దాదాపుగా 32,000 బుకింగ్ؚలను అందుకున్న Kia Seltos Facelift, 3 నెలల వరకు ఉన్న వెయిటింగ్ పీరియడ్

కియా సెల్తోస్ కోసం rohit ద్వారా ఆగష్టు 17, 2023 08:01 pm ప్రచురించబడింది

  • 1.2K Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మొత్తం బుకింగ్ؚలలో సుమారు 55 శాతం వరకు కియా సెల్టోస్ టాప్-స్పెక్ వేరియెంట్ؚల (HTXపై వేరియెంట్ؚల నుండి) బుకింగ్ؚలు ఉన్నాయి

Kia Seltos

  • నవీకరించిన సెల్టోస్ؚను కియా జూలై 2023లో భారతదేశంలో విడుదల చేసింది. 

  • బుకింగ్ؚలను ప్రారంభించిన మొదటి రోజే ఈ SUV 13,000 ఆర్డర్ؚలను అందుకుంది. 

  • మొత్తం ఆర్డర్ؚలలో 19 శాతం వరకు ప్యూటర్ ఆలివ్ రంగు బుకింగ్ؚలే ఉన్నాయి. 

  • న్యూఢిల్లీ మరియు చెన్నై వంటి మెట్రో నగరాలలో దిని వెయిటింగ్ పీరియడ్ రెండు నెలల వరకు ఉంది. 

  • సెల్టోస్ ధర రూ.10.90 లక్షల నుండి రూ.20 లక్షల (ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా) వరకు ఉంది.

కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ ఒక నెలలో సుమారుగా 32,000 బుకింగ్ؚలను అందుకుంది (ఖచ్చితంగా చెప్పాలంటే 31,716). నవీకరించిన ఈ SUV మొదటి రోజే 13,424 బుకింగ్ؚలను అందుకుందని ఇంతకు ముందే తెలిపాము. నవీకరణకు ముందు కూడా ఈ మోడల్ మొదటి రోజు బుకింగ్ లు 6,000 కంటే ఎక్కువగా ఉన్నాయి మరియు అక్టోబర్ 2019 నాటికి 50,000-బుకింగ్ؚల మార్క్ؚను దాటింది. 

… వేచి ఉండండి, ఇంకా ఉంది

Kia Seltos

అందుకున్న ఈ మొత్తం బుకింగ్ؚలలో సుమారు 55 శాతం బుకింగ్‌లు టాప్-స్పెక్ HTX వేరియెంట్ నుండి మొదలుకొని ఉన్నాయి అని కియా వెల్లడించింది. అంతేకాకుండా, అందుకున్న మొత్తం బుకింగ్ؚలలో భారతదేశానికి ప్రత్యేకమైన ప్యూటర్ ఆలివ్ రంగు కోసం బుకింగ్‌లు సుమారు 19 శాతం ఉన్నాయని ఈ కొరియన్ కారు తయారీదారు తెలియజేశారు.

ఇది కూడా చూడండి: భారతదేశంలో మొదటిసారిగా కనిపించిన కియా సోనెట్ ఫేస్ؚలిఫ్ట్

శుభవార్త 

న్యూఢిల్లీ, బెంగళూరు మరియు చెన్నై వంటి మెట్రో నగరాలలో వెయిటింగ్ సమయం రెండు నెలల వరకు ఉంది. ముంబైలో ఉన్న వారు ఈ SUVని వెంటనే డెలివరిని పొందవచ్చు, లక్నోలో ఉన్నవారు మాత్రం మూడు నెలల వరకు వేచి ఉండాల్సి ఉంది.

కొత్త సెల్టోస్ శీఘ్ర పునశ్చరణ

Kia Seltos dashboard

మిడ్-లైఫ్ నవీకరణతో కియా సెల్టోస్ లుక్ పరంగా అనేక మెరుగుదలలను పొందింది, వీటిలో రీడిజైన్ చేసిన ముందు భాగం మరియు కనెక్టెడ్ LED టెయిల్‌లైట్‌లు ఉన్నాయి. లోపలివైపు, ఇది రీడిజైన్ చేసిన డ్యాష్ؚబోర్డ్ లేఅవుట్ؚను పొందింది, దీనిలో ముఖ్యాంగా చెపుకునేది డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్ؚలు (ఒకటి ఇన్ఫోటైన్మెంట్ కోసం మరొకటి ఇన్స్ؚట్రుమెంటేషన్ కోసం). 

అంతేకాకుండా, ఈ వాహనంలో అనేక ఫీచర్‌లను అందిస్తున్నారు ఇందులో ప్రస్తుతం పనోరమిక్ సన్ؚరూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ ఉన్నాయి. భద్రత ఫీచర్‌లలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్ؚలు, 360-డిగ్రీల కెమెరా మరియు అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఉన్నాయి. 

సెల్టోస్ ఇప్పటికీ వివిధ ఇంజన్-గేర్‌బాక్స్ కాంబినేషన్‌ల శ్రేణిలో లభిస్తుంది, అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:

Kia Seltos engine

స్పెసిఫికేషన్

1.5-లీటర్ N.A. పెట్రోల్

1.5-లీటర్ టర్బో-పెట్రోల్

1.5-లీటర్ డీజిల్

పవర్

115PS

160PS

116PS

టార్క్

144Nm

253Nm

250Nm

ట్రాన్స్ؚమిషన్

6-స్పీడ్ MT, CVT

6-స్పీడ్ iMT, 7-స్పీడ్ DCT

6-స్పీడ్ iMT, 6-స్పీడ్ AT

సెల్టోస్ؚను కియా రూ.10.90 లక్షల నుండి రూ.20 లక్షల (ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా) మధ్య విక్రయిస్తుంది. ఇది హ్యుందాయ్ క్రెటా, టయోటా హైరైడర్, MG ఆస్టర్, మారుతి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్, VW టైగూన్ మరియు రాబోయే హోండా ఎలివేట్ మరియు సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ؚలతో పోటీ పడుతుంది. 

సంబంధించినవి: కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ؚను డ్రైవ్ చేసిన తరువాత మేము తెలుసుకున్న 5 విషయాలు

ఇక్కడ మరింత చదవండి: కియా సెల్టోస్ ఆన్ؚరోడ్ ధర

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన కియా సెల్తోస్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience