• login / register

స్కోడా నుండి రానున్న కియా సెల్టోస్-ప్రత్యర్థి ఇంటీరియర్ ఆటో ఎక్స్‌పో 2020 ముందే మనల్ని ఊరించింది

ప్రచురించబడుట పైన dec 26, 2019 11:23 am ద్వారా dhruv.a for స్కోడా కామిక్

  • 29 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

స్కోడా యొక్క విజన్ IN దాని స్టీరింగ్ వీల్‌ లోని లోగోకు బదులుగా బ్రాండ్ అక్షరాలను పొందుతుంది

Skoda’s Kia Seltos-rival’s Interior Teased Ahead Of Auto Expo 2020

  •  స్కెచ్‌ లు స్వేచ్ఛగా ఉండే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ను వెల్లడిస్తున్నాయి.
  •  స్కోడా కాంపాక్ట్ SUV ఈ విభాగంలో వర్చువల్ కాక్‌పిట్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందిన మొదటి SUV అవుతుంది.
  •  ఇంటీరియర్ యూరో-స్పెక్ కమిక్, కొత్త రాపిడ్ మరియు స్కాలా వంటి స్కోడా యొక్క తాజా కాంపాక్ట్ మోడళ్లతో సమానంగా కనిపిస్తుంది
  •  ఇది 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ తో నడుస్తుంది.
  •  కామిక్ ఆధారిత SUV కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, నిస్సాన్ కిక్‌లకు ప్రత్యర్థిగా ఉంటుంది.
  •  ప్రొడక్షన్-స్పెక్ మోడల్ Q2 2021 లో లాంచ్ అవుతుంది

కియా సెల్టోస్ మరియు హ్యుందాయ్ క్రెటా వంటి వాటితో పోటీ పడే కాంపాక్ట్ SUV యొక్క ఇంటీరియర్ స్కెచ్‌లను స్కోడా ఇండియా వెల్లడించింది. 2021 లో లాంచ్ కానున్న ఈ SUV కమిక్ ఆధారంగా ఉంటుంది. ఇది కాన్సెప్ట్‌ గా ఢిల్లీ లో జరిగే 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రారంభమవుతుంది. ఇది దాని విభాగంలో లేదా అంతకు మించి ఎక్కడా చూడని ఫాన్సీ టచ్‌లు మరియు ప్రీమియం లక్షణాలను కలిగి ఉంది.

స్కోడా విజన్ IN యొక్క లోపలి భాగంలో డాష్‌బోర్డ్, డోర్ ట్రిమ్స్ మరియు దాని సెంట్రల్ కన్సోల్ సైడ్స్ కి వంటి అనేక టచ్‌పాయింట్లలో నారింజ రంగు వస్తుంది. ఇక్కడ హైలైట్ ఒక ఫ్రీ-ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, ఇది 9.25-అంగుళాల యూనిట్ కావచ్చు (యూరో-స్పెక్ మోడల్ మాదిరిగానే). ఈ యూనిట్ ఆండ్రాయిడ్ ఆటోతో పాటు వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే ఫీచర్‌ను పొందుతుంది.

నావిగేషన్, ఇంజిన్ గణాంకాలు మరియు ఇతర సమాచారాన్ని ప్రసారం చేసే విజన్ IN కోసం స్కోడా పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ధృవీకరించింది. మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ అనేది త్రీ-స్పోక్ ఫ్లాట్ బాటమ్డ్ యూనిట్, ఇది క్రోమ్ నూర్ల్ ఫినిషింగ్ మరియు వింగ్ యారోకి బదులుగా స్కోడా లెటరింగ్ ఉంది. సెంట్రల్ టన్నెల్‌ లో ఆటోమేటిక్ గేర్ సెలెక్టర్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ కోసం బ్లాక్-అవుట్ ప్లేట్ కూడా ఉన్నాయి. స్కోడా SUV లో పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందిస్తుందని మేము ఆశిస్తున్నాము.

Skoda Kamiq

MQB A0 IN- ఆధారిత స్కోడా విజన్ IN 1.0-లీటర్, 3-సిలిండర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్ (115 పిఎస్ / 200 ఎన్ఎమ్) తో పవర్ ని ఇస్తుంది, ఎందుకంటే BS 6 యుగంలో కార్ల తయారీదారు డీజిల్ పవర్‌ట్రైన్‌లను తొలగించనున్నారు. ఫ్యాక్టరీ తో అమర్చిన CNG కిట్‌ను కూడా అందిస్తుందని ఆశిస్తున్నాము. ట్రాన్స్మిషన్ ఎంపికలలో 7-స్పీడ్ DSG తో పాటు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కూడా ఉండాలి.

వెలుపలి విషయానికొస్తే, రాబోయే సమర్పణ పొడవు 4.26 మీటర్లు, ఇది 4,241mm పొడవు ఉన్నయూరో-స్పెక్ కమిక్‌ కు చాలా దగ్గరగా ఉంటుంది. మేము ఇటీవల భారతదేశంలో స్కోడా కమిక్ టెస్టింగ్ అవుతుండగా గుర్తించాము మరియు దాని నుండి ఏమి తెలుసుకున్నామో ఇక్కడ ఉంది.

ఇండియా-స్పెక్ కమిక్ 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడుతుంది, తరువాత 2021 రెండవ త్రైమాసికంలో ప్రారంభించబడుతుంది. ధరలు 10 లక్షల నుండి 16 లక్షల రూపాయల వరకు పెరుగుతాయని అంచనా వేయడంతో, ఇది కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా మరియు నిస్సాన్ కిక్స్ వంటి వాటితో పోటీ పడుతుంది. యూరో-స్పెక్ కాంపాక్ట్ SUV ని కమిక్ అని పిలుస్తారు, ఇండియా-స్పెక్ మోడల్‌ కు కొత్త పేరు రావచ్చు.

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన స్కోడా కామిక్

Read Full News
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?