Sonet Facelift లో మళ్ళీ డీజిల్ మాన్యువల్ ఎంపికను అందించనున్న Kia
కియా సోనేట్ కోసం rohit ద్వారా డిసెంబర్ 08, 2023 12:15 pm ప్రచురించబడింది
- 149 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇందులో డీజిల్ మాన్యువల్ ఎంపికతో పాటు iMT (క్లచ్ పెడల్ లేని మాన్యువల్), AT ఎంపికలు కూడా ఉంటాయి.
-
కియా సోనెట్ డిసెంబర్ 14 న భారతదేశంలో విడుదల కానుంది.
-
వెల్లడైన సమాచారం ప్రకారం, సోనెట్ యొక్క డీజిల్ వేరియంట్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్ తో అందించబడుతుంది.
-
ఫేస్ లిఫ్టెడ్ సోనెట్ డీజిల్ ఇంజిన్ తో మునుపటి మాదిరిగానే 6-స్పీడ్ iMT ఎంపికను పొందుతుంది.
-
ఇది మునుపటి 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ మరియు 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్లలో లభిస్తుంది.
-
డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 360 డిగ్రీల కెమెరా, ADAS వంటి కొత్త ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.
-
ఇది 2024 ప్రారంభంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ .8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.
కియా సోనెట్ భారతదేశంలో విడుదల అయ్యి మూడు సంవత్సరాలకు పైగా అయింది, ఈ కారు త్వరలోనే దాని మొదటి ప్రధాన నవీకరణను పొందుతుంది. కంపెనీ ఫేస్ లిఫ్ట్ కియా సోనెట్ యొక్క అనేక టీజర్లను విడుదల చేసింది, ఈ టీజర్ల ద్వారా ఇందులో ఉన్న కొన్ని ఫీచర్లు వెళ్లడయ్యాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని నివేదికలు విడుదలయ్యాయి, 2024 సోనెట్లో, కంపెనీ మళ్లీ డీజిల్-మాన్యువల్ పవర్ట్రెయిన్ ఎంపికను అందించనుంది.
అధిక డిమాండ్‌తో మళ్లీ డీజిల్-మాన్యువల్ పవర్‌ట్రెయిన్
కియా మోటార్స్ 2023 ప్రారంభంలో సోనెట్ యొక్క డీజిల్-మాన్యువల్ వెర్షన్ను నిలిపివేసారు. దాని స్థానంలో iMT గేర్బాక్స్ ఎంపికను ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు iMT కి డిమాండ్ తక్కువగా ఉండటంతో మళ్లీ డీజిల్ మాన్యువల్ ఆప్షన్ ను చేర్చబోతున్నట్లు తెలుస్తోంది. దాని సెగ్మెంట్లో డీజిల్ ఇంజిన్ అందించే అతికొద్ది కార్లలో సోనెట్ ఒకటి. హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ మరియు మహీంద్రా XUV300 లలో కూడా ఈ పవర్ట్రెయిన్తో లభిస్తాయి.
తరువాత ఏమిటి?
కియా తన ఇతర మోడళ్లైన కియా సెల్టోస్ మరియు కియా కారెన్స్ లలో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ తో మాన్యువల్ గైరాక్స్ ను అందించడంలేదు. త్వరలో ఈ డీజిల్-మాన్యువల్ కలయికను ఈ కార్లలో కూడా ఇవ్వవచ్చని మేము భావిస్తున్నాము.
ఇది కూడా చదవండి: 2024 లో భారతదేశానికి రాబోయే కార్లు: వచ్చే సంవత్సరం మీరు రోడ్లపై చూడగలిగే కార్లు
ఇంజన్ స్పెసిఫికేషన్లు
కొత్త సోనెట్ ఎంపికలు మునుపటి మాదిరిగానే ఉంటాయి. వాటి పనితీరులో మార్పుకు అవకాశం లేదు. వాటి టెక్నికల్ వివరాల పై ఓ లుక్కేయండి.
స్పెసిఫికేషన్లు |
1.2-లీటర్ పెట్రోల్ |
1-లీటర్ టర్బో-పెట్రోల్ |
1.5-లీటర్ డీజిల్ |
పవర్ |
83 PS |
120 PS |
116 PS |
టార్క్ |
115 Nm |
172 Nm |
250 Nm |
ట్రాన్స్మిషన్ |
5-స్పీడ్ MT |
6-స్పీడ్ iMT, 7-స్పీడ్ DCT |
6-స్పీడ్ MT (కొత్త), 6-స్పీడ్ iMT, 6-స్పీడ్ AT |
వేరియంట్ల వారీగా పవర్ట్రెయిన్ ఎంపికలు
వెల్లడైన సమాచారం ప్రకారం, 2024 కియా సోనెట్ టెక్లైన్ వేరియంట్లో డీజిల్-మాన్యువల్ ఎంపికతో అందించబడుతుంది, అయితే iMT ఎంపిక రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. అయితే టాప్-స్పెక్ GT లైన్ మరియు ఎక్స్-లైన్ వేరియంట్లలో డీజిల్-ఆటోమేటిక్ ఎంపిక మాత్రమే లభిస్తుంది.
వేరియంట్ |
HTE |
HTK |
HTK+ |
HTX |
HTX+ |
GTX+ |
X- లైన్ |
1.5-లీటర్ డీజిల్ 6-స్పీడ్ MT |
✅ |
✅ |
✅ |
✅ |
✅ |
– |
– |
1.5-లీటర్ డీజిల్ 6-స్పీడ్ iMT |
– |
– |
– |
✅ |
✅ |
– |
– |
1.5-లీటర్ డీజిల్ 6-స్పీడ్ AT |
– |
– |
– |
✅ |
– |
✅ |
✅ |
ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి?
ఇందులో 10.25 అంగుళాల టచ్స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే (సెల్టోస్తో), 360 డిగ్రీల కెమెరా వంటి ఫీచర్లు ఉంటాయని ధృవీకరిస్తూ ఇప్పటివరకు రెండు అధికారిక టీజర్లు విడుదలయ్యాయి. వీటితో పాటు సన్ రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కూడా మునుపటిలా అందుబాటులో ఉంటాయి.
ప్రయాణీకుల భద్రత కోసం, కొత్త సోనెట్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఉంటుంది, దీని కింద లాన్ కీప్ అసిస్ట్ మరియు ఫార్వర్డ్ కోయలిషన్ అవాయిడెన్స్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు ఆరు ఎయిర్ బ్యాగులు (ప్రామాణికం), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఫ్రంట్, రేర్ పార్కింగ్ సెన్సార్లు వంటి భద్రతా ఫీచర్లను కూడా కంపెనీ అందించనుంది.
ఆశించిన ధర మరియు ప్రత్యర్థులు
కొత్త కియా సోనెట్ 2024 ప్రారంభంలో భారతదేశంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ప్రొడక్షన్-స్పెక్ SUV ని డిసెంబర్ 14, 2023 న ఆవిష్కరించనున్నారు. కొత్త సోనెట్ ధర రూ .8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఇది మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300, టాటా నెక్సాన్, రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్, మరియు మారుతి ఫ్రోంక్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
మరింత చదవండి : సోనెట్ ఆటోమేటిక్
0 out of 0 found this helpful