• English
  • Login / Register

జీప్ కంపాస్: వేరియంట్ల వివరణ

జీప్ కంపాస్ 2017-2021 కోసం raunak ద్వారా మార్చి 11, 2019 12:39 pm సవరించబడింది

  • 19 Views
  • 5 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Jeep Compass

జూలై 31, 2017 న ప్రారంభించబడిన జీప్ కంపాస్ ధర రూ. 15.40 లక్షలు మరియు 22.90 లక్షల (ఎక్స్-షోరూమ్, న్యూ ఢిల్లీ) మధ్య ఉండేది. GST మీద సెస్  కారణంగా సెప్టెంబర్ 9, 2017 నుండి దీని ధర రూ.72,000 రూపాయల వరకు పెరిగింది. అయినప్పటికీ కూడా మీకు కొనుగోలు చేసుకొనే  ప్లాన్ ఉన్నట్లయితే ఇప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.   

Jeep Compass

ముఖ్యాంశాలు

  • కంపాస్ మూడు ట్రిమ్ స్థాయిలో అందుబాటులో ఉంది - స్పోర్ట్ (బేస్), లాంగిట్యూడ్ మరియు రేంజ్ టాపింగ్ లిమిటెడ్. అగ్ర రెండు వేరియంట్లు అయిన లాంగిట్యూడ్ (O) మరియు లిమిటెడ్ (O) పై ఆధారపడి మూడు ఆప్ష్నల్ ట్రిమ్స్ కూడా ఉన్నాయి. అన్నింటిలో, ఎంచుకోవడానికి 4X4 వేరియంట్ తో సహా 13 వేరియంట్లు ఉన్నాయి. ఈ 4X4 వేరియంట్ టాప్-ఎండ్ డీజిల్ స్పెక్ లో మాత్రమే లభిస్తుంది.
  • మీరు పెట్రోల్ కంపాస్ ను కొనుగోలు చేయాలనుకుంటే, 1.4 లీటర్ మల్టీఏయిర్II టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ బేస్-స్పెక్ స్పోర్ట్ మరియు టాప్-స్పెక్ లిమిటెడ్ 4X2 వేరియంట్స్ లో మాత్రమే లభిస్తుంది.
  • బేస్ పెట్రోల్ స్పోర్ట్ ట్రిమ్ కేవలం 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో మాత్రమే అందుబాటులో ఉండగా, టాప్-స్పెక్ లిమిటెడ్ పెట్రోల్ ట్రిమ్స్ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్  తో మాత్రమే లభిస్తాయి.  
  • డీజిల్ ఇంకా ఆటోమేటిక్ ఎంపికను అందించడం లేదు. అయితే, డీజిల్ ఆటో (9-స్పీడ్ ఆటో) 2019 మొదటి సగభాగంలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు.  
  • డీజిల్-పవర్డ్ కంపాస్  4X4 ఎంపికను టాప్-స్పెక్ లిమిటెడ్, లిమిటెడ్ (O) మరియు లిమిటెడ్ (ప్లస్) ట్రిమ్స్ లో మాత్రమే పొందుతుంది.  

Jeep Compass

ప్రామాణిక భద్రతా లక్షణాలు

  • డ్యుయల్-ఫ్రంట్ ఎయిర్ బాగ్స్
  • ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ తో యాంటీ లాక్ బ్రేక్ సిష్టం, HBFC, PBA , నాలుగు డిస్క్ బ్రేక్లు మరియు అడాప్టివ్ బ్రేక్ లైట్లు వంటి లక్షణాలతో ప్రామాణిక భద్రతను కలిగి ఉంది.Jeep Compass
  • హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్) మరియు TSC (ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్)
  • డే టైం రన్నింగ్ ల్యాంప్స్(LED కావు)

Jeep Compass

  • ISOFIX చైల్డ్ సీటు యాంకర్స్
  • అన్ని సీజన్ టైర్లు
  • ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్
  • డైనమిక్ స్టీరింగ్ టార్క్

రంగు ఎంపికలు

  • వోకల్ వైట్
  • బ్రిలియంట్ బ్లాక్
  • మినిమల్ గ్రే
  • హైడ్రో బ్లూ
  • ఎక్సోటికా రెడ్

