• English
  • Login / Register

మహీంద్రా స్కార్పియో వర్సెస్ మహీంద్రా ఎక్స్ యు వి500 వర్సెస్ డస్టర్ ఏడబ్ల్యూడి వర్సెస్ టాటా సఫారి స్టోర్మ్: మధ్య పోలిక

టాటా సఫారి స్టార్మ్ కోసం sourabh ద్వారా జూన్ 03, 2015 03:28 pm సవరించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

టాటా మోటార్స్ ఇప్పుడు సఫారీ స్టోర్మ్ ఎస్యువి యొక్క ఫేస్లిఫ్ట్ వెర్షన్ ప్రారంభించింది. దాని యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ల్యాండ్ రోవర్ స్ఫూర్తితో కొత్త ఫ్రంట్ గ్రిల్, దాని పాత మోడల్ కంటే అత్యధిక పవర్ ను అందిస్తుంది. అంతే పాత దాని కంటే 10PS పవర్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. అంటే, 150PS (148bhp). ఈ ఎస్యువి కు స్వదేశ తయారీదారు నుండి కొత్త ప్రీమియం 6 స్పీకర్ హర్మాన్ ఆడియో సిస్టమ్ ను మరియు టాటా జెస్ట్ నుండి త్రీ స్పోక్ బహుళ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ మరియు క్యాబిన్ లోపలి బాగం అంతా  కొన్ని కాస్మెటిక్స్ నవీకరణలతో వచ్చాయి. ఈ టాటా మోటార్స్ నుండి ప్రవేశపెట్టబడిన ఈ సఫారీ స్టోర్మ్ మహీంద్రా మరియు రెనాల్ట్ లతో పోటీ పడుతున్నాయి.

ఇంజిన్

టాటా సఫారీ స్టోర్మ్ చాలా చాలా శక్తివంతమైనది. మరియు ఈ వాహనాలలో శక్తివంతమైన 2.2 లీటర్ వెరికార్ ఇంజెన్ ను అమరుస్తారు, ఈ ఇంజెన్ అత్యధికంగా 148bhp (150PS) పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా టార్క్ విషయానికి వస్తే, గరిష్ట్టంగా 320Nm టార్క్ ను విడుదల చేస్తుంది. అయితే, మహింద్రా మోడల్స్ విషయానికి వస్తే, మహింద్రా వాహనాలు 2.2-లీటరు ఎమ్హవాక్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. మహింద్రా ఎక్స్యువి500 వాహనం అత్యధికంగా 140bhp పవర్ ను ఉత్పత్తి చేస్తాయి, అదే స్కార్పియో విషయానికి వస్తే అత్యధికంగా 120bhp పవర్ ను విడుదల చేస్తుంది. వీటన్నింటితో పోలిస్తే, డస్టర్ ఏడబ్ల్యూడి తక్కువ శక్తివంతమైనది అని చెప్పవచ్చు. డస్టర్ ఇంజెన్ల విషయానికి వస్తే, 108bhp పవర్ ను ఉత్పత్తి చేయగా అత్యధికంగా 245Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి. డస్టర్ వీటన్నింటి తో పోలిస్తే, అతి తక్కువ బరువు కలది. దీని యొక్క స్థూల బరువు 1800 కిలోలు దీనితో పోలిస్తే సఫారీ లేదా ఎక్స్యువి 2500కంటే ఎక్కువ బరువు. నిజానికి డస్టర్ తక్కువ బరువు అయినప్పటికి వాహనం అధిక పనితీరును ఇస్తుంది. డస్టర్ కూడా అధిక ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. దీని యొక్క ఇంధన సామర్ధ్యం 19 kmpl కంటే ఎక్కువ, అదే సఫారీ విషయానికి వస్తే, 14.1 kmpl ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఎక్స్యువి500 అయితే, 16 kmpl ఇంధన సామర్ధ్యాన్ని మరియు స్కార్పియో అయితే, 15.37 kmpl ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.  

అంతేకాక, డస్టర్ మరియు ఎక్స్యువి5ఓఓ వాహనాలు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటాయి. అయితే, సఫారీ మరియు స్కార్పియో వాహనాల విషయానికి వస్తే, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటాయి. ఒక విషయం గమనించాలి. సఫారి స్టోర్మ్ మరియు స్కార్పియో లు శరీర డిజైన్ ని బట్టి, ఈ రెండు వాహనాలు ఎస్యువి లు. అయితే, మిగిలిన రెండు వాహనాలు మోనోకోక్  

సౌకర్యవంతమైన లక్షణాలు మరియు సౌలభ్యం

టాటా జెస్ట్ లో ఉండే స్పోర్టి మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్ ను మరియు 6 స్పీకర్ హర్మాన్ ఆడియో సిస్టమ్ ను స్టోర్మ్ కు అందించబడింది. ఎస్యువి అంతర్భాగాలలో మరింత అందంగా మరియు అనేక వెండి చేరికలతో, లోఅపలి బాగం  నలుపు రంగు తో ఆకర్షణీయంగా ఉంటుంది. కాని ఇప్పుడు ఎక్స్యువి500 ఆధిక్యం తో ఉంది. కానీ అదే సమయంలో, ఇక్కడ ఎక్స్యువి అత్యంత విలువైనది. వీటి అగ్ర శ్రేణి వేరియంట్లలో అనేక లక్షణాలను అందిస్తుంది. అంతేకాక, ఇక్కడ డస్టర్ ఒక్కటే ఎస్యువి. కాని దీనిలో మూడవ వరుస సీటింగ్ ఉండదు.     

