జీప్ రాంగ్లర్ అన్ లిమిటెడ్, 2016 భారత ఆటో ఎక్స్పో వద్ద బహిర్గతం

ప్రచురించబడుట పైన Feb 04, 2016 04:32 PM ద్వారా Abhijeet for జీప్ రాంగ్లర్ 2016-2019

  • 2 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మొదటి సారి ఈ ఆటో ఎక్స్పో గడ్డ పై బారీ మీడియా సిబ్బందిని తీసుకురాబోతున్నారు. అంతేకాకుండా, కార్దేఖొ ఈ ఆటో ఎక్స్పో 2016 లో అత్యంత విసృత వాహనాలను తీసుకొస్తుంది.

ఎఫ్ సి ఏ భారతదేశం, గత నోయిడా వద్ద కొనసాగుతున్న భారత ఆటో ఎక్స్పో వద్ద జీప్ రాంగ్లర్ అన్ లిమిటెడ్ వాహనాన్ని బహిర్గతం చేసింది. ఈ వాహనం, 2016 రెండవ త్రైమాసికంలో విడుదల అవుతుంది అని భావిస్తున్నారు. దీనితో పాటు, గ్రాండ్ చెకోరీ వంటి జీప్ వాహనాలు కూడా బహిర్గతం అవుతాయి. అమెరికన్ ఆఫ్ రోడింగ్ సంస్థ, వారి వాహనాలను భారతదేశంలోకి ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి కానీ, ఇప్పటి వరకు ఏ రకంగా కూడా నిర్ధారించలేదు. ఈ వాహనం ప్రారంభమయినప్పుడు, రాంగ్లర్ వాహనం ఇదే విభాగంలో ఉండే ల్యాండ్ రోవర్ ఫ్రీ లాండర్ వంటి వాహననైకి గట్టి పోటీ ను ఇస్తుంది కానీ, ఈ వాహనం ఒక పోటీ ధర వద్ద ప్రవేశపెట్టబడే అవకాశం ఉంది.

ఈ కటినమైన ఆఫ్ రోడ్ వాహనాలు, జీప్ యొక్క డిజైన్ లను కలిగి ఉంది. ఈ వాహనం యొక్క బాహ్య భాగాన్ని చూసినట్లైతే, ఈ వాహనం యొక్క ముందు చక్రాలకు ఫ్లారెడ్ వీల్ ఆర్చులు అందించబడతాయి. ఈ వాహనానికి, కాంటెంపరరీ స్టైల్డ్ బోనెట్ సెట్ అప్ మరియు సిగ్నేచర్ జీప్ గ్రిల్ వంటివి అందించబడతాయి. ఈ వాహనం యొక్క బంపర్ ను చూసినట్లైతే, ఎస్యువి యొక్క రూపాన్ని కలిగి ఉంటుంది. ఈ వాహనం యొక్క వెనుక భాగం విషయానికి వస్తే, క్లాసిక్ జీప్ యొక్క చిత్రాన్ని పోలి ఉంటుంది. వెనుక భాగంలో టైల్ గేట్ లో ఒక విడి చక్రం అందించబడుతుంది.
ఈ వాహనం యొక్క లోపలి భాగం విషయానికి వస్తే, లోపలి భాగం అంతా విలాసవంతంగా మరియు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. కటినమైన బాహ్య భాగాలతో ఈ వాహనం గట్టి పోటీ ను ఇస్తుంది. క్యాబిన్ లో ఉండే నలుపు డాష్బోర్డ్, టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ, సర్చులర్ ఏ సి వెంట్ లతో మరియు నియంత్రణ లతో పాటు మందపాటి గ్రాబ్ రైల్స్ వంటి అంశాలతో రాబోతుంది. డ్రైవర్ కు కీలకమైన సమాచారాన్ని అందించడం కోసం, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పాటు డిజిటల్ స్క్రీన్ తో వస్తుంది. క్యాబిన్ లో ఉండే ఫేట్ మూడు స్పోక్ల స్టీరింగ్ వీల్, క్రూజ్ కంట్రోల్, సంగీతం మరియు కాల్ నియంత్రణ స్విచ్చులు వంటివి అందంగా పొందుపరచబడి ఉంటాయి. 

జాప్ రాంగ్లర్ యొక్క ప్రదర్శన వీడియోను వీక్షించండి

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన జీప్ రాంగ్లర్ 2016-2019

Read Full News
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?