ఇంజిన్లు

  • డీజిల్: 2.0-లీటర్ ఎకోడీసెల్ (ఫియట్ మల్టీజిట్ II)
  • పెట్రోల్: 1.4 లీటర్ మల్టీఎయిర్ II(ఫియట్)

జీప్ కంపాస్ స్పోర్ట్

Jeep Compass

ధర (ఎక్స్ షోరూమ్, న్యూ ఢిల్లీ)

వేరియంట్స్

ధరలు

పెట్రోల్ MT స్పోర్ట్

రూ.15.40 లక్షలు

డీజిల్ స్పోర్ట్

రూ.16.60 లక్షలు

లక్షణాలు

  • క్వాడ్ హాలోజన్ హెడ్ల్యాంప్స్
  • 16 ఇంచ్ స్టీల్ వీల్స్ మీద ప్రయాణం
  • ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ తో వస్తుంది
  • ఫాబ్రిక్ అపోలిస్ట్రీ తో బ్లాక్ ఇంటీరియర్ కలిగి ఉంటుంది
  • మాన్యువల్ ఎయిర్ కండీషనింగ్
  • FCA యొక్క Uకనెక్ట్ 5.0 టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కలిగి ఉంటుంది. ఈ యూనిట్ ఒక 5-అంగుళాల టచ్స్క్రీన్, AM / FM రేడియో, బ్లూటూత్ ఆడియో స్ట్రీమింగ్, వాయిస్ కమాండ్ మరియు టెక్స్ట్ రిప్లై తో(ఐఫోన్ పరికరాలు అనుకూలంగా లేదు) పాటు  హ్యాండ్స్-ఫ్రీ కాలింగ్ ని కలిగి ఉంటుంది.

Uconnect 5.0

కొనుగోలు చేసుకునేందుకు ఈ వేరియంట్ సరైనదా?

ఈ బేస్ జీప్ కంపాస్ స్పోర్ట్ మిడ్ సైజెడ్ SUV విభాగంలో చాలా ఎక్కువ ధరను కలిగి ఉంది. మీరు బడ్జెట్ లో ఉండి మరియు జీప్ కొనుగోలు చేసుకోవాలని అనుకుంటున్నారా! అయితే ఈ వేరియంట్ ని తీసుకోవచ్చు. ఈ స్పోర్ట్ ట్రిం భద్రత విషయాలలో అస్సలు వెనక్కి తగ్గదు. దీనిలో ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్) మరియు TCS (ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్) వంటి లక్షణాలు ఉన్నాయి. కానీ ఈ జీప్ రేర్-పార్కింగ్ సెన్సార్స్, A.C మాన్యువల్ వంటి కొన్ని అవసరమైన లక్షణాలను కలిగి లేదు. దీని యొక్క రూ.15 లక్షల ధర కి ఈ లక్షణాలు లేకపోవడం అనేది కొంచెం నిరాశజనకం. ముందర భాగంలో ఇంఫోటైన్మెంట్ సిష్టం విషయానికి వస్తే ఇతర మార్కెట్లలో మాదిరిగానే జీప్ దాని బేస్ ట్రిం లో  5 అంగుళాల టచ్‌స్క్రీన్ ని అందిస్తుంది, కానీ ఆండ్రాయిడ్ ఆటో లేదా ఆపిల్ కార్ప్లే ని సపోర్ట్ చేయదు.

Jeep Compass Sport

జీప్ కంపాస్ లాంగిట్యూడ్ / లాంగిట్యూడ్ (O)

ధర (ఎక్స్ షోరూమ్, న్యూ ఢిల్లీ)

వేరియంట్స్

ధరలు

డీజిల్ లాంగిట్యూడ్

రూ. 17.92 లక్షలు

డీజిల్ లాంగిట్యూడ్ (O)

రూ .18.78 లక్షలు

Jeep Compass

స్పోర్ట్ ట్రిమ్ మీద, లాంగిట్యూడ్ అందిస్తున్న లక్షణాలు

  • డ్యుయల్-టోన్ లోపలి భాగాలు: నలుపు మరియు బీజ్
  • ముందు మరియు వెనుక ఫాగ్ ల్యాంప్స్ అందిస్తుంది
  • 17-ఇంచ్ ఐదు- స్పోక్ అల్లాయ్ వీల్స్ లో ప్రయాణాలు
  • ఇంజిన్ పుష్-బటన్ స్టార్ట్-స్టాప్ తో పాసివ్ కీలెస్ ఎంట్రీ సిస్టమ్ కలిగి ఉంటుంది.