సమాచార వ్యవస్థ విషయానికి వస్తే, ఎక్స్యువి500, స్కార్పియో, డస్టర్ లలో టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థ అందించబడుతుంది. సఫారీ లో టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థ ఉండదు. డస్టర్ ఏడబ్ల్యూడి మరియు ఎక్స్యువి500 రెండూ కూడా  7 అంగుళాల టచ్స్క్రీన్ ఉంటుంది. అయితే స్కార్పియో విషయానికి వస్తే, 6 అంగుళాల టచ్ యూనిట్ మరియు జిపిఎస్ నావిగేషన్, బ్లూటూత్, డివిడి, యుఎస్బి, ఆక్సీలరీ కనెక్టివిటీ తో పాటు పూర్తి ఆటోమేటిక్ ఉష్ణోగ్రత కంట్రోల్ (ఎఫ్ ఏటిసి). అయితే, పైన పేర్కొన్న విధంగా, ఎక్స్యువి500  వంటి సాధారణ లక్షణాలను ఉంచుతుంది. వీటితో పాటు నావిగేషన్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ, హీటర్, ఏయిర్ కండీష్నర్ నియంత్రణలు సమాచార వ్యవస్థలో, మరియు స్మార్ట్ఫోన్ ఆప్ ఇంటిగ్రేషన్ మరియు మహీంద్రా బ్లూ సెన్స్ తో పాటు రివర్స్ కెమెరా ను కలిగి ఉంటుంది.    

2015 సఫారి గురించి మాట్లాడటానికి వస్తే, దీనిలో ఒక డిస్ప్లే స్క్రీన్ తో సింగిల్ దిన్ హర్మాన్ ఆడియో సిస్టమ్ అందించబడుతుంది. దీనితో పాటు ఆరు స్పీకర్లు అందించబడతాయి. మరియు బ్లూ టూత్ కనెక్టివిటీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్ కానీ అది మిగిలిన మూడు పోలిస్తే కొత్తగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఎక్స్యువి500 వాహనం మాత్రమే లెదర్ సీటు అపోలిస్ట్రీ ను కలిగి ఉంటుంది. మిగిలిన మూడూ అనగా సఫారి ఫేస్లిఫ్ట్, స్కార్పియో, డస్టర్ ఏడబ్ల్యూడి లలో ప్రీమియం ఫాబ్రిక్ అపోలిస్ట్రీ అందించబడుతుంది.

భద్రతా లక్షణాలు

భద్రతా లక్షణాలు విషయంలో మహింద్రా ఎక్స్యువి500 ఒక మోనోకోక్యూ ఎస్యువి. దీనిలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్, ఈబిడి, ఏబిఎస్, మరియు ఆల్రౌండ్ డిస్క్ బ్రేకింగ్ లను ప్రామాణిక అంశాలుగా వస్తున్నాయి. ఇంకా, దీని అగ్ర శ్రేణి వేరియంట్లలో  సైడ్ మరియు కర్టైన్ ఎయిర్బ్యాగ్స్ వస్తాయి.  దీనిలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ స్య్స్టం, హిల్ అసిస్ట్, డిసెంట్ మరియు ఆల్రౌండ్ డిస్క్ బ్రేకింగ్ తో వస్తున్నాయి. మరోవైపు, సఫారీ వాహనాలలో ప్రామాణికంగా ఏబిఎస్, ఈబిడి మరియు ఆల్రౌండ్ డిస్క్ బ్రేకింగ్ తో వస్థున్నాయి. కాని, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ ప్రామాణికంగా ఉండవు. అదే డస్టర్ ఏడబ్ల్యూడి విషయానికి వస్తే, సఫారీ లో కొన్ని లక్షణాలు అదే విధంగా వస్తాయి. దీనిలో  సఫారీ నుండి డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ మరియు బ్రేక్ అసిస్ట్, ఏబిఎస్, ఈబిడి. అంతేకాకుండా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏఎసార్ (యాంటీ స్లిప్ రెగ్యులేషన్) తో పాటు హిల్ అసెండ్ వంటి వాటిలో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇప్పుడు మహీంద్రా స్కార్పియో విషయానికి వస్తే, దీని దిగువ శ్రేణి వేరియంట్ అయిన ఎస్4 లో మాత్రం ఏబిఎస్ మరియు ద్వంద్వ ఎయిర్బ్యాగ్స్ అందించబడవు. కాని మిగిలిన అన్ని వేరియంట్లలో ఇవి అన్ని అందించబడతాయి. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Tata Safar i Storme

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience