సన్‌రూఫ్‌తో కూడిన Sonet ను మరింత సరసమైన ధరతో అందించనున్న Kia
కియా సోనేట్ 2020-2024 కోసం rohit ద్వారా ఆగష్టు 29, 2023 06:48 pm ప్రచురించబడింది
- 65 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇంతకు ముందు సన్ؚరూఫ్‌ను టర్బో-పెట్రోల్ ఇంజన్ వేరియెంట్‌లؚలో మాత్రమే అందించారుؚ
-
కియా సోనెట్‌ను 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో కేవలం మూడు వేరియెంట్ؚలలోనే అందిస్తోంది: HTE, HTK మరియు HTK+.
-
1.2-లీటర్ పెట్రోల్ HTK+ వేరియెంట్ ప్రస్తుతం సన్ؚరూఫ్ؚతో వస్తోంది, దీని ధర రూ.9.76 లక్షలుగా ఉంది.
-
సోనెట్ HTK+ ఆటో AC, 8-అంగుళాల టచ్ؚస్క్రీన్ మరియు నాలుగు ఎయిర్ బ్యాగ్ؚలను కూడా పొందింది.
-
1.2-లీటర్ యూనిట్ మాత్రమే కాకుండా, సోనెట్ 1-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ؚలతో కూడా వస్తుంది.
-
ఈ సబ్-4మీ SUV ధరలు రూ.7.79 లక్షల నుండి రూ.14.89 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ఉన్నాయి.
కియా సోనెట్ ప్రస్తుతం తేలికపాటి ఫీచర్ అప్ؚడేట్‌లను పొందింది, దీని వలన సింగిల్-పేన్ సన్ؚరూఫ్ మరింత చవకగా లభిస్తుంది. ప్రస్తుతం 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚ గల HTK+ వేరియెంట్ؚలో కూడా సన్ؚరూఫ్‌ను అందిస్తున్నారు, దిని ధర రూ.9.76 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది. సోనెట్ ఇతర వేరియంట్‌లు అయిన HTE మరియు HTKؚలలో మాత్రమే ఈ ఇంజన్ؚను అందిస్తున్నారు. 1-లీటర్ టర్బో-పెట్రోల్ؚతో వచ్చే సంబంధిత వేరియెంట్ؚలో ఇప్పటికే సన్ؚరూఫ్ అందుబాటులో ఉంది. తద్వారా సన్ؚరూఫ్ గల సోనెట్ ప్రస్తుతం రూ.70,000 వరకు చవకగా లభిస్తుంది.
ఇంకేవైనా మార్పులను పొందిందా?
HTK+ 1.2-లీటర్ పెట్రోల్ వేరియెంట్ؚకు సన్ؚరూఫ్ؚను జోడించడాన్ని మినహాహిస్తే, ఈ SUV ఎక్విప్మెంట్ జాబితాకు కియా ఎక్కువ మార్పులు చేయలేదు. సోనెట్ 1.2-లీటర్ HTK+ ఇప్పటికీ ఆటో హెడ్ؚలైట్ؚలు, ఆటో AC, 8-అంగుళాల టచ్ؚస్క్రీన్ యూనిట్, హైట్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ మరియు కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్‌లతో వస్తుంది.
సబ్-4మీ కియా SUV టాప్ వేరియెంట్ؚలు 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ؚలు మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి మరిన్ని ఫీచర్‌లను కలిగి ఉంది.
ప్రయాణీకుల భద్రత కోసం నాలుగు ఎయిర్ బ్యాగ్‌లు, EBDతో ABS, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), రేర్ డీఫాగర్, మరియు రేర్ పార్కింగ్ కెమెరా ఉన్నాయి. టాప్ వేరియెంట్ؚలు ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ఆటో-డిమ్మింగ్ IRVM, వాషర్ؚతో వెనుక వైపర్ؚను పొందుతాయి.
ఇది కూడా చూడండి: మళ్ళీ పరీక్షిస్తూ కనిపించిన కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్: 2024 ప్రారంభంలో విడుదల అవుతుందని అంచనా
అదే ఇంజన్ؚల సెట్
కియా, సోనెట్‌ను మూడు ఇంజన్ ఎంపికలతో అందిస్తుంది: 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (120Ps/172Nm), 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (83PS/115Nm) మరియు 1.5-లీటర్ డీజిల్ యూనిట్ (115PS/250Nm). టర్బో-పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ iMT (క్లచ్ؚలెస్ మాన్యువల్) లేదా 7-స్పీడ్ DCTకు (డ్యూయల్-క్లచ్ ట్రాన్స్ؚమిషన్) జత చేయబడింది. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ؚతో లభిస్తుంది, డీజిల్ యూనిట్ 6-స్పీడ్ iMT లేదా 6-స్పీడ్ ఆటోమ్యాటిక్ؚతో జత చేయబడింది. మూడు ఇంజన్ؚల ఎంపికతో HTK+ వేరియెంట్ؚను కేవలం మాన్యువల్ మరియు iMT ఎంపికలో మాత్రమే కియా అందిస్తుంది.
ధర పరిధి మరియు పోటీదారులు
ఈ సబ్-4మీ SUVని కీయా రూ.7.79 లక్షలు మరియు రూ.14.89 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య విక్రయిస్తుంది. టాటా నెక్సాన్, నిస్సాన్ మాగ్నైట్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300, మారుతి బ్రెజ్జా, రెనాల్ట్ కైగర్, మరియు సబ్-4మీ క్రాస్ؚఓవర్, మారుతి ఫ్రాంక్స్ؚతో సోనెట్ పోటీ పడుతుంది.
ఇక్కడ మరింత చదవండి: సోనెట్ డీజిల్
0 out of 0 found this helpful