Jeep Compass

  • ఆటోమెటిక్ పవర్ ఫోల్డింగ్ అవుట్‌సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్
  • వెనుక పార్కింగ్ సెన్సార్స్ అందిస్తుంది

లాంగిట్యూడ్ (O) అదనంగా Uకనెక్ట్ 7.O ని 7-అంగుళాల టచ్స్క్రీన్ ను ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ తో మరియు డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ (ఆక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్) నియంత్రణలతో పాటు అందిస్తుంది.అలాగే ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ మరియు బ్లాక్ రూఫ్ రెయిల్స్ ని కూడా అందిస్తుంది.   

Uconnect 7.0

కొనుగోలు చేసుకొనేందుకు ఈ వేరియంట్ సరైనదా?

ఈ లాంగిటూడ్ వేరియంట్ ప్రీమియం ను పెంచుతుంది. అయితే లాంగిట్యూడ్ (O) కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ తో 7-ఇంచ్ Uకనెక్ట్  టచ్‌స్క్రీన్ ని అధనంగా కలిగి ఉండి మరింత అనుభవాన్ని పెంచుతుంది. లిమిటెడ్ (O) లో ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ తో పాటు డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ కూడా జతచేయబడింది. మేము చెప్పేది ఏమిటంటే మీకు కంపాస్ లో SUV కావాలనుకుంటే ఈ లాంగిట్యూడినల్(O) కి వెళ్ళండి. దురదృష్టవశాత్తూ, లాంగిట్యూడ్ మరియు లాంగిట్యూడ్ (O) రెండూ పెట్రోలు ఎంపికను అందిచడం లేదు.దీనివలన స్పోర్ట్ వేరియంట్ పైన అధనంగా రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

Jeep Compass

జీప్ కంపాస్ లిమిటెడ్ / లిమిటెడ్ (O)

లిమిటెడ్

వేరియంట్స్

ధరలు

పెట్రోల్ లిమిటెడ్ AT

రూ.19.96 లక్షలు

డీజిల్ లిమిటెడ్MT

రూ. 19.63 లక్షలు

డీజిల్ లిమిటెడ్ 4x4 MT

రూ.21.40 లక్షలు

లిమిటెడ్ (O)

వేరియంట్స్

ధరలు

పెట్రోల్ లిమిటెడ్ (O)AT

రూ.20.55 లక్షలు

డీజిల్ లిమిటెడ్ (O)MT

రూ.20.21 లక్షలు

డీజిల్ లిమిటెడ్ (O) 4x4 MT

రూ.21.99 లక్షలు

లాంగిట్యూడ్(O) మీద, లిమిటెడ్ అందించే లక్షణాలు:

  • డ్యుయల్-టోన్ ఇంటీరియర్: నలుపు మరియు గ్రే

Jeep Compass Interior

  • 'రూబీ రెడ్'స్టిచ్ తో 'స్కీ-గ్రే' మెకిన్లే లెథర్ తో అప్హోల్స్టర్ వస్తుంది.

Jeep Compass

  • లెదర్-వ్రాపెడ్ స్టీరింగ్ వీల్

Jeep Compass Steering Wheel

  • Uకనెక్ట్ 7.0 రేర్ కెమెరా తో వస్తుంది
  • డోర్ స్కఫ్ ప్లేట్స్
  • భిన్నమైన అలాయిస్ తో 17 ఇంచ్ వీల్స్ పై ప్రయాణాలు

Jeep Compass Alloys

  • డీజిల్ 4X4 వేరియంట్ జీప్ ఆక్టివ్ రైడ్ తో సెలేక్-టెర్రైన్ వ్యవస్థతో కలిగి ఉంది, ఇది ఆటో, మంచు, ఇసుక మరియు మట్టి డ్రైవింగ్ మోడ్ లను  అందిస్తుంది.

Jeep Compass

  • డీజిల్ 4x4 వేరియంట్ మొత్తం ఆరు ఎయిర్బాగ్లను అందిస్తుంది (డ్యూయల్-ఫ్రంట్, సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్బాగ్స్).

