Kia Sonet Facelift: భారతదేశంలో మొదటిసారిగా కెమెరాకు చిక్కిన కియా సోనెట్ ఫేస్ؚలిఫ్ట్
కియా సోనెట్ ఫేస్ؚలిఫ్ట్ డిజైన్ కొత్త సెల్టోస్ నుండి ప్రేరణ పొందినట్లు కనిపిస్తోంది మరియు వచ్చే సంవత్సరం ప్రారంభంలో విక్రయాలు ప్రారంభమవుతాయని అంచనా
-
ఇది ఈ కియా సబ్-4మీ SUVకి మొదటి భారీ అప్ؚడేట్.
-
రహస్య చిత్రాలలో సరికొత్త అలాయ్ వీల్స్, అప్ؚడేట్ చేయబడిన ముందు మరియు వెనుక ప్రొఫైల్, మరియు 360-డిగ్రీల కెమెరాను చూడవచ్చు.
-
క్యాబిన్ؚలో సవరించిన అప్ؚహోల్ؚస్ట్రీ మరియు నవీకరించిన సెంటర్ కన్సోల్‌తో రావచ్చు.
-
అదనపు ఫీచర్‌లలో డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మరియు ADAS కూడా ఉండవచ్చు.
-
పవర్‌ట్రెయిన్ؚలలో మార్పులు ఉండకపోవచ్చు, ప్రస్తుత పెట్రోల్ మరియు డీజిల్ యూనిట్‌లతో కొనసాగవచ్చు.
ఈ సంవత్సరం ప్రారంభంలో, తన సొంత దేశమైన కొరియాలో కియా సోనెట్ ఫేస్ؚలిఫ్ట్ మొదటి సారి కెమెరాకు చిక్కింది. ప్రస్తుత ఆగస్ట్ 2023 నాటికి, నవీకరించిన ఈ సబ్-4మీ SUV భారతదేశంలో పరీక్షించబడుతూ కనిపించింది. ఇది కియా సోనెట్ؚకు మొదటి భారీ మార్పు అని గమనించండి.
ఏం కనిపించింది?
రహస్య చిత్రాలలో, నలుపు రంగు ముసుగులో ఉన్న సిల్వర్ సోనెట్ కనిపించింది. ముసుగు ఉన్నప్పటికి, కొన్ని కొత్త వివరాలు స్పష్టంగా కనిపించాయి, కొత్త LED హెడ్‌లైట్‌లు, అప్ؚడేట్ చేయబడిన అలాయ్ వీల్ డిజైన్ మరియు టెస్ట్ వాహనంలో ఎరుపు బ్రేక్ క్యాలిపర్స్ కూడా కనిపించాయి, ఇది GT లైన్ వేరియెంట్ కావచ్చని భావిస్తున్నాము.
కొత్త అలాయ్ వీల్స్ؚతో పాటుగా, ORVM-మౌంటెడ్ సెట్ؚఅప్‌తో వస్తున్నందున 360-డిగ్రీల కెమెరా నవీకరించిన సోనెట్‌లో ఉంటుంది అని అంచనా. ఈ ప్రొఫైల్ؚకు మరే ఇతర మార్పులు ఉండకపోవచ్చు. వెనుక భాగంలో, ఈ SUVకి కొత్త సెల్టోస్ వంటి కనెక్టెడ్ LED టెయిల్ లైట్‌లు ఉండే అవకాశం ఉంది. భారీ గ్రిల్ؚతో వంపు తిరిగిన ముందు భాగం మరియు వెనుక బంపర్‌లు ఉంటాయని అంచనా.
ఇది కూడా చదవండి: సబ్-కాంపాక్ట్ SUVలో పనోరమిక్ సన్ؚరూఫ్ؚను చూడగలమా?
లోపలి భాగంలో సంభావ్య మెరుగుదలలు
సూచన కోసం ప్రస్తుత సోనెట్ క్యాబిన్ చిత్రం ఉపయోగించబడింది
ఇటీవలి రహస్య చిత్రాలలో కొత్త సోనెట్ నవీకరించిన ఇంటీరియర్ؚను చూపనప్పటికి, కియా లోపలి భాగంలో కూడా కొత్త అప్‌డేట్‌లను అందిస్తుందని భావిస్తున్నాము. లోపలివైపు మార్పులలో నవీకరించిన సీట్ల అప్ؚహోల్ؚస్ట్రీ మరియు రీడిజైన్ చేసిన సెంటర్ కన్సోల్ కూడా ఉండవచ్చు. ఇప్పటికే ఇది 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ మరియు డిజిటైజ్ చేసిన డ్రైవర్ డిస్ప్లే కోసం ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ؚను పొందింది.
మరిన్ని ఫీచర్‌ల జాబితా
కొత్త రహస్య చిత్రాలలో చూసినట్లు 360-డిగ్రీల కెమెరా మాత్రమే కాకుండా, నవీకరించిన సోనెట్ పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మరియు అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ؚతో (ADAS) కూడా రావచ్చు. ప్రస్తుతానికి ఇది వెంటిలేటెడ్ ముందు సీట్లు, ప్యాడిల్ షిఫ్టర్‌లు, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, సింగిల్-పేన్ సన్ؚరూఫ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి పూర్తి ఫీచర్‌లతో వస్తుంది. దీని భద్రత కిట్ؚలో ఆరు వరకు ఎయిర్ బ్యాగ్‌లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్ؚలు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు రివర్సింగ్ కెమెరా ఉన్నాయి.
బోనెట్ؚలో ఏవైనా మార్పులు ఉన్నాయా?
ఈ సబ్-4మీ SUV పవర్‌ట్రెయిన్ ఎంపికలో కియా ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు. ప్రస్తుతానికి సోనెట్ క్రింది ఇంజన్-గేర్ బాక్స్ ఎంపికలతో వస్తుంది:
స్పెసిఫికేషన్ |
1.2-లీటర్ N.A. పెట్రోల్ |
1-లీటర్ టర్బో పెట్రోల్ |
1.5-లీటర్ డీజిల్ |
పవర్ |
83PS |
120PS |
116PS |
టార్క్ |
115Nm |
172Nm |
250Nm |
ట్రాన్స్ؚమిషన్ |
5-స్పీడ్ MT |
6-స్పీడ్ల iMT, 7-స్పీడ్ DCT |
6-స్పీడ్ iMT, 6-స్పీడ్ AT |
విడుదల తేది మరియు ధర
ఈ కారు తయారీదారు నవీకరించిన సోనెట్‌ను వచ్చే సంవత్సరం ప్రారంభంలో విడుదల చేయవచ్చు అని మరియు దీని ప్రారంభ ధర రూ.8 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చని అంచనా. ఇది మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300, రెనాల్ట్ కైగర్, టాటా నెక్సాన్, మరియు నిసాన్ మాగ్నైట్ నుండి పోటీ ఎదురుకోనుంది.
ఇక్కడ మరింత చదవండి: కియా సోనెట్ ఆటోమ్యాటిక్