త్వరలో భారతదేశంలో ప్రారంభం కానున్న లంబోర్ఘిని హ్యురాకెన్ కన్వర్టిబుల్ (అధికారిక చిత్రాలు బహిర్గతం)
డిసెంబర్ 04, 2015 11:59 am manish ద్వారా ప్రచురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
LP 580-2 RWD ఇటీవల విడుదల అనంతరం, ఇటాలియన్ స్పోర్ట్స్ కారు తయారీదారు భారత మార్కెట్లో లంబోర్ఘిని హ్యురాకెన్ కి స్పైడర్ వేరియంట్ ని అందించబోతున్నారు. ఈ కారు లంబోర్ఘిని హ్యురాకెన్ స్పైడర్ LP 610-4అనే ప్రశ్నార్ధకంలో ఉంది మరియు లంబోర్ఘిని ఢిల్లీ వారి అధికారిక ఫేస్‌బుక్ పేజీలో రాబోయే స్పోర్ట్స్ కారు టీజర్ చిత్రాలను విడుదల చేసింది. ఈ సూపర్‌కారు స్ట్రీమ్లైన్డ్ సూపర్‌కారు డిజైన్ ప్రవాహం కొనసాగించడానికి తేలికైన మెటీరియల్ తో తయారు చేయబడి ఒక సాఫ్ట్ టాప్ రూఫ్ తో వస్తుంది.
సాఫ్ట్ టాప్ 50 కిలోమీటర్ల దిగువ వేగంతో ప్రయాణించినపుడు 18 సెకెన్లలో పైకి లేవగలదు. ఇంజిన్ పరంగా, ఈ మిడ్ ఇంజిన్ సూపర్‌కార్లు మాత్రం మారలేదు మరియు హార్డ్ టాప్ వెర్షన్ 5.2-లీటర్ సహజ ఆస్పిరేటెడ్ V10 ఇంజిన్ తో కొనసాగుతుంది. ఈ ఇంజిన్ 610ps శక్తిని మరియు 560Nm టార్క్ ని అందిస్తుంది. ఈ ఇంజిన్ కారు యొక్క ఆల్-వీల్ డ్రైవ్ టైపు తో అమర్చబడియున్న 7-స్పీడ్ డ్యూయెల్-క్లచ్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది.
హ్యురాకెన్ స్పైడర్ 3.2 సెకన్ల లోపే 0 నుండి 100kmph చేరుకోగలదు. అదే విధంగా కారు గరిష్టంగా 324kmph వేగం చేరుకోగలదు మరియు 8.3kmpl మైలేజ్ సామర్ధ్యాన్ని అందిస్తుంది.
ఇంకా చదవండి