Jeep Compass

లిమిటెడ్ (O) అదనంగా హై-ఇంటెన్సిటీ డిచ్ఛార్జ్ (HID) హెడ్ల్యాంప్స్ మరియు డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్ (బ్లాక్ పెయింట్ పైకప్పు) అధనంగా అందిస్తుంది.

Jeep Compass

ఈ వేరియంట్ కొనుగోలు చేసేందుకు సరైనదా?

లిమిటెడ్ ట్రిమ్ ఎక్కువ రేంజ్ ఉన్న ఇంజిన్ మరియు డ్రైవ్ ట్రైన్ ఆప్షన్ లను అందిస్తుంది, కానీ అంత బాగోదు. 1.4-లీటర్ టర్బో పెట్రోల్ తో 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటో తో ఆటోమేటిక్ ఆప్షన్ అందించే ఏకైక వేరియంట్ ఇది.అలాగే, ఈ వేరియంట్ లో మాత్రమే మీరు 2.0-లీటర్ డీజిల్ / 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో 4X4 ఎంపికను పొందుతారు. కాబట్టి, మీరు ఆఫ్-రోడ్డింగ్  వెళ్ళాలనుకుంటే, లిమిటెడ్ / లిమిటెడ్ (O) / లిమిటెడ్ ప్లస్ డీజిల్ 4X4 వేరియంట్స్ తో కష్టం. ఇదికాకుండా, ఆరు ఎయిర్బాగ్లను అందించే ఏకైక వేరియంట్ ఇది.

Jeep Compass Limited Plus

లిమిటెడ్ ప్లస్

వేరియంట్

ధరలు

జీప్ కంపాస్ లిమిటెడ్ ప్లస్ పెట్రోల్

రూ. 21.46 లక్షలు

జీప్ కంపాస్ లిమిటెడ్ ప్లస్

రూ. 21.12 లక్షలు

జీప్ కంపాస్ లిమిటెడ్ ప్లస్ 4X4

రూ. 22.90 లక్షలు

Jeep Compass Limited Plus

  • నోరమా సన్రూఫ్: ఈ ఒక్క వేరియంట్ లో మాత్రమే పానరోమా సున్‌రూఫ్ ఉంది. ఒకవేళ సన్రూఫ్ మీకు కావాలనుకుంటే ఈ వేరియంట్ తీసుకోవాలి.
  • పెద్ద 18 ఇంచ్ డ్యుయల్-టోన్ అల్లాయ్ వీల్స్ తో ఆటో హెడ్ల్యాంప్స్.
  • రెయిన్-సెన్సింగ్ వైపర్స్ మరియు ఆటో డిమ్మింగ్ IRVM లను పొందుతుంది, కానీ ఇప్పటికీ క్రూజ్ కంట్రోల్ కలిగి లేదు.
  • 4-వే పవర్ లంబర్ సపోర్ట్ మరియు మెమరీ ఫంక్షన్ తో 8-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు

Jeep Compass Limited Plus

  • 7-అంగుళాల టచ్‌స్క్రీన్ కి బదులుగా, మీరు ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో పెద్ద 8.4 ఇంచ్ టచ్‌స్క్రీన్ ని పొందుతారు.

ఈ వేరియంట్ కొనుగోలు చేసేందుకు సరైనదా?

మీరు జీప్ కంపాస్ ను కొనుగోలు చేసేందుకు చూస్తున్నారా! అయితే  లిమిటెడ్ (O) వరకూ మీ బడ్జెట్ను తీసుకొచ్చినట్లయితే, ఈ టాప్-స్పెక్ మోడల్ కోసం దాదాపు 1 లక్షల రూపాయలను ఎందుకు చేర్చకూడదు? EMI లో పెద్ద తేడా ఏమీ రాదు. అంతేకాకుండా, సన్రూఫ్, పెద్ద టచ్స్క్రీన్ మరియు మరికొన్ని సౌలభ్యంతో మీరు పెట్టే డబ్బుకి తప్పకుండా న్యాయం చేస్తుంది.

మీరు మీ కంపాస్ ను ఇతరుల నుండి భిన్నంగా చూసుకోవాలనుకుంటే, దానికోసం ప్రత్యేక ఎడిషన్ లు బెడ్రోక్ మరియు బ్లాక్ ప్యాక్ ఉన్నాయి.

 
www.youtube.com refused to connect.
ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Jeep కంపాస్ 2017-2021

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience