్తే, 16 లేదా 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ తో రాబోతుంది.  

అంతర్గతభాగాలు మరియు సౌకర్య లక్షణాలు

  • వి40 యొక్క అంతర్గతభాగాలు క్రాస్ కంట్రీ ను పోలి రాబోతుందని భావిస్తున్నారు
  • ఈ హాచ్బాక్ లో లెథర్ అపోలిస్ట్రీ, అడాప్టివ్ డిజిటల్ డిస్ప్లే కన్సోల్, క్లైమేట్ కంట్రోల్ వ్యవస్థ, పనోరమిక్ రూఫ్ మరియు పవర్డ్ ఫ్రెంట్ సీట్స్ తో పాటు మెమొరీ సెట్టింగ్స్ వంటి లక్షణాలతో రాబోతుంది
  • సౌకర్య లక్షణాల పరంగా చెప్పాలంటే, లేజర్ అసిస్టెడ్ ఆటోమేటిక్ బ్రేకింగ్, డైనమిక్ స్టెబిలిటీ & ట్రాక్షన్ కంట్రోల్ (డిఎస్ టిసి), టర్న్ విత్ స్టీరింగ్ లైట్స్(ఏబిఎల్- అడాప్టివ్ బెండింగ్ లైట్స్) మరియు ఇంటెలిజెంట్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఐడి ఐఎస్) తో పాటు మల్టిపుల్ ఎయిర్బాగ్స్ ఏబిఎస్ మరియు ఇతరాత్రా వంటి లక్షణాలతో రాబోతుంది.

హుడ్ క్రింది భాగానికి వస్తే,

వి40 యొక్క ఇంజన్, క్రాస్ ఓవర్ లో ఉండే ఇంజన్ తో రాబోతుంది

  • ఈ హాచ్బాక్ లో రాబోయే ఇంజెన్ లు, క్రాస్ ఓవర్ మాదిరిగా అదే డి3 డీజిల్ ఇంజెన్ మరియు టి4 ఫెట్రోల్ ఇంజెన్ లతో రాబోతుంది. 
  • దీని యొక్క గాసోలైన్ టి4 ఇంజన్ 1.6 లీటర్ జిటిడి ఐ (గాసోలిన్ టర్బోచార్జెడ్ డైరెక్ట్ ఇంజెక్షన్) ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ అత్యధికంగా 180bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది అదే విధంగా 240Nm గల అత్యధిక టార్క్ ను విడుదల చేస్తుంది
  • ఈ ఇంజన్  6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా, ఈ హాచ్బాక్ 0 నుండి 100 kmph వేగాన్ని చేరడానికి 8.5 సెకన్ల సమయం పడుతుంది.
  • దీని యొక్క డీజిల్ ఇంజన్ 5-సిలిండర్ టర్బోడీజిల్ ఇంజెన్ తో బిగించబడి ఉంటుంది. మరియు ఇది స్టార్ట్ / స్టాప్ టెక్నాలజీతో రాబోతుంది. ఈ ఇంజన్ అత్యధికంగా 150bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు 350Nm గల అత్యధిక టార్క్ విడుదల అవుతుంది.    

ధర పరిధి

క్రాస్ఓవర్ రూ .27 లక్షల (ఎక్స్-షోరూమ్, ముంబై) వద్ద ప్రారంభించబడింది. ఇప్పుడు రాబోయే హాచ్బాక్ యొక్క ధర పరిధి రూ.26 నుండి 28 లక్షల మద్యలో ఉండే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience