హ్యురాకెన్ ఎల్ పి 580-2 ఆర్ డబ్ల్యూ డి వేరియంట్ ను విడుదల చేసిన లంబోర్ఘిని

లంబోర్ఘిని హురాకన్ కోసం manish ద్వారా నవంబర్ 19, 2015 11:13 am ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

లంబోర్ఘిని, ఆడి- ఉత్పన్న ఆల్ వీల్ డ్రైవ్ వ్యవస్థ పునరుత్థానము పొందిన కారణంగా ప్రపంచ విమర్శలకు లోబడి ఉంది. రేజింగ్ బుల్ బ్రాండ్ ఔత్సాహికుల కోసం ఈ సంస్థ ఒక శక్తివంతమైన వాహనాన్ని విడుదల చేసింది. అదనంగా, ఇటీవల విడుదల అయిన హ్యురాకెన్ వాహనం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది మరియు సంస్థ యొక్క సంప్రదాయం నుండి విచ్ఛిన్నం అయ్యి దాని డిజైన్ పరంగా అనేక సూక్ష్మ మార్పులను కలిగి ఉంది. ఇప్పుడు ఇటాలియన్ వాహన తయారీదారుడు యొక్క ప్రయత్నం వృధా కాకుండా లంబోర్ఘిని హ్యురాకెన్ ఎల్ పి 580-2 ఆర్ డబ్ల్యూ డి అను సూపర్ కారును పరిచయం చేశాడు. ఈ కారు, ఏ డబ్ల్యూడి ఆకృతీకరణ కు అనుకూలంగా ఆర్ డబ్ల్యూ డి సిస్టం తో వస్తోంది.

ఈ వాహనం ఊహించలేనటువంటి మార్పులను కలిగి ఉంది. అవి ఏమిటంటే, పునఃనిర్మాణం స్ప్రింగ్స్ సెటప్ మరియు వ్యతిరేక రోల్ బార్ లను కలిగిన ఒక సవరించిన సస్పెన్షన్ ను ఈ వాహనం, కలిగి ఉంది. ఈ కొత్త వాహనం, ఎల్ పి ఐ (లంబోర్ఘిని పియట్ఫోర్మా ఇనర్జిఏల్) తో వస్తోంది. అంతేకాకుండా ఇది, వాహనం యొక్క యా, పిచ్ మరియు రోల్ వంటి వాటిని ఇనర్షియల్ మెజర్మెంట్ యూనిట్ తో కొలుస్తుంది. ఈ వ్యవస్థ సమాచారాన్ని అంతటిని, ఆప్షనల్ మేగ్నిటో రియోలాజికల్ సస్పెన్షన్, స్టెబిలిటీ కంట్రోల్ మోడ్యూల్స్ మరియు సరైన సమయం లో స్టీరింగ్ సిస్టం లకు పంపిణీ చేస్తుంది.    

పవర్ ప్లాంట్ విషయానికి వస్తే, ఈ వాహనం 5.2 సహజసిద్ద వి10 పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది మరియు ఈ ఇంజన్, అత్యధికంగా 580 పి ఎస్ ను అదే విధంగా 540 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ వాహనం, హ్యురాకెన్ ఎల్ పి 610 4 వాహనం కంటే 30 పి ఎస్ తక్కువ పవర్ ను విడుదల చేస్తుంది. ఇంతకీ ఈ 610- 4 వాహనం, ఎంత పవర్ ను ఉత్పత్తి చేస్తుంది అనుకుంటున్నారా? ఈ వాహనం అత్యధికంగా 610 పి ఎస్ పవర్ ను అదే విధంగా 560 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. తగ్గిన పవర్ కారణంగా త్వరణం కూడా ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు విడుదల అయిన వాహనం, ఎల్ పి 610 -4 వాహనం కంటే 0.2 సెకన్ల సమయం నెమ్మదిగా వెళుతుంది. ఈ ఎల్ పి 610- 4 వాహనం 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 3.2 సెకన్ల సమయం పడుతుంది. ఈ ఆర్ డబ్ల్యూడి హ్యురాకెన్ వాహనం, అత్యధికంగా 320 కె ఎం పి హెచ్ గల వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే, ఈ కొత్త కారు, ప్రస్తుతం ఉన్న కారుతో సమంగా ఉంటుంది మరియు ఈ వాహనం ఐదు సిలండర్లను కలిగి ఉంటుంది. మరోవైపు ఈ వాహనం అత్యధికంగా, 8.4 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.  

ఈ హ్యురాకెన్ ఎల్ పి 580 -2 వాహనం యొక్క సౌందర్య నవీకరణల గురించి చెప్పాలంటే, ఈ వాహనం ఒక స్పాయిలర్ లిప్, పెరిల్లి పి జీరో టైర్లతో కప్పబడిన 19 అంగుళాల కరీ అల్లాయ్ వీల్స్ మరియు ముందు బారీ ఎయిర్ ఇంటేక్స్ వంటి అంశాలను కలిగి ఉంది. అంతేకాకుండా ఈ వాహనం, ఒక వెనుక కదిలే వింగ్ ను కలిగి లేదు మరియు లంబోర్ఘిని ఎల్ పి 580-2 హ్యురాకెన్ వాహనానికి ఈ లక్షణం అవసరం లేదు. ప్రస్తుతం ఈ హ్యురాకెన్ ఎల్ పి 580-2 వాహనం, యూరప్ అంతటా 150,000 యూరోస్ ధర ట్యాగ్ తో అందుబాటులో ఉంది. ఇది భారతీయ లెక్కల ప్రకారం సుమారు 1.05 కోట్లు (పన్నులు మినహాయించి).

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన లంబోర్ఘిని హురాకన్

Read Full News

కార్ వార్తలు

  • ట్రెండింగ్ వార్తలు
  • ఇటీవల వార్తలు

ట్రెండింగ్‌లో ఉందికూపే కార్స్

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience