హ్యుందాయ్ లగ్జరీ జెనెసిస్ బ్రాండ్ యొక్క భాద్యతలు స్వీకరించనున్న ల్యాంబోర్ఘిని యొక్క మాజీ ఉద్యోగి మన్ఫ్రేడ్ ఫిట్జ్గెరాల్డ్

డిసెంబర్ 30, 2015 03:33 pm akshit ద్వారా ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

డిల్లీ వార్తలు: హ్యుందాయ్ మోటార్ కంపెనీ జనవరి 2016 నుండి దాని లగ్జరీ బ్రాండ్ జెనెసిస్ ని లీడ్ చేసేందుకు మాజీ ల్యాంబోర్ఘిని ఎగ్జిక్యూటివ్ మన్ఫ్రేడ్ ఫిట్జ్గెరాల్డ్ ను నియమించింది.

ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ల ఉత్పత్తి సంస్థ వద్ద బ్రాండ్ మరియు డిజైన్ కు మాజీ డైరెక్టర్ ఫిట్జ్గెరాల్డ్, దక్షిణ కొరియా కార్ల తయారీసంస్థ వద్ద సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకుంది మరియు విలాసవంతమైన కారు బ్రాండు జేనేసిస్ కొరకు బాధ్యత తీసుకుంది.

52 యేళ్ళు గడిచిన ఫిట్జ్గెరాల్డ్, ల్యాంబోర్ఘిని 2011 లో వదిలేశారు, 2013 లో బ్రాండ్ మరియు డిజైన్ కంపెనీ అనే బ్రాండ్ కన్సల్టెన్సీ సంస్థ ఏర్పాటు చేయక ముందు జర్మన్ TVమేకర్ లోవి లో చేరారు. అతనికి కారు బ్రాండ్ స్ట్రాటజీ మరియు మార్కెటింగ్ లో 20 సంవత్సరాల అనుభవం ఉంది.

" అతని 12 సంవత్సరాల కెరీర్ సమయంలో, ల్యాంబోర్ఘిని ని ఒక ప్రొటొటైప్ కారు కంపెనీ నుండి ఒక లగ్జరీ కారు సంస్థగా తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర పోషించారు మరియు ఒక బ్రాండ్ మరియు డిజైన్ కి డైరెక్టర్ గా దాని అమ్మకాలను 10 రెట్లు పెంచారు." అని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈయన ఈ సంస్థలో ఉన్నటువంటి అతి తక్కువ కొరియనేతర అధికారుల జాబితాలో చేరుతూ, చీఫ్ డిజైన్ ఆఫీసర్ అయిన పీటర్ శ్రేయర్, బెంట్లీ కి చెందిన లక్ డాంచర్వాల్కే మరియు BMW కి చెందిన ఆల్బర్ట్ బేర్మెన్ వంటి వారితో హ్యుందాయి ప్రధాన కార్యాలయం అయిన సియోల్ లో చేతులు కలపనున్నారు.

హ్యుందాయ్ మోటార్ కంపెని, కియా మోటర్స్ తో అనుసంధానించబడి ప్రపంచంలో ఐదవ అతి పెద్ద కార్ల ఉత్పత్తి సంస్థగా నిలిచింది. ఈ సంస్థ తగ్గిపోతున్న లాభాల కొరకు పోరాటం చేసి అధిక లాభాలు సృష్టించాలనే లక్ష్యంతో దాని యొక్క లగ్జరీ ఆర్మ్ జెనిసిస్ ని నవంబర్ లో ప్రారంభిస్తానని ప్రకటించింది.

ఇంకా చదవండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

కార్ వార్తలు

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience