లంబోర్ఘిని హొరెకెన్ LP580-2 RWD రూ. 2.99 కోట్లు ధరతో ప్రవేశపెట్టబడినది
లంబోర్ఘిని హురాకన్ కోసం manish ద్వారా నవంబర్ 20, 2015 07:24 pm ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
లంబోర్ఘిని 2015 అటో షో లాస్ ఏంజెల్స్ లో తమ RWD హోరాకెన్ LP580-2 ను ప్రదర్శించిన తరువాత భారతదేశంలో ఇప్పుడు ప్రవేశపెట్టబడింది. ఈ కారు రూ.2.99 కోట్ల ధర వద్ద(ఎక్స్-షో రూం డిల్లీ) అందించబడుతుంది. ప్రామాణికమైన AWD వ్యవస్థ పై వచ్చిన డ్రైవింగ్ ఏక్సలరేషన్ లోటు పాటులను సరి చేసుకుంటూ ఈ ఇటాలియన్ కారు తయారీదారులు గత రెండు రోజుల క్రితం ఈ కారుని భారతదేశంలో ప్రవేశపెట్టారు.
"తీక్షణమైన మరియు ఆహ్లాదకరమైన డ్రైవింగ్ అనుభవం అందించగలిగే ఈ కారు ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమయిన మూడు రోజులకే భారతదేశంలో ప్రారంభించబడడం ఆనందించాల్సిన విషయం. ఇంకా ఉన్నతమైన అగ్ర శ్రేణి టెక్నాలజీ మరియు డిజైన్లను ఈ కారు అందించగలుగుతుంది మరియు ఒక ప్రత్యేకమైన పనితనాన్ని కలిగియున్న వాహనంగా ఇది ఉండబోతుంది." అని లాంబోర్ఘిని భారతీయ అధికారి పవన్ శెట్టి వివరించారు.
ఈ LP580-2 వాహనం ప్రత్యేకతలకు వస్తే ఒక కళాత్మక నవీకరణలతో ముందు భాగం మరియు వెనుక భాగం సంస్థ యొక్క ఏరోనాటిక్ స్టయిల్ ని చూపుతూ అందంగా కనిపిస్తుంది. ఈ కారు ముందు భాగం ఒక కొత్త ఎయిర్ఇంటేక్ మరియు ప్రయాణించేటప్పుడు ఎదురు గాలి పీడనం నుంచి తప్పిస్తూ ముందరి ఆక్సిల్ పైన తక్కువ భారాన్ని ఉంచే విధంగా డిజైన్ చేయబడింది. ఈ హోరాకెన్ కారు ఒక మూవబుల్ వెనుక స్పాయిలర్ ని కలిగి ఉండదు. కారు క్రింద భాగానికి గాలిని సౌకర్యవంతంగా తీసుకువెళ్ళడం కొరకు కదలికలు లేని ఒక రేర్ స్పాయిలర్ ని కారు వెనుక భాగం కలిగి ఉంటుంది. ఇక అంతర్భాగానికి వస్తే, ఒక నవీకరించబడిన బెల్స్ మరియు విజిల్స్ శబ్ధాలతో కూడిన సమాచార వినోద వ్యవస్థ(ఇంఫోటైన్మెంట్ సిస్టం-ఈ) తో LP580-2 ఒక 12.3 అంగుళాల రీజల్యూషన్ గల TFT డిస్ప్లే ప్యానెల్ ని కలిగి ఉంటుంది.
ఇంజిన్ విషయానికి వస్తే, కారు 5.2 లీటర్ సహజసిద్ధమైన వ్10 పెట్రోల్ ఇంజన్ తో అమర్చబడి 580ps శక్తిని మరియు 540Nm టార్క్ ని అందిస్తుంది. ఇది హొరాకెన్ LP 610-4 అందించే శక్తి కంటే 30ps తక్కువ. ఈ LP 610-4 610PS శక్తిని మరియు 560Nm టార్క్ ని అందిస్తుంది. ఈ తగ్గిన శక్తి కారు యొక్క ఏక్సిలరేషన్ పైన ప్రభావం చూపిస్తుంది. ఇది LP 610-4 కంటే 0.2 సెకన్లు తక్కువగా ఉంటుంది మరియు 0 నుండి 100 కిలోమీటర్లు 3.2 సెకన్ల వద్ద నిలుస్తుంది. ఋవ్డ్ హ్యురాకెన్ 320 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందిస్తుంది. అయితే ఈ శ్రేణి లోని ఇతర మోడల్స్ కన్నా ఈ కారు పర్యావరణానికి అనుగుణంగా ఉండే విధంగా తయారుచేయబడింది. ఇది సమర్ధవంతంగా 5 సిలెండర్లను నియంత్రిస్తూ తద్వారా ఇంధన సామర్ధ్యాన్ని పెంచగలిగి లీటర్ కి 8.4 మైలేజ్ ని ఇవ్వగలుగుతుంది.
ఇంకా చదవండి :
0 out of 0 found this